NewsOrbit
Education News ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: టెన్త్ విద్యార్ధులకు హాపీ న్యూస్ ..ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కీలక సూచన

Pawan Kalyan on 10th Class Exams: పదవ తరగతి పరీక్షల్లో తక్కువ మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్ధుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఉత్తీర్ణత శాతం తగ్గిందని ఆరోపించిన పవన్ కళ్యాణ్.. వెంటనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్ధులకు పది గ్రేస్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తీర్ణత శాతం తగ్గడానికి తల్లిదండ్రులే కారణమని మంత్రులు వ్యాఖ్యానించడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. విద్యార్ధులకు సరైన విద్యను అందించకుండా ప్రభుత్వం ఆ తప్పును తల్లిదండ్రులపై నెట్టడం సరికాదని అన్నారు. విద్యార్ధులకు పది గ్రేస్ మార్కులు ఇస్తే ప్రభుత్వం వారికి న్యాయం చేసినట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Pawan Kalyan requests the Government of Andhra Pradesh to allot 10 grace marks for every student who had written 10th class exams in 2022.

Janasena Chief Pawan Kalyan Key suggestions to govt For Tenth Class students
Janasena Chief Pawan Kalyan Key suggestions to govt For Tenth Class students

Pawan Kalyan on 10th Class Exam Results: రీవాల్యూయేషన్ ఉచితంగా చేయాలి

అదే విధంగా రీవాల్యూయేషన్ కూడా ఉచితంగా చేయాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. రీ వాల్యుయేషన్ కోసం రూ.500లు చెల్లించాలని ఫెయిల్ అయిన విద్యార్ధులను బాధించడం సరికాదని అన్నారు. ఇది దోపిడీ విధానమేనని విమర్శించారు. అలానే సప్లిమెంటరీ పరీక్షలకు కూడా ఎలాంటి ఫీజు తీసుకోకుండా పరక్షలను ప్రభుత్వం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు ప్రభుత్వ పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం 67.26 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేదు. 8,9 తరగతులు కూడా సక్రమంగా సాగలేదు. రెండేళ్ల విరామం తరువాత పదవ తరగతి పరీక్షలు మొదటి సారి జరిగాయి. వివిధ రకాల కారణాల నేపథ్యంలో దాదాపు 2లక్షల మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు. మొత్తం 6,15,908 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా 4,14,281 మంది మాత్రమే అత్తీర్ణులయ్యారు.

Pawan Kalyan demands for free revaluation of 10th class exam results.

Pawan Kalyan demands for free revaluation of 10th class exam results.

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని గ్రేస్ మార్కులు కలపాలని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. రెండు మూడు మార్కుల తేడాతో వేలాది మంది ఒక రెండు సబ్జెట్ లలో ఫేయిల్ అయ్యారనీ, ప్రభుత్వం గ్రేస్ మార్కులు కలిపితే వేలాది మంది విద్యార్ధినీ విద్యార్ధులకు లబ్దికలుగుతుందని అంటున్నారు. చూడాలి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N