Subscribe for notification

YSRCP Plenary: వైసీపీలో టెన్షన్, ప్లీనరీ సెన్సేషన్స్ ..! ఆ ఎమ్మెల్యేలు సస్పెన్షన్..?

Share

YSRCP Plenary: ఏపిలో జూలై 7,8,9 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లానరీ సమావేశాలను గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి మహానాడు ఎంత ప్రాముఖ్యత ఉందో వైసీపీకి ప్లీనరీ అంత ఇంపార్టెంట్. టీడీపీ ఏ విధంగా అయితే ప్రతినిధుల సభ, బహిరంగ సభ నిర్వహించిందో అదే విధంగా వైసీపీ కూడా ప్రతినిధుల సభ, బహిరంగ సభ నిర్వహిస్తుంది. టీడీపీ మహానాడుకు ధీటుగా వైసీపీ ప్లీనరీ నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పార్టీ ముఖ్యనేతలకు ప్లీనరీపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మహానాడు కంటే రెండింతలకు పైగా కార్యకర్తలు, ప్రజలు హజరయ్యేలా చూడాలనీ, గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆదేశించారుట. లక్షల సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చినా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జాతీయ రహదారి పక్కన గుంటూరు ఎఎన్ యు పక్కన దాదాపు వంద ఎకరాల ఖాళీ మైదానాన్ని ప్లీనరీ నిర్వహణకు ఎంపిక చేశారు.

YSRCP Plenary: జంపింగ్ జపాంగ్ లపై వేటు..?

అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే.. ప్లీనరీ సందర్భంగా పార్టీ కొందరు నేతల పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నది అన్నది సమాచారం. రీసెంట్ గా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన ప్రకారం..ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో 65 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై సంతృప్తికర శాతం తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఆ ఎమ్మెల్యేలపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా 18 నుండి 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారని కూడా పార్టీకి సమాచారం అందింది. మరో నలుగురు జనసేనతో టచ్ లో ఉన్నారుట. వెస్ట్ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన నలుగురు జనసేనతో టచ్ లో ఉండగా, నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు, ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు, గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన ఆరుగురు ఇలా 18 నుండి 20 మంది టీడీపీతో టచ్ లో ఉన్నారుట.

నాడు సొంత పార్టీ నేతలపై నిఘాలో చంద్రబాబు ఫెయిల్

ఎవరెవరు ఏ పార్టీతో టచ్ లో ఉన్నారు..? అనేది పార్టీ పెద్దల వద్ద లిస్ట్ ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ తో పాటు పార్టీ వర్గాలు, పీకీ టీమ్ ద్వారా ఇప్పటికే పూర్తి సమాచార నివేదిక సీఎం జగన్ వద్ద ఉంది. ఎవరెవరు పార్టీలో కొనసాగుతారు..? ఎవరెవరు ఎన్నికలకు ముందు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి..? అనేది పార్టీ వద్ద ఒక అంచనా ఉంది. ఇంటెలిజెన్స్ లో గతంలో టీడీపీ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. బీ ఫారం ఇచ్చే ముందు రోజే ఆదాల ప్రభాకర్ లాంటి వాళ్లు పార్టీ జంప్ అయ్యారు. ఎవరు పార్టీలో ఉంటారు..? ఎవరు పార్టీని వీడతారు..? అనేది టీడీపీ గతంలో తెలుసుకోలేకపోయింది. ఆనాడు ఇంటెలిజెన్స్ ప్రత్యర్ధులపై చూపిన దృష్టి సొంత పార్టీ నాయకులపై పెట్టలేదు.

YSRCP Plenary: ఆ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలపై వేటు..?

కానీ జగన్మోహనరెడ్డి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనా నిఘా పెట్టారు. ప్రత్యర్ధులపైనా నిఘా పెట్టారు. అందుకే ప్రత్యర్ధి పార్టీలతో టచ్ లో ఉన్న వారి గురించి తెలుసుకున్నారు. వీరిలో నలుగురు అయిదుగురిని సస్పెండ్ చేసి అనర్హత వేటు వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేసి సస్పెండ్ చేయాలంటే పార్లమెంట్ స్పీకర్ చేతిలో ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఈజీగా వేసేయవచ్చు. సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. నలుగురు అయిదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో పాటు పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న మరి కొందరు ఇన్ చార్జిలను పార్టీ నుండి సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ నేతలకు ఒక హెచ్చరిక మేసేజ్ ఇవ్వాలని భావిస్తున్నారుట. ఈ అంశానికి సంబంధించి ప్లీనరీ తరువాత వైసీపీ తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయో వేచి చూద్దాం.


Share
Special Bureau

Recent Posts

Salman Khan: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…

17 mins ago

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

58 mins ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

2 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

3 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

3 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

4 hours ago