NewsOrbit
Bigg Boss 7 Entertainment News TV Shows and Web Series

Bigg Boss 7 Telugu: ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ చరిత్రలో..సీజన్ సెవెన్ లో ఆమె కోసం రూల్స్ బ్రేక్ చేసి మాట్లాడిన బిగ్ బాస్..!!

Advertisements
Share

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ఆరు సీజన్ లు దిగ్విజయంగా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఏడో సీజన్ ప్రసారమవుతుంది. సెప్టెంబర్ మూడవ తారీకు నుండి షో స్టార్ట్ కాగా మొత్తం 14 మంది.. ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటివారం ఆటలో ఎవరికివారు గుర్తింపు సంపాదించుకోవడానికి తెగ తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది సింపతి గేమ్ ప్లే చేస్తుంటే… మరి కొంతమంది గ్రూపులు క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో మరి అంత బోరింగ్ మాదిరిగా లేకుండా.. మొదటి వారంలో ఇంటి సభ్యులు హుషారుగానే టాస్కులు ఆడుతూ ఉన్నారు. ఇంట్లో ఏది పొందుకోవాలన్నా.. ఇంటి సభ్యులకు టాస్కులు పెట్టి షో రసవతరంగా మారేలా బిగ్ బాస్ వ్యవహరిస్తున్నారు.

Advertisements

Bigg Boss who broke the rules and spoke in the first time season seven

గత సీజన్ లలో ఫుడ్.. బెడ్ ఇంకా ఏదైనా.. అందుబాటులో ఉండేవి. కేవలం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లు మాత్రమే.. నిర్వహించేవారు. ఈ టాస్క్ లో ఎక్కువ పాయింట్స్ గెలిస్తే వారానికి సరిపడా సరుకులు భారీగా వచ్చేవి. కానీ ఈసారి మాత్రం.. ప్రతిదానికి టాస్క్ ఆడేలా బిగ్ బాస్ కొత్త రూల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత సీజన్ లో తినడం పడుకోవడం అన్న రీతిలో కంటెస్టెంట్లు వ్యవహరించారు. దాదాపు నాలుగు వారాలు పాటు ఈ రకంగానే హౌస్ లో వాతావరణం ఉంది. ఈ క్రమంలో ఒకానొక టైంలో నాగార్జున ఇంటి సభ్యుల మీద సీరియస్ కూడా అయ్యారు. ఇక ఐదో వారం నుండి బిగ్ బాస్ హౌస్ లో పూర్తిగా వాతావరణం మారిపోయింది. ఎవరికి వారు సీరియస్ గేమ్ ఆడారు. ఇదిలా ఉంటే ఏడవ సీజన్ లో గత సీజన్ పొరపాటు జరగకుండా మొదటినుండి టాస్క్ లు పెడుతూనే ఉన్నారు. దీనిలో భాగంగా గురువారం.. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇవ్వడం జరిగింది.

Advertisements

Bigg Boss who broke the rules and spoke in the first time season seven

తనని ఇంప్రెస్ చేయాలనీ ఇంటి సభ్యులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ప్రిన్స్ యవర్ అమ్మాయిలాగా వేషధారణ వేసుకున్నాడు. ఫ్లర్ట్ చేయమని.. చెబితే.. మనోడు తేడా మాదిరిగా వ్యవహరించారు. ఈ రకంగా శోభకి పాటలు పాడాలని బిగ్ బాస్ ఇంగ్లీషులో మాట్లాడారు. ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్స్ లలో బిగ్ బాస్ ఎప్పుడూ కూడా ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఎవరైనా ఇంటి సభ్యుడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వెంటనే.. తెలుగులో మాట్లాడాలని అనౌన్స్ ఇచ్చేవారు. అంతేకాదు ఒక్కోసారి పోటీదారులు తెలుగు మాట్లాడటం లేదని పనిష్మెంట్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి బిగ్ బాస్ మొదటి సారి సీజన్ సెవెన్ లో ఇంగ్లీష్ మాట్లాడటంతో రూల్స్ బ్రేక్ చేసినట్లయింది. లేడీ కాంటేస్తంట్ శోభ కోసం ఎప్పుడూ తెలుగు మాట్లాడే బిగ్ బాస్.. తొలిసారి సీజన్ సెవెన్ లో ఇంగ్లీష్ మాట్లాడటం ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఈ రకంగా గురువారం తనని ఇంప్రెస్ చేయాలనీ ఇంటి సభ్యులకు బిగ్ బాస్ రకరకాల టాస్క్ లు ఇవ్వడం జరిగింది.


Share
Advertisements

Related posts

నాగార్జున‌-మ‌హేశ్ మ‌ల్టీస్టార‌ర్.. కింగ్ ట్వీట్‌తో క్రేజీ న్యూస్ వైర‌ల్‌!

kavya N

Pallakilo Pellikuthuru: పల్లకిలో పెళ్లికూతురు సీరియల్ మెయిన్ ఎపిసోడ్స్ హైలెట్స్.. టిఆర్పి రేటింగ్, ప్లస్ పాయింట్స్

bharani jella

RRR: “RRR” కీ ఆస్కార్ అవార్డు రావాలని రాజమౌళి ఎంత ఖర్చు చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

sekhar