Deepika Padukone: బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొణె కల్కీ 2898 ఏడీ మూవీతో తొలిసారి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి బిగ్ స్టార్స్ ఇతర ప్రధాన పాత్రల్లో అలరించబోతున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కల్కీ 2898 ఏడీ చిత్రం ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 9న విడుదల కానుందని అంటున్నారు. ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకు తెలుగులోనే ఇదే ఫస్ట్ మూవీని అనుకుంటున్నారు. కానీ, వాస్తవం ఏంటంటే.. కల్కీ 2898 ఏడా కన్నా ముందే దీపికా ఓ తెలుగు సినిమాలో యాక్ట్ చేసింది. బహుశా చాలా మందికి ఈ విసయం తెలియదు. ఇంతకీ దీపికా నటించిన ఫస్ట్ తెలుగు మూవీ లవ్ 4 ఎవర్.
టాలీవుడ్ ప్రేమించుకుందాం రా, బావగారూ బాగున్నారా?, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, ప్రేమంటే ఇదేరా వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసిన డైరెక్టర్ జయంత్ సి. పరాంజీ లవ్ 4 ఎవర్ చిత్రాన్ని తెరకెక్కించారు. రణీదీప్, మృదులు ఈ మూవీలో జంటగా నటించారు. అలాగే దీపికా పుదుకొణె స్పెషల్ సాంగ్ లో యాక్ట్ చేసింది. అయితే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినా.. ఇంత వరకు ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
లవ్ 4 ఎవర్ మూవీతో దీపికా పదుకొణె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ సినిమా రిలీజ్ కాకపోవడంతో తెలుగు వారికి హాయ్ చెప్పే అవకాశం దీపికా మిస్ చేసుకుంది. అయితే కల్కీ 2898 ఏడీ తో మాత్రం మిస్ అయ్యే ప్రసక్తే లేదు. కాగా, దీపికా పదుకొణె ప్రస్తుతం కల్కీ మూవీతో పాటు బాలీవుడ్ లో సింగం అగైన్ చిత్రంలో నటిస్తోంది. అజయ్ దేవ్గన్ ఇందులో హీరోగా చేస్తున్నాడు.