Malli Nindu Jabili Episode 477: మల్లి వాటర్ తాగు అని వాటర్ తెచ్చి తాగామని మల్లికి తాపిస్తాడు. మల్లి వాళ్ళ అమ్మ చెప్పినది ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది.ఏంటి మల్లి ఏదో ఆలోచిస్తున్నా ఏం అడగాలనుకుంటున్నావ్ నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు అని గౌతమ్ అంటాడు. అది కాదండి అమ్మ ఇందాక నీతో మాట్లాడి నాన్నని వాళ్ళ ఇంటికి పంపించేయమని చెప్పింది అని మల్లి అంటుంది.

మీ అమ్మ ఆలోచించేది కూడా కరెక్టే మల్లి కాదని నన్ను కానీ మీ అమ్మ రెండో పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు తను చేసింది అప్పుడు తప్పనిపించకపోవచ్చు కానీ అలా ఎందుకు చేసిందో ఆవిడకే తెలుసు కదా శరత్ అంకుల్ జీవితంలోకి వచ్చినప్పుడు మా అత్త తన జీవితంలో ఉందని మీ అమ్మకు తెలియదు తెలిసే మళ్లీ పెళ్లి చేసుకొని వూoటే మీ అమ్మని అసలు క్షమించకూడదు కానీ మీ అమ్మకు ఆ విషయం తెలీదు కాబట్టి మనం పోరాడాలి మీ అమ్మకు న్యాయం జరగాలి గౌరవప్రదమైన స్థానంలో ఉండాలి సరేనా అని గౌతమ్ అంటాడు. మా పెళ్లి గురించి తెలిస్తే ఆయన ఏం చేస్తాడో ఏమో అని మల్లి అనుకుంటుంది.

కట్ చేస్తే వసుంధర నా భర్త మీరాతో కలిసి ఉంటున్నాడని సొసైటీకి గాని నా ఫ్రెండ్స్ కి గాని తెలిస్తే నా పరువు మొత్తం పోతుంది ఎలాగైనా సరే ఆయనని ఇంటికి రప్పించాలి అని శరత్ కి ఫోన్ చేస్తుంది వసుంధర. ఇంతలో గౌతమ్ వచ్చి హాయ్ అత్త టీ కానీ తాగుతావా అని అడగవు ఏంటి అని అంటాడు. నువ్వెందుకు నా ఇంటికి వచ్చావు ముందు బయటికి నడువు అని వసుంధర అంటుంది. లాయర్ గారు అత్తకి విషయం అర్థమైంయైలా చెప్పండి అని గౌతమ్ అంటాడు.నీకు మీ అన్నయ్యకి మీ నాన్న సంపాదిoచినదట్లో ఎటువంటి గొడవలు రాకూడదని పేపర్ రాశాడు మేడం కౌసల్య గారు సంతకం పెట్టారు మీరు పెట్టేస్తే సరిపోతుంది అని లాయర్ అంటాడు. మీ ఆస్తులు అడుగుతానని నువ్వేం భయపడకు నాకంత గతిలేక మిమ్మల్ని అడగను అని వసుంధర అంటుంది.

అన్నా చెల్లెలకి గొడవలు రాకూడదు అంటే ఫార్మాలిటీస్ ఫాలో అయితే సరిపోతుంది కదా అని గౌతమ్ అంటాడు.అయితే పేపర్లు ఇవ్వు అని చకచక సంతకం పెడుతుంది వసుంధర.ఇదేంటి అన్ని పేపర్లు ఇవ్వలేదు అని వసుంధర అంటుంది.అదే దివస్ పేపర్స్ అని గౌతమ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా ఏం ద్రోహం చేశానని ఇలాంటి పనిచేసే నాకు ఆ పేపర్లు ఇవ్వు అని వసుంధర అంటుంది. నీకు త్వరలోనే విడాకులు వస్తాయి అత్త అని గౌతమ్ అంటాడు. అన్నింటికీ కలిపి ఒకటే సారి నీకు ఇస్తా మీ అందరికీ కలిసి ఒకే ట్రీట్మెంట్ చేస్తా అప్పుడు ఏం చేస్తారో చూస్తాను అని వసుంధర అంటుంది. ఇది అత్త ఇప్పుడు నీ మేనల్లుడుతో పోటీ పడుతున్నావ్ చూద్దాం ఎవరు గెలుస్తారో కోర్టులో కలుసుకుందాం అని గౌతమ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఏంటి మలినీ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు అని అరవింద్ అంటాడు.

అమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది అరవింద్ ఇన్నాళ్లు వాళ్లు ఎదురుగా ఉన్న మాట్లాడుకోకపోయినా ఓకే ఇంట్లో ఉన్నారు కానీ డాడీ వెళ్ళిపోవడంతో అమ్మ తట్టుకోలేక పోతుంది అరవింద్ ఎలాగైనా సరే డాడీ ని ఓపిoచి తీసుకురావాలి లేదంటే అమ్మ ఇంట్లో కి రాదు అని మాలిని అంటుంది.

అయితే ప దా అత్తయ్య ఎక్కడ ఉందో వెతికి తీసుకొద్దాం అని అరవింద్ అంటాడు. డాడీ రాకపోతే మాత్రం జీవితాలు తరు మారాయి పోతే అరవింద్ నేను అన్నిటికి ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అమీరా గారిని కూడా తీసుకువచ్చా అని మాలిని అంటుంది. ఓకే మాలిని మామయ్య ని ఒప్పించి తీసుకొద్దాం అని అరవింద్ అంటాడు. థాంక్స్ అరవింద్ ఈ ఒక్క విషయంలో నాకు సపోర్ట్ గా నిలబడు అని మాలిని అంటుంది. ఏంటి మాలిని అలా అంటున్నావ్ అది నా కర్తవ్యం నువ్వు అలా మాట్లాడకు అని అరవింద్ అంటాడు.ఇప్పుడే వెళ్లి తీసుకొద్దాం డాడీ ని లేదంటే అక్కడ మళ్ళీ మీరా గారు గౌతమ్ సఫర్ అవుతారు ఇక్కడ మనం సఫర్ అవుదాం అని మాలిని అంటుంది.

ఈ టైంలో వెళ్తే కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నాను మాలిని రేపు ఉదయం దాకా వెయిట్ చెయ్ అప్పుడు వెళ్లి తీసుకొద్దాం నువ్వేం ఏడవకు మాలిని అని అరవింద్ మాలిని ఓదార్పుతాడు. కట్ చేస్తే మలి కింద పూజకు ఏర్పాట్లు మొదలవుతుంటాయి కదా అందరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ అందరికీ భోజనాలు పెట్టాలి బట్టలు పెట్టాలి ఇంట్లో అమ్మ నీలిమా ఉంటే చూసుకునే వాళ్ళు లేరు కదా మనమే చూసుకోవాలి అని గౌతమ్ అంటాడు. సరేనండి అన్ని మల్లి అంటుంది..