NewsOrbit
Cinema Entertainment News రివ్యూలు సినిమా

Dunki Review: 2023 షారుక్ ఖాన్ దే.. రెండు యాక్షన్స్ తో బ్లాక్ బస్టర్స్…ఇప్పుడు ఎమోషన్ తో హ్యాట్రిక్..”డంకీ” సినిమా రివ్యూ..!!

Dunki Review: 2017వ సంవత్సరంలో “జీరో” సినిమా పరాజయం పాలు కావటంతో షారుక్ ఖాన్ ఐదు సంవత్సరాలు సినిమాలు ఏమీ చేయలేదు. కానీ 2023లో మాత్రం బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్నట్లు మూడు సినిమాలు విడుదల చేసి.. మరుపురాని హ్యాట్రిక్ అందుకోవడం జరిగింది. మొదట రెండు యాక్షన్ సినిమాలు “జవాన్”, “పఠాన్” లతో హిట్ అందుకున్న షారుక్ ఇప్పుడు..”డంకీ” అనే ఎమోషనల్ డ్రామా తో మరో విజయాన్ని అందుకున్నారు. డిసెంబర్ 21వ తారీకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయింది.

సినిమా:డంకీ
నటినటులు:షారుఖ్‌ ఖాన్‌, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్‌, అనిల్‌ గ్రోవర్‌, విక్రమ్‌ కొచ్చర్‌, బొమన్‌ ఇరానీ తదితరులు
దర్శకత్వం:రాజ్‌ కుమార్‌ హిరానీ
నిర్మాత:గౌరీ ఖాన్‌, రాజ్‌ కుమార్‌ హిరానీ, జ్యోతీ దేశ్‌పాండే
సంగీతం:అమన్‌ పంత్‌
సినిమాటోగ్రఫీ:సీకే మురళీ ధరన్‌, మనుష్‌ నందన్‌, అమిత్‌ రాయ్‌, కుమార్‌ పంకజ్‌
విడుదల తేది: 21-12-2023

పరిచయం:

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ విజయాలతో సత్తా చాటడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాలు పాటు సినిమా చేయకుండా 2023లో జవాన్, పఠాన్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ రెండు సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. ఒక విధంగా చెప్పాలనుకుంటే 2023 పూర్తిగా షారుక్ సంవత్సరమని చెప్పవచ్చు. ఈ రకంగా మంచి జోరు మీద ఉన్న షారుక్ డిసెంబర్ 21వ తారీకు నాడు మూడో సినిమా “డంకీ” విడుదల చేయడం జరిగింది. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షారుక్ తో పాటు విక్కీ కౌశల్, తాప్సి, బోమన్ ఇరానీ, విక్రమ్ కోచ్చార్, అనిల్ గ్రోవర్ ముఖ్య పాత్రలు పోషించారు. మరి “డంకీ” సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

Shah Rukh Khan who is in form with consecutive hits this year and review of Dunki movie

స్టోరీ:

హార్డీ(షారుఖ్ ఖాన్) ఓ జవాన్. ఈ క్రమంలో ప్రాణాపాయం సమయంలో తనని కాపాడిన వ్యక్తిని కలవడానికి పంజాబ్ లోని లల్టు అనే గ్రామానికి హార్డీ.. రావటం జరుగుద్ది. ఆ సమయంలో తనకు సహాయం చేసిన వ్యక్తి చనిపోయాడని తెలుసుకుంటాడు. ఆ వ్యక్తికి మను(తాప్సి) అనే చెల్లెలు ఉంటుంది. ఆమెకు లండన్ వెళ్లాలని కోరిక ఉంటుంది. మనుకి మాత్రమే కాదు..ఆ గ్రామంలో బుగ్గు(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్).. వీళ్లంతా లండన్ వెళ్లాలని అనుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. దీంతో హార్డీ.. తనకి సహాయం చేసిన వ్యక్తి యొక్క చెల్లె మను మరియు మిగతా సభ్యులనీ లండన్ పంపాలని డిసైడ్ అవుతాడు. మను అన్నయ్య చేసిన సహాయానికి ఈ విధంగా రుణం తీర్చుకోవాలని హార్డీ(షారుఖ్ ఖాన్) డిసైడ్ అవుతాడు. దీంతో వీళ్లంతా ఇంగ్లీష్ కోచింగ్ తీసుకుని స్టూడెంట్స్ వీసా మీద వెళ్దామని భావిస్తారు. ఈ ప్రక్రియలో బల్లికి మినహా మిగతా వారందరికీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇష్టం లేని పెళ్లి చేసినందుకు తన లవర్ ని ఇంగ్లాండ్ నుంచి కాపాడి తీసుకొద్దామని.. సుఖీ(విక్కీ కౌశల్) వీసా ప్రయత్నించగా అతనిది కూడా రిజెక్ట్ అవుతుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ వెళ్లిన బల్లి.. ప్రియురాలు చనిపోయిందని సుఖీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో అతడు ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో హార్డీ.. ఎంతో ఆగ్రహం చెందుతాడు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లు మన దేశానికి వచ్చిన సమయంలో ఈ రకమైన నిబంధనలు.. మనం ఎప్పుడు పెట్టలేదు. వాళ్లకి హిందీ వచ్చా అని అడగలేదు, కానీ మనం వాళ్ళ దేశానికి వెళ్లాలనుకున్నప్పుడు ఇన్ని నిబంధనలు.. పెట్టడం అవసరమా..? అని హార్డీ(షారుఖ్ ఖాన్).. మిగతా వాళ్లంతా ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్లాలని డిసైడ్ అవుతారు. దీంతో..రూల్స్ కి వ్యతిరేకంగా అక్రమంగా దేశాలు దాటుకుంటూ “డంకీ” రూట్ నీ ఎంచుకుంటారు. మరి ఈ ప్రయాణంలో హార్డీ(షారుఖ్ ఖాన్).. మిగతా సభ్యులు ఇంగ్లాండ్ వెళ్లారా..? అక్రమంగా ఎంచుకున్న మార్గం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు..? మధ్యలో మను..హార్డీ ఎలా దూరమయ్యారు..? చివరికి ఎలా కలిశారు అనేది ఈ సినిమా స్టోరీ.

Shah Rukh Khan who is in form with consecutive hits this year and review of Dunki movie

విశ్లేషణ:

రాజ్ కుమార్ హిరానీ తన మార్క్ ఉండేలా సినిమాని నడిపించాడు. ఒకప్పుడు ఆయన దర్శకత్వంలో వచ్చిన మున్నాభాయ్ ఎంబిబిఎస్, త్రీ ఇడియట్స్, పికే, లగే రహో మున్నాభాయ్ వీటితో పోలిస్తే కొద్దిగా “డంకీ” పది పర్సెంట్ అసంతృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది అని చెప్పవచ్చు. సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ స్టోరీ. దేశం నుండి పాస్ పోర్ట్ లేకుండా.. అక్రమంగా వెళ్లాలని భావించే వారి యొక్క కష్టాలు మధ్యలో ఎదుర్కొనే సమస్యలు కళ్ళకి కట్టినట్లు చూపించారు. సినిమాలో షారుక్ నటన ఒక ఎత్తు అయితే తాప్సి అంతకుమించి అన్నట్టు “డంకీ”లో రెచ్చిపోయింది. ఓవరాల్ గా స్వదేశం నుండి విదేశాలకు వెళ్లాలని కోరిక కలిగిన గాని పుట్టిన దేశంలో ఉండే ఆనందం స్వేచ్ఛ మరి ఏ దేశంలో ఉండదని అద్భుతంగా ఒక మంచి మెసేజ్ రాజ్ కుమార్ హిరానీ “డంకీ” సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. సినిమాలో ఫస్ట్ ఆఫ్ మొత్తం పల్లెటూరు నేపథ్యంలో అద్భుతమైన కామెడీ నడిపించడం జరిగింది. ప్రీ క్లైమాక్స్ లో విక్కీ కౌశల్.. ఆత్మహత్య సంఘటన ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇవ్వటం జరుగుతుంది. మొదటి భాగం కామెడీ అయితే రెండో భాగం అక్రమంగా దేశాలు దాటే సమయంలో ఎదుర్కొనే కష్టాలు బాధలతో.. స్టోరీని నడిపించారు. కొంతసేపు కామెడీ ఆ తర్వాత వెంటనే ఎమోషనల్ ఈ రీతిగా ఎక్కడ కూడా సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అసహనం కలిగించకుండా స్క్రీన్ ప్లే అద్భుతంగా నడిపించడం జరిగింది. సినిమా స్టోరీ అంతా ఫ్లాష్ బ్యాక్ గా… చూపించి క్లైమాక్స్ లో చాలా ఎమోషనల్ సీన్స్ జోడించారు. దీంతో సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాలు చాలా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇల్లీగల్ ఇమిగ్రేంట్స్ బాధలు కళ్ళకి కట్టినట్టు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ చూపించటం జరిగింది. సినిమాలో 50 ఏళ్ల వయసు పాత్రలో షారుక్.. తనదైన పెర్ఫార్మెన్స్ తో ఎప్పటి లాగానే బాగా ఆకట్టుకున్నాడు. కానీ విక్కీ కౌశల్ పాత్ర చిన్నదైనా గాని.. తక్కువ సమయంలోనే.. జనాలకి బాగా కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఆ పాత్ర సినిమాకి హైలైట్. మిగతా పాత్రలు విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, బొమన్ ఇరానీ.. పాత్రలు కూడా తమ కామెడీ టైమింగ్ తో మెప్పించడం జరిగింది. నిర్మాణ విలువలు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. షారుక్ హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించారు. యాక్షన్ సీన్స్ ఏమీ లేకపోయినా ఎమోషనల్ డ్రామా.. బాగా వెండి తెరపై పండటంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన అమన్ పంత్ పనితనం గ్రేట్ అని చెప్పవచ్చు. లోకేషన్ మరియు ఆ కాలాలకి సంబంధించి తగ్గట్టు సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు.

ఓవరాల్ గా: ఈ ఏడాది యాక్షన్ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న.. షారుక్ ఎమోషనల్ “డంకీ” సినిమాతో హ్యాట్రిక్ అందుకున్నాడని చెప్పవచ్చు.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri