NewsOrbit
తెలంగాణ‌

Etela Rajendar: కమలాకర్ జాబితా చూసుకోలేదేమో..!? ఈటలపై ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు..!!

Etela Rajendar: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నీటి బిందువు లాంటి వ్యక్తి మాత్రమే.. ఆయన పార్టీ నుండి వెళ్లి పోతే నష్టమేం లేదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇంత వరకు హుజూరాబాద్ లో ఏ ఎన్నికలైనా.. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ బొమ్మతోనే గెలిచాం.. నేను కూడా కేసీఆర్ బొమ్మవల్లే గెలవగలిగానని ఆయన అన్నారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి లాండి ఉద్దండుడే కేసీఆర్ బొమ్మ ముందు నిలువలేకపోయిండు.. హుజూరాబాద్ లో కూడా అంతే.. కేసీఆర్ బొమ్మతోనే గెలుపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

 Did Kamalakar not look at the list ..!? They are firing in a range on the Etela Rajendar.. !!
Did Kamalakar not look at the list They are firing in a range on the Etela Rajendar

ఈటల.. పుట్టమధుల వ్యవహారంపై మంత్రి గంగుల కమలాకర్ తొలిసారిగా స్పందించి మీడియాతో మాట్లాడారు. ఈటలపై పార్టీ పరంగా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా.. చట్ట ప్రకారం ముందుకెళ్లడం జరిగిందన్నారు. ఈటల వ్యవహారంపై ఏం చేయాలనేది కేసీఆర్, కేటీఆర్ లతో అందరం చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు.

అభ్యర్థిని గెలిపించేది కేసీఆర్ బొమ్మే!

హుజరాబాద్ లో మా పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది.. అక్కడ ఏ అభ్యర్థి నిలబెట్టినా మా కేసీఆర్ బొమ్మతో కచ్చితంగా గెలుస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇక్కడ నేను గెలిచినా.. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచినా.. మేము మా సొంత బలంతో గెలవలేదన్నారు. కేవలం కేసీఆర్ బొమ్మను చూసి, 24 గంటల కరెంటు చూసి, కాళేశ్వరం జనాలను చూసి ప్రజలు ఓటు వేస్తున్నారని మంత్రి గంగుల అన్నారు. హుజరాబాద్ లో మా పార్టీ బలంగా ఉంది‌, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ పార్టీ గెవడం ఖాయమన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో మా పార్టీ కేడర్ ఎవరు అధైర్యపడంలేదని, ఆగమాగం అంతకంటే లేదన్నారు. పార్టీ నాయకులందరూ మమ్మల్ని ఎవరు బెదిరించినా బెదరమని, టిఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నామని చెబుతున్నారని మంత్రి గంగుల వివరించారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని మంత్రి గంగుల అభిప్రాయపడ్డారు. రాజకీయ ఉద్దండులు అన్న జానారెడ్డి నాగార్జున సాగర్ లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదని, కేవలం కెసిఆర్ బొమ్మ ముందు ఆయన నిలువ లేకపోయారని మంత్రి పేర్కొన్నారు.

పుట్ట మధు వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం లేదు

న్యాయవాద దంపతుల హత్యతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం ఎంత మాత్రం లేదని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ విషయంలో హైకోర్టు నేరుగా జోక్యం చేసుకుందన్నారు. హతుడు వామన్ రావు తండ్రి పుట్టమధు పై ఎంక్వైరీ చేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో పోలీసులు విచారణ జరుపుతున్నారని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం ఉండదన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు.

 

author avatar
Yandamuri

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

BRS: కేసిఆర్ పై కీలక నేత సంచలన వ్యాఖ్యలు

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సీపీ శ్రీనివాసరెడ్డి ఏమన్నారంటే..?

sharma somaraju

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

America: అమెరికాలో కిడ్నాప్ కు గురైన హైదరాబాదీ విద్యార్ధి మృతి

sharma somaraju

Lok sabha Election: కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన 106 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Delhi Liquor Scam: కోర్టులో కవితకు లభించని ఊరట

sharma somaraju