Tillu Square: గతవారం థియేటర్స్ లో విడుదలైన చిత్రాల్లో టిల్లు స్క్వేర్ ఒకటి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంలో నిర్మించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ అవుట్ అండ్ అవుడ్ కామెడీ ఎంటర్టైనర్ లో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. మురళి శర్మ, ప్రిన్స్ సెసిల్, మురళీధర్ గౌడ్, నేహా శెట్టి తదితరులు కీలక పాత్రలను పోషించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎస్. థమన్ అందించగా.. సౌండ్‌ట్రాక్ ను రామ్ మిరియాల, శ్రీ చరణ్ స్వరపరిచారు.
2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లుకు సీక్వెల్ ఇది. టిల్లు స్క్వేర్ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా కథ, డైలాగ్స్ అందించాడు. ఎన్నో అంచనాల నడుమ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సింపుల్ కథ అయినప్పటికీ.. టిల్లు పాత్రలో సిద్ధ జొన్నలగడ్డ తనదైన నటనా శైలితో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. తెరపై వన్ మ్యాన్ షో చేశాడు.
టాక్ అనుకూలంగా ఉండటం, పోటీగా మరే సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ మూవీ దుమ్ము లేపుతోంది. కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. థియేటర్స్ లో 4 రోజుల రన్ ను పూర్తి చేసుకున్న టిల్లు స్క్వేర్.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నాలుగో రోజు ఆదివారం కావడంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.91 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది. అలాగే వరల్డ్ వైడ్ గా 4వ రోజు రూ. 5.46 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది.
నాలుగు రోజుల టోటల్ కలెక్షన్స్ ను గమనిస్తే.. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 27.96 కోట్ల షేర్, రూ. 44.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టిన టిల్లు స్క్వేర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 40.31 కోట్ల షేర్, రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఒక నైజాలోనే ఈ సినిమాకు ఏకంగా రూ. 14.50 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే సీడెడ్ లో రూ. 3.37 కోట్లు, ఉత్తరాంద్రలో రూ. 3.47 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 1.76 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 1.05 కోట్లు, గుంటూరులో రూ. 1.53 కోట్లు, కృష్ణ లో రూ. 1.41 కోట్లు మరియు నెల్లూరులో రూ.0. 87 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్లో టిల్లు స్వేర్ మూవీ రూ. 9.85 కోట్ల వసూళ్లను అందుకుంది.
టిల్లు స్క్వేర్ మూవీకి రూ. 27 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే క్లిన్ హిట్ గా నిలిచింది. 4 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా రూ. 12.31 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతోంది. ఇప్పుడున్న జోరు కంటిన్యూ అయితే టిల్లు స్క్వేర్ మూవీ మరో రెండు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.