Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వారసడిగా 2007లో “చిరుత” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. నటనపరంగా అన్ని రకాలుగా మెగా అభిమానులను అలరిస్తూ అదిరిపోయే సినిమాలు చేస్తూ… దూసుకుపోతున్నారు. “RRR” సినిమాతో గ్లోబల్ స్టార్ అనిపించుకోవడం జరిగింది. రామరాజు పాత్రలో చరణ్ నటన అందరిని ఆకట్టుకుంది. అంతర్జాతీయంగా ఈ సినిమా అనేక అవార్డులు సొంతం చేసుకోవడం తెలిసిందే. ఆస్కార్ బరిలో కూడా ప్రస్తుతం ఉంది. అయితే ఈ సినిమాపై ప్రపంచకుడు జేమ్స్ కామెరూన్ ఇటీవల మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కథను నడిపించిన విధానం అత్యద్భుతం. వీఎఫక్స్ వర్క్ ఆదరగొట్టింది.
ముఖ్యంగా రామరాజు పాత్ర తీరు తెన్నులు చాలా ఆకట్టుకుంది. అసలు అతని మదిలో ఏముందో తెలుసుకునేసరికి హృదయం బద్దలైనట్లుంది. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా రాజమౌళితో చర్చించడం జరిగింది అని తెలియజేశారు. రామ్ చరణ్ నటనపై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. “మీ లాంటి గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ నుంచి ప్రశంసలు అందుకోవటం ఆస్కార్ అవార్డు కంటే తక్కువ ఏం కాదు. ఇది రామ్ చరణ్ కు గొప్ప గౌరవం. చరణ్ సినీ ప్రయాణంపై తండ్రిగా నేను గర్వపడుతున్న. మీ అభినందన చరణ్ భవిష్యత్తుకి ఆశీర్వాదం అని ట్విట్టర్ లో చిరంజీవి ట్వీట్ చేశారు.
“అవతార్” ఇంకా చాలా విజువల్ వండర్ సినిమాలు తేరకెక్కించిన జేమ్స్ కామెరూన్… “RRR” చూసి రాజమౌళికి బంపర్ ఆఫర్ ఇవ్వటం తెలిసిందే. హాలీవుడ్ కీ వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే కలిసి పని చేద్దామని స్వయంగా తెలియజేశారు. ఏది ఏమైనా “RRR” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయితో పాటు తెలుగు వారి టాలెంట్ ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది అని చెప్పవచ్చు. మరి అటువంటి ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తే మాత్రం.. ప్రపంచ సినిమా రంగంలో చరిత్ర సృష్టించినట్లు అవుతుంది.