Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “పుష్ప” సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేసి పడేశారు. అల్లు అర్జున్ కెరియర్ “పుష్ప” తర్వాత ముందు అన్న విధంగా సినిమా కెరీర్ మారిపోయింది. మెగా హీరోగా అల్లు వారి కుటుంబం నుండి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మెగా హీరో అనే ముద్ర స్టార్టింగ్ లో ఉన్న గాని తర్వాత తనకంటూ సెపరేట్ స్టార్ డామ్.. క్రియేట్ చేసుకోవడం జరిగింది. నటన, డాన్స్ మరియు ఫైట్స్ పరంగా ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రేక్షకుల నుండి సొంతం చేసుకున్నాడు. తెలుగు చలనచిత్ర రంగంలో ఏ హీరోకి లేని మార్కెట్ మలయాళంలో బన్నీకి ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల బన్నీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.
“పుష్ప” సినిమాకి జాతీయ అవార్డు వచ్చాక.. అల్లు అర్జున్ అనేక సినిమాలకు సంబంధించి తన స్పందన తెలియజేస్తున్నారు. “యానిమల్” సినిమాకి రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నాని నటించిన “హాయ్ నాన్న” సినిమాకి కూడా.. రివ్యూ ఇచ్చారు. కాగా తాజాగా గీతా ఆర్ట్స్ అధినేత తండ్రి అల్లు అరవింద్ గురించి బన్నీ.. ఇంస్టాగ్రామ్ లో సంచలన పోస్ట్ పెట్టారు. విషయంలోకి వెళ్తే 1985లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి “విజేత” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిన్న పాత్ర చేయడం జరిగింది. ఆ సమయంలో మూడు సంవత్సరాల వయస్సు.. కలిగిన బన్నీ “విజేత” ద్వారానే వెండితెరకు పరిచయం కావడం జరిగింది.
అయితే ఈ “విజేత” సినిమాకి తన తండ్రి అల్లు అర్జున్ స్పందిస్తూ “నేను.. మొదట వెండి తెరపై కనిపించిన చిత్రం “విజేత”. నా ప్రొడ్యూసర్ మా నాన్న. ఇన్నాళ్ళ తర్వాత నేను గ్రహించింది ఏంటంటే..ఈ సినిమాకి నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు” అంటూ సరదా పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం బన్నీ “పుష్ప” రెండో భాగం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. “పుష్ప” మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయం కావడంతో రెండవ భాగం కూడా అదే స్థాయిలో విజయం సాధించే దిశగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. న్యూ ఇయర్ లేదా సంక్రాంతి పండుగకు ఈ సినిమా నుండి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!