Madhuranagarilo Episode 191: అయితే ఇంకా నువ్వు అక్కడే ఎందుకే వచ్చేసేయ్ హైదరాబాద్ కి అని వాళ్ళ అమ్మ అంటుంది.నేను రాను అమ్మ రాదని చంపకుండా హైదరాబాద్ కి నేను రాను ఇక్కడే ఉండి రాదని ఎలాగైనా చంపేస్తాను హైదరాబాద్ కి శ్యామ్ ఒక్కడే వచ్చేలా చేస్తాను ఉంటాను బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది సంయుక్త. డాక్టర్ వెళ్లిపోయిన దగ్గరనుంచి రాధ పక్కనే కూర్చొని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు నీళ్లలో క్లాత్ ని తడిపి తల పైన వేసి కొద్దిసేపు అయిన తర్వాత లేపి టాబ్లెట్ వేసి పడుకోబెడతాడు ఆ తరువాత పక్కనే స్టూల్ వేసుకొని కూర్చుని నిద్రపోతాడు శ్యామ్. ఇంతలో రాదా కి మెలకువ వచ్చింది లేచి చూసేసరికి శ్యామ్ పక్కన స్టూల్ వేసుకొని కూర్చుని నిద్రపోతూ ఉంటాడు అది చూసి రాదా సార్ లేవండి అని అంటుంది.

రాధా ఇప్పుడు ఎలా ఉంది అని శ్యామ్ అంటాడు. బాగానే ఉన్నాను సార్ కాకపోతే కొంచెం నీరసంగా ఉంది అని రాదా అంటుంది. అయితే నువ్వు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రా టాబ్లెట్ వేసుకుందువు గాని అని శ్యామ్ అంటాడు. రాధా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి శ్యామ్ మెడిసిన్ నీళ్లలో కలిపి ఇస్తాడు రాధకి. ఇదేంటి సార్ అని రాధ అడుగుతుంది. మెడిసిన్ ని నీళ్లలో కలిపి ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారు రాధా తాగు అని అంటాడు శ్యామ్. సరే నాని ఆ మెడిసిన్ కలిపిన నీళ్లని తాగుతుంది రాదా. రాధా అసలు ఇంతకు నైట్ ఏం జరిగింది అని శ్యామ్ అంటాడు. మనము ఇద్దరం లోపలికి వచ్చి పడుకున్న తర్వాత నాకు ఏదో స్మెల్ అనిపించింది సార్ ఆ స్మెల్ వాసన ఏంటి అని లేచి నేను చూద్దాము అనుకునేసరికి ఆ వాసనకి నాకు ఇంకా విపరితంగా శ్వాస ఆడకుండా పోయి మిమ్మల్ని ఎంత పిలిచిన మీరు లేవలేదు నాకు ఏమైతుందో ఏమో తెలియని పరిస్థితిలో కళ్ళు తిరిగి కింద పడిపోయాను అంతే జరిగింది ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు సార్ అని రాదా అంటుంది.

డాక్టర్ గారు ఇక్కడ ఉన్న ఆకులు, పువ్వులు వాసన కొంతమందికి పడవు అలా జరుగుతుంది అని చెప్పింది అని శ్యామ్ అంటాడు. అంతే అయి ఉంటుంది సార్ అని రాధా అంటుంది. సరే రాధా నేను బయటికి వెళ్లి టిఫిన్ తెస్తాను అని శ్యామ్ వెళ్లిపోతాడు. ఇంతలో వెయిటర్ వచ్చి మేడమ్ లోపలికి రావచ్చా సార్ లేడా మేడం అని అంటాడు. ఇప్పుడే టిఫిన్ తేవడానికి బయటకి వెళ్ళాడు అని రాదా అంటుంది.మేడం సార్ ని ఎందుకు పంపించారండి నన్ను పిలిస్తే నేను వెళ్లి తెచ్చేవాడిని కదా పాపం రాత్రి అంతా నిద్రపోకుండా మీ పక్కనే కూర్చొని సార్ కంటికి రెప్పలా చూసుకున్నాడు రెస్ట్ తీసుకోమనాల్సింది మేడం అలాంటి భర్త దొరకడం పూర్వజన్మ సుకృతం మేడం ప్రేమగా చూసుకునే భర్తలు ఎంతోమంది ఉంటారు కానీ ప్రాణంగా చూసుకునేవాడు మాత్రం ఎవరికో అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతారు మేడం మీరు చాలా అదృష్టవంతురాలు అని వేటర్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఏవండీ పండు ఎక్కడా కనిపించట్లేదు అని కంగారుపడుతూ మధుర అంటుంది.

ఇక్కడ ఎక్కడొ ఉంటాడు చూడు అని వాళ్ళిద్దరూ కలిసి వెతుకుతారు అలా వాళ్ళు వెతుకుతూ ఉండగా పండు ఒక దగ్గర మౌనంగా కూర్చొని ఉంటాడు. పండు దగ్గరికి వెళ్లి మధుర ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు నేను ఎంత కంగారు పడిపోయాను ఏమైంది నాన్న అని మధుర అంటుంది. కాసేపట్లో మీ నాయనమ్మ ఇల్లు పీకి పందిరి వేసింది రా బాబు నువ్వు కనిపించకపోయేసరికి అని ధనంజయ్ అంటాడు. ఏం చేయను నాని నేను ఒక్కడినే ఉన్నాను నా ఫ్రెండ్స్ అంతా ఊరికి వెళ్ళిపోయారు ఆట ఆడదామంటే ఎవరూ లేరు అమ్మ నాన్న కూడా ట్రిప్ కి వెళ్ళిపోయారు కానీ మీరేమో ముసలి వాళ్లు మీతో ఎలా ఆడను అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ కూర్చున్నాను అని పండు అంటాడు.

ఏంట్రా మమ్మల్ని ముసలి వాళ్ళ అంటున్నావు అని ధనంజయ్ అంటాడు. తాత నాయనమ్మని ముసలి వాళ్ళ అనకపోతే యంగ్ మ్యాన్లు అంటారా అని పండు అంటాడు. ఒరేయ్ పండు మేము వయసులో మాత్రమే ముసలి వాళ్ళం రా మెంటల్గా మేము యంగ్ మాన్లమేరా అని ధనంజయ్ అంటాడు. అయితే మీరు నాతో ఆటలు ఆడతారా అని పండు అంటాడు. నువ్వు ఏ ఆట ఆడతావో చెప్పరా అది మేము ఆడతాము అని దానంజె య్ అంటాడు. అయితే చప్పట్లు వేసి మనం ఎవరు పంట అయితే వాళ్లు దాక్కోవాలి పంట కాని వాళ్ళు దాక్కున్న వాళ్ళని పట్టుకోవాలి అని పండు అంటాడు. సరే అని ముగ్గురు పంటలు చేస్తే మధురా దొంగ అవుతుంది మేము వెళ్లి దాకుంటాం నాని నువ్వు లెక్క పెట్టి వచ్చి మమ్మల్ని పట్టుకో అని పండు లోపలికి వెళ్లిపోయి దాచుకుంటాడు. మధుర 50 వరకు లెక్కపెట్టి వస్తున్నాను అని లోపలికి వెళ్లి అక్కడ ఇక్కడ వెతికి ధనంజయ్ ని పట్టుకుంటుంది.

ఇప్పుడు తాత దొంగ ఇప్పుడు నువ్వు పెట్టాలి చేత అని పండు వెళ్లి దాక్కుంటాడు. ధనుంజయ్ కూడా 50 లెక్క పెట్టి వచ్చి లోపల ఇల్లంతా వెతికి పండుని పట్టుకుంటాడు. ఇప్పుడు నేను దొంగని నేను పెడతాను మీరు వెళ్లి లోపల దాక్కొండి అని పండు బయటికి వెళ్లిపోతాడు. వాళ్లు లోపలికి వెళ్లి దాక్కుంటారు పండు బయటికి వెళ్లి లెక్కపెడుతూ ఉంటాడు అలా లెక్కపెడుతున్నప్పుడు పండుకి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇంకా పండు రావట్లేదేంటి అని బయటికి వెళ్లి చూసేసరికి కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు పండు రేయ్ పండు నీకేమైంది నాన్న కళ్ళు తెరవ రా అని మధుర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది