Malli Nindu Jabili Episode 476: ఎక్కడైనా ఇలా జరుగుతుందా కూతురికి అమ్మ హారతి ఇచ్చి లోపలికి రమ్మంటుంది కానీ ఇక్కడ మాత్రం కూతురే అమ్మకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది అని మీరా అంటుంది. మీరు అలా గిల్టీగా ఫీల్ అవ్వకూడదు మీరా గారు ఆచారాలన్నీ మనకు అనుగుణంగా పెట్టుకున్నవి మాత్రమే ఇవ్వాలా రేపు ఆడపిల్లలు కూడా తల కొరివి పెడుతున్నారు నీకు ఆ విషయం తెలుసా అని కౌసల్య అంటుంది. ఆవేశంలో ఇలా వచ్చాము కానీ వసుంధరమ్మ గారు ఏం చేస్తుందో ఏమో అని మీరా టెన్షన్ పడుతుంది. మీరు ఇంకా ఏమీ ఆలోచించకండి అన్నయ్యగారు ఇది మీ ఇల్లే అనుకోండి మీ సొంత ఇంట్లో ఎలా ఉంటారు అలాగే ఇక్కడ కూడా ఉండండి మల్లి మీ అమ్మానాన్నలకి గది చూపించు అని కౌసల్య అంటుంది. అలాగే అత్తయ్య అమ్మ రా అని మల్లి తీసుకు వెళ్తుంది. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు అని మల్లి అంటుంది.

ఏమీ లేదమ్మా రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తుంటేనే గుండెలు గుబ్బేలు మంటున్నాయి ఆ వసుంధర ఇప్పుడు వదిలేసింది కానీ రేపు ఏం చేస్తుందో ఏమో తను తలుచుకుంటే ఏమైనా చేస్తుంది అని మీరా భయపడుతూ అంటుంది. అమ్మ ఏమీ జరగదు నువ్వేమీ కంగారు పడకు ఆయన చూసుకుంటాను అన్నారు కదా నువ్వు ఇంకా ఆ విషయం గురించి వదిలేయ్ నా చిన్నప్పుడు అమ్మతనం కోసం కొట్లాడావు నేను పెద్దయ్యాక నీ స్థానం కోసం కొట్లాడుతున్నావు అది జరిగేంతవరకు ఇలాగే ప్రవర్తించు నీ వెనక ఆయన ఉన్నాడు అంతా చూసుకుంటాడు అని మల్లి ధైర్యం చెబుతుంది వాళ్ళ అమ్మకి.

అంకుల్ మీరు ఎవరింటిటో వచ్చానని బాధపడకండి ఇందాక మీ ఇంటి దగ్గర అనరాని మాటలు అన్నాను నన్ను క్షమించండి కానీ ఇప్పుడు ఇక్కడ నీ కొడుకు ఇంటికి వచ్చాను అనుకోని ఉండండి రేపు ఏం జరుగుతుందోనని ఆలోచించకుండా ఇప్పుడేం జరగాలి అనేది మాత్రమే ఆలోచించండి అని గౌతమ్ అంటాడు. అది కాదు గౌతమ్ అంత వసుంధర వల్లే ఇలా జరిగింది లేదంటే అందరం ఒకే దగ్గర ఉండే వాళ్ళం ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని శరత్ నిరాశతో అంటాడు. నాన్న మీకు భోజనం పెట్టుకొస్తాను అని మల్లి అంటుంది.

మల్లి నువ్వు నేలకొండపల్లిలో ఉన్నప్పుడు ఒక రాయివి అరవింద్ దగ్గరికి వచ్చాక నిన్ను ఒక విగ్రహముల చేశాడు గౌతమ్ దగ్గరికి వచ్చేసరికి నిన్ను దేవతను చేశాడు మల్లి నిన్ను దేవతల పూజిస్తున్నాడు గౌతమ్ ఇక మీదట ఎవరి గురించి ఆలోచించకు అమ్మ నీ గురించి మాత్రమే నీ భర్త గురించి మాత్రమే ఆలోచించు అని శరత్ అంటాడు. కట్ చేస్తే మల్లి కి టీ షర్టు పాయింట్ వేసుకోమని ఆర్డర్ వేస్తాడు గౌతమ్. ఏమండీ వద్దండీ నాకు బాగోదండి అని మల్లి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంది. మల్లి నీకేం తెలియదు నువ్వు అలా ఉండు జాగింగ్ కి వెళ్లడానికి ఈ డ్రెస్సులే బాగుంటాయి నీకేం తెలియదు అని గౌతమ్ బలవంతంగా తన చేత వేసుకునేలా చేస్తాడు. మల్లి ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత కిందికి వస్తారు ఇద్దరు.

వాళ్ళిద్దర్నీ చూసి వావ్ బ్రో చాలా అందంగా ఉన్నారు అలాగే ఉండండి కొన్ని ఫోటోలు తీసుకుంటాను అని నీలిమా ఫోటోలు తీస్తుంది వాళ్ళిద్దరినీ.రేయ్ గౌతమ్ పొద్దున శివపార్వతుల కళ్యాణం జరిపిద్దామని అనుకుంటున్నాను నువ్వు ఏమంటావు అని కౌసల్య అంటుంది. అమ్మ ఈరోజు కుదరదు కానీ రేపు చేపిద్దాంలే అని గౌతమ్ అంటాడు.అలాగే నాన్న రేపే చేద్దాంలే మీరు వెళ్లి రండి జాగింగ్ కి అని కౌసల్య అంటుంది.

అలా జాగింగ్ కు బయటికి వెళ్లిన గౌతమ్ మల్లి కాసేపు జాగింగ్ చేయగానే మల్లి కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. గౌతమ్ మల్లి ని అక్కడే పక్కన కూర్చోబెట్టి కాలికి స్ప్రే కొట్టి ఒక గంట సేపట్లో తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని గౌతమ్ అంటాడు. ఈ దెబ్బకి డాక్టర్ దగ్గరికి ఎందుకండి మా ఊర్లో అయితే చాలా దెబ్బలు తగిలేవి అని మల్లి అంటుంది. అవి మీ ఊర్లో ఉన్నప్పుడు తగిలాయి కానీ నా దగ్గర ఉన్నప్పుడు నీకు చిన్న గాయమైనా నిన్ను తట్టుకోలేను మల్లి అని గౌతమ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది