Ananya Nagalla: తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బీటెక్ అనంతరం షాదీ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన అనన్య.. 2019లో వచ్చిన మల్లేశం మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయింది. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత ప్లే బ్యాక్, వకీల్ సాబ్ మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శకుంతలం, అన్వే,షి బూట్ కట్ బాలరాజు వంటి చిత్రాల్లో నటించింది.
అందం అంతకుమించి టాలెంట్ ఉన్నప్పటికీ తెలుగు అమ్మాయి కావడం వల్ల అనన్యకు టాలీవుడ్ లో సరైన అవకాశాలు రావడం లేదు. ఇకపోతే ఈ బ్యూటీ ఇటీవల తంత్ర అనే హారర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. క్షుద్ర పూజలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న తంత్ర మూవీకి మిక్స్డ్ టాక్ లభించింది. అయితే ఛాలెంజింగ్ రోల్ లో అనన్య తనదైన నటనతో అదరగొట్టేసింది. దీంతో ఆమె నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తంత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన అనన్య.. వృత్తిపరమైన విషయాలు కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో రివీల్ చేసింది. హైట్, కలర్, మనీ లాంటి విషయాల్లో ఎలాంటి పట్టింపులు లేవని.. కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తికి గడ్డం ఉండాలని మరియు చూడగానే తనను ఇంప్రెస్ చేయగలిగితే చాలని అనన్య చెప్పుకొచ్చింది.
అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని తెలిపింది. గడ్డం అయితే మస్ట్ అని అనన్య చెప్పుకొచ్చింది. దీంతో అనన్య నాగళ్ల కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ప్రస్తుతం అనన్య రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో పొట్టేల్ ఒకటి కాగా.. మరొకటి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. గ్రామీణ నేపథ్యంలో సాహిత్ మోత్కూరి తెరకెక్కిస్తున్న పొట్టేల్ చిత్రంలో యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రంలో వెన్నెల కిషోర్ తో కలిసి అనన్య నటిస్తోంది.