Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. టాప్ రేటింగ్ సీరియల్ అయినా కార్తీకదీపం స్థానంలో ప్రసారం అవుతున్న ఈ ధారావాహిక బ్రహ్మముడి. అయితే ఈ సీరియల్లో కావ్య పాత్రలో తనదైన నటనతో మెప్పిస్తున్న దీపిక రంగరాజు తెలుగు ఆడియన్స్ ని బీభత్సంగా ఆకట్టుకుంది. దీపిక వ్యక్తిగత విషయాల్లోకి వెళితే.. తమిళనాడులోని పన్రూతి కి చెందిన ముద్దుగుమ్మ. ఈమె మామందూర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంది. ఇక కాలేజీ చదువుతున్న సమయంలోనే ఈమె సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూ అభివృద్ధిని చాటుకుంది. అనంతరం తమిళ్లో న్యూస్ రిపోర్టర్ గా తన కెరీర్‌ను ప్రారంభించింది. చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్ తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఈ సీరియల్‌కు అనూహ్యమైన ప్రేక్షకు ఆదరణ లభించింది. దీంతో ఆ సీరియల్ లో వర్క్ చేసిన దీపిక మంచి పేరు దక్కించుకుంది. ఇక సీరియల్ అనంతరం తెలుగులో బ్రహ్మముడి సీరియల్ లో నటించింది. ప్రస్తుతం ఇదే సీరియల్ లో కంటిన్యూ అవుతూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది. కావ్య పాత్రలో దీపిక కనిపించిన బ్రహ్మముడి సీరియల్ అతి కొద్ది సమయంలోనే భారీ టిఆర్పి రేటింగ్‌ను దక్కించుకుంది. దీంతో తెలుగులో కూడా దీపికాకు మంచి స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు. ప్రేమీ విశ్వనాథ్ తర్వాత ఆ స్థాయిలో అభిమానులని సంపాదించుకున్న సీరియల్ ముద్దుగుమ్మల జాబితాలో ఈమె చేరింది.
ఇక బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్న దీపిక తన యాక్టింగ్ కి సరిపడా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది. ఈ సీరియల్లో నటిస్తున్న ఈమె పెద్ద మోతాదులోనే పారిదోషకం పుచ్చుకుంటుంది. ఈమెకి రోజుకి సుమారు 25 వేల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అలా సుమారు 25 రోజులపాటు షూటింగ్ చేస్తారు. దీంతో ఓ నెలకు సుమారుగా ఏడు నుంచి పది లక్షలు సంపాదిస్తుంది కావ్య. ఇక ఇదిలా ఉండగా తమిళ్, తెలుగు రంగంలో రాణిస్తున్న దీపిక తమిళంలో ఓ సినిమాలో కూడా నటిస్తుంది. ఆరాడీ అనే చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది. మంచి పాత్రలు లభిస్తే సినిమా రంగంలో కూడా రాణించేందుకు దీపిక గట్టిగా కసరక్తులు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈమె కోరికలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.
ఇక ప్రస్తుతానికి అయితే ఈమె తెలుగు ప్రేక్షకులను బేభక్షంగా ఆకట్టుకుంటుంది. తన తింగరితనంతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. ఇక దీపిక బ్రహ్మముడి సీరియల్ లో మాత్రమే కాకుండా పలు కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తుంది. ప్రస్తుతం ఈమె గురించి మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈమె రెమ్యూనరేషన్ చూసిన కొందరు..” ఏ మాటికి ఆ మాట సీరియల్స్ పై ఆధారపడి మీరు బాగానే డబ్బు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు సీరియల్స్ లో నటించే వారికి 1000, 2000 తప్పితే పెద్దగా ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు లక్షల్లో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఏదేమైనా మీ పనే బెటర్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.