Avunu Valliddaru Ista Paddaru: పూజ పంపిన తన లెఫ్ట్ హ్యాండ్ కార్లో మాట్లాడుతూ వెళ్తాడు మనోజ్.. నీకు పూజ అంటే చాలా ఇష్టం కదా.. పూజకు మంచి భర్త వస్తాడు అని మనోజ్ మాట్లాడుతూ ముందుకు వెళ్తాడు.. ఢిల్లీ ఫ్రెండ్స్ ఇద్దరు మనోజ్ ని కారులో వెళ్లడం చూస్తారు. వెంటనే మరొక ఆటో పట్టుకొని ఆ కార్ వెనకమాలే ఫాలో అవుతూ ఉంటారు.. తీరా మనోజ్ ను తీసుకువెళ్లి లెఫ్ట్ హ్యాండ్ కరెక్ట్ గా గుడి ఎదురుగా అవుతాడు..

అదేంటి మనం వెళ్లాల్సింది వేరే చోటకి కదా అని మనోజ్ అడుగుతాడు లెఫ్ట్ హ్యాండ్ ని.. కార్ డోర్ ఓపెన్ చేస్తాడు రెడ్డప్ప ఒక్కసారిగా మనోజ్ మైండ్ బ్లాక్ అవుతుంది.. రా పెళ్ళికొడుకు లోపలికి అని పిలుస్తాడు రెడ్డాప్ప. చేతులు తీసి నేను అసలు లోపలికి రాను. ఈ పెళ్లి చేసుకోను అని మనోజ్ అంటాడు.. మనోజ్ మెడ చుట్టూ కత్తులు పెట్టి రెడ్డప్ప బెదిరిస్తాడు. ఇక మీ అమ్మానాన్నలు ఇదేవిధంగా బెదిరించి బంధించాం నువ్వు పెళ్లి చేసుకోకపోతే వాళ్లని కూడా చంపేస్తాం అని రెడ్డప్ప బెదిరించి లోపలికి తీసుకువెళ్తాడు..

మనోజ్ లోపలికి వెళ్లడంతోనే పెళ్లి ఏర్పాట్లు అన్ని చేసి రెడీగా ఉంటారు. ఇక పూజ రావడం తనను ఎదురుగా కూర్చోబెట్టి జిలకర బెల్లం పెట్టించడం.. క్షణాల్లోనే మూడు ముళ్ళు వేయించేయడంతో.. ఢిల్లీ ఫ్రెండ్స్ వచ్చేసరికి పెళ్లి కూడా జరిగిపోతూ ఉంటుంది. ఇక అదే విషయాన్ని వీడియో తీసి ఢిల్లీకి పంపిస్తారు.. తన ఫ్రెండ్స్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా కంగు తింటాడు ఢిల్లీ..

మనోజ్ కి ఇష్టం లేకుండానే పూజ మొదలు తాళి కడతాడు. ఆ విషయం ఢిల్లీకి అర్థం కాదు కానీ ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే అని మాత్రం అంతకు ముందు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటాడు.. మనోజ్ తన పెళ్లి తంతు ముగియగానే కల్యాణ మండపానికి పరుగులు పెడతాడు. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి పెళ్లి తంతు జరుగుతా ఉంటుంది..

రేపటి ఎపిసోడ్ లో కల్యాణ మండపం దగ్గరికి మనోజ్ వస్తాడు.. తీరా అక్కడికి వచ్చి చూసేసరికి మనోజ్ ప్లేస్ లో ఢిల్లీ పెళ్ళికొడుకాయ్యి కనిపిస్తాడు. కళావతి ఢిల్లీ ఎదురెదురుగా కళ్యాణమండపంలో కూర్చోవడం చూసి మనోజ్ షాక్ అవుతాడు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.