Ante Sundaraniki: న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `అంటే.. సుందరానికీ!`. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అయింది. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బ్రాహ్మణ యువకుడు సుందర్ ప్రసాద్ గా నాని, క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నజీమ్ లు నటించారు.
సీనియర్ నటుడు నరేష్, రోహిణి, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ముఖ్య పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నిన్న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుందని అంతా అనుకున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, అలాంటిది ఏమి జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 3.50 కోట్ల రేంజ్ లో మాత్రం ఓపెనింగ్స్ ని అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 5.82 కోట్ల షేర్‌ను వసూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా `అంటే.. సుందరానికీ` ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం – రూ. 1.56 కోట్లు
సీడెడ్ – రూ. 0.38 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.44 కోట్లు
ఈస్ట్ – రూ. 0.34 కోట్లు
వెస్ట్ – రూ. 0.34 కోట్లు
గుంటూరు – రూ. 0.34 కోట్లు
కృష్ణా – రూ. 0.28 కోట్లు
నెల్లూరు – రూ. 0.19 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ=3.87కోట్లు (6.50కోట్లు~ గ్రాస్)
—————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.25 కోట్లు
ఓవర్సీస్ – 1.70 కోట్లు
—————————-
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= 5.82కోట్లు (10కోట్లు~ గ్రాస్)
—————————-
కాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈచిత్రం క్లీన్ హిట్ అవ్వాలంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 25.18 కోట్ల షేర్‌ను వసూల్ చేయాల్సి ఉంది. మరి ఆ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టాలంటే నాని స్పీడ్ పెంచాల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!