Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” వరల్డ్ వైడ్ గా మంచి విజయం సాధించడం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కనీసం ప్రమోషన్ కార్యక్రమాలు చెయ్యకపోయినా గాని వందకోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. “పుష్ప” లో బన్నీ మేనరిజం ఇంకా డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పల్లెటూరు వాతావరణంలో స్మగ్లర్ల మధ్య ఆధిపత్యపోరును అద్భుతంగా చూపించడంతో నార్త్ ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అయ్యి బాగా కనెక్ట్ అయ్యారు.
ఈ క్రమంలో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్ లో ఎక్కువమంది చూడటానికి ఆసక్తి కలిగిన సినిమాల లిస్టు ఓ సంస్థ విడుదల చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా ఈ లిస్టులో బాలీవుడ్ ప్రేక్షకులు “పుష్ప 2” కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా బాలీవుడ్ టాప్ హీరోల సినిమాల కంటే “పుష్ప 2” విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పటంతో బాలీవుడ్ సినిమాలకు “పుష్ప 2” చెక్ పెట్టినట్లు అయింది.
సల్మాన్ మరియు షారుక్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విడుదల కంటే కూడా “పుష్ప 2” రిలీజ్ కోసం ఎక్కువ మంది ఆసక్తిగా ఉన్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. ఇదిలా ఉంటే ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడం జరిగింది. పక్క షెడ్యూల్ తో అనుకున్న టైంకి సినిమా విడుదల చేయాలని సుకుమార్ మరియు బన్నీ డిసైడ్ అయ్యారట. అంతేకాకుండా మొదటి భాగం విడుదలైన భాషల కంటే మరీ అత్యధికంగా “పుష్ప” సెకండ్ పార్ట్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!