Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ సగం ఆట ముగిసే సరికి అసలు రూపాలు బయటపడుతున్నాయి. ఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి నటుడు శివాజీ విన్నర్ మెటీరియల్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. సీజన్ ప్రారంభంలో సీరియల్ బ్యాచ్ ఒకవైపు… మరో బ్యాచ్ ఇంకోవైపు ఉండేది. ఈ రీతిగా హౌస్ లో వాతావరణం ఉంది. సీరియల్ బ్యాచ్ కి సెలబ్రిటీ అనే పొగరుతో.. తోటి కంటెస్టెంట్లపై నోరు జారేవాళ్లు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఇంకా యావర్ లపై మాటలి దాడి చేస్తూనే మరోపక్క వాళ్లపై కామేడీ చేసేవాళ్ళు. చాలా చిన్న చూపు చూస్తున్నట్టుగా వ్యవహరించే వాళ్ళు. ఈ క్రమంలో అటువంటి సీరియల్ బ్యాచ్ ని అడ్డుకోవడంలో శివాజీ ప్రముఖ పాత్ర పోషించాడు. పల్లవి ప్రశాంత్ ఇంకా యావర్ వంటి వారిపై మాటల దాడి జరగకుండా చాలా కేర్ తీసుకోవడం జరిగింది. చాలావరకు మైండ్ కంట్రోల్ గేమ్ ఆడుతూ ఎవ్వరూ ఎంత రెచ్చగొట్టినా గాని శివాజీ తెలివైన గేమ్ ఆడటం జరిగింది.
ఇంతవరకు అంతా బాగానే ఉన్నా గాని ఎనిమిదో వారంలో ఆట మొత్తం మార్పు చెందింది. శివాజీ గతంలో మాదిరిగా కాకుండా తనని టార్గెట్ చేసే ఇంటి సభ్యులపై నోరు జారేస్తూ అనరాని మాటలు అంటున్నాడు. గతంలో ఎంత రెచ్చగొట్టినా గాని శివాజీ చాలా కూల్ గా నవ్వుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సగం గేమ్ ముగిసే సమయానికి.. కంట్రోల్ తప్పుతున్నాడు. ముఖ్యంగా వైల్డ్ రికార్డు రూపంలో ఐదుగురు సభ్యులు ఇంటిలోకి వచ్చాక.. శివాజీలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డు సభ్యుడు అర్జున్ ఓ డిస్కషన్ శివాజీ దగ్గర పెట్టడం జరిగింది.
ఆ సమయంలో శివాజీ హౌస్ లో లేడీ కంటెస్టెంట్ శోభ, ప్రియాంక ఇద్దరూ చాలా ఎక్కువ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరిని తొక్కేస్తా.. అంటూ చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా శివాజీ మాట్లాడటం జరిగింది. వాళ్లు తమ ఆట విషయంలో చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అని.. తొక్కేస్తాను అంటూ శివాజీ చేసిన కామెంట్స్.. పట్ల బయట నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటివరకు బాగానే ఉన్నారుగా గురువుగారు.. ఇంతలోనే నోరు ఏలా జారుతున్నారు అని విమర్శలు చేస్తున్నారు.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?