NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi December 08 2023 Episode 274: ఊహించని ట్విస్టులతో కళ్యాణ్ అనామికల నిమ్మ మొక్క.. ఇంతకీ పెళ్లి జరుగుతుందా.?

Brahmamudi Today Episode December 08 2023 Episode 274 Highlights

Brahmamudi December 08 2023 Episode 274: కనకం చెప్పిన మాటలన్నీ వింటూ బాధపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇలాంటి దోషాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు పెళ్లి జరగకుండా ఉండడమే బెటర్ అయినా నాకు తోచింది చెప్పాను మీ ఇష్టం. ధాన్యలక్ష్మి అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ధాన్య లక్ష్మీ బాధపడుతూ ఉంటుంది. అపర్ణ ఏమైంది అని అడుగుతుంది. ధాన్యలక్ష్మి కల్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్, అనామిక జాతకాలు కలవలేదని తెలిసి అది ఎలా చెప్పాలా తెలియక బాధపడుతుంది. అప్పుడు కావ్య రాజ్ తో జాతకాలు అని చెప్పి వాళ్ళ ప్రేమని విడగొడతామా, మీరే ఏదో ఒకటి చేయాలి అని అంటుంది. మనం ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలిపితే రేపు జాతక దోషం వల్ల ఏదైనా జరిగితే ఇంట్లో అందరూ మనల్ని అంటారు అని అంటాడు రాజ్.

Brahmamudi Today Episode December 08 2023 Episode 274 Highlights
Brahmamudi Today Episode December 08 2023 Episode 274 Highlights

కనకం తను అనుకున్నట్టుగా నిమ్మ మొక్కని, ఎవరూ చూడకుండా తీసేసి అక్కడ వాడిపోయిన మొక్కని పెడుతుంది. తెల్లవారి ఇంట్లో అందరూ నిమ్మ మొక్కని చూసి వాడిపోయి ఉండడం గమనించి బాధపడుతూ ఉంటారు. కనకం అనుకున్నట్టుగా పెళ్లి క్యాన్సిల్ అవుతుందో కావ్య అనుకున్నట్టుగా జాతకాలు పక్కన పెట్టి కళ్యాణ్ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుంది.అప్పుడు రాజ్ కావ్య రంగంలోకి దిగుతారు. మేము ఇద్దరం జాతకాలు చూపించుకోకుండానే మా పెళ్లి జరిగిపోయింది. అలా అని ఇప్పుడు మేమిద్దరం సంతోషంగా లేమా ఏంటి మేమిద్దరం చాలా అందంగా ఉన్నాము అని అనగానే రుద్రాణి మీరిద్దరూ సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తుంది.\ మీరు మాట్లాడరేంటండి అని రాజ్ వైపు చూస్తూ మనిద్దరం ఎంత సంతోషంగా ఉన్నామో మీ అత్తయ్యకు అర్థమయ్యేలా చెప్పండి.

Brahmamudi Today Episode December 08 2023 Episode 274 Highlights
Brahmamudi Today Episode December 08 2023 Episode 274 Highlights

మన ఇద్దరి మధ్య ఎంత అనురాగం, ఆప్యాయత, సఖ్యత ఉన్నాయో మీ అత్తయ్యకు చెప్పండి అని అంటుంది. అవును అవన్నీ ఉన్నాయి అని రాజ్ తలుపుతాడు. కళ్యాణ్ నాలుగు గోడల మధ్య భార్యాభర్తల విషయాలు చెప్పకూడదు కానీ, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. మొన్న సర్ప్రైజ్ అని చెప్పి నన్ను బయటకు తీసుకెళ్లారు కదా, అప్పుడు అక్కడ మీ అన్నయ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళతో హనీమూన్ ప్యాకేజ్ గురించి మాట్లాడారు. త్వరలోనే మేమిద్దరం కలిసి హనీమూన్ కి వెళ్ళబోతున్నాం అని కావ్య రాజ్ ని అందరి ముందు అడ్డంగా బుక్ చేస్తుంది. ఇక రాజ్ తప్పక ఆ మాటలకి తలుపుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ బిత్తరపోయి రాజ్ వైపు చూస్తూ ఉంటారు. మొత్తానికి కళ్యాణ్ అన్నం తినేలాగా రాజ్ కావ్య కన్విన్స్ చేస్తారు.

Brahmamudi Today Episode December 08 2023 Episode 274 Highlights
Brahmamudi Today Episode December 08 2023 Episode 274 Highlights

గదిలోకి వెళ్ళాక రాజ్ తలుపు గడి పెట్టి కావ్య వైపు కోపంగా చూస్తాడు. ఏంటండీ ఇక్కడే హనుమాన్ చేస్తారా అని కావ్య ఆట పట్టిస్తుంది. నీకు అంత సీన్ లేదులే అని రాజ్ అంటాడు .మీకు కూడా చేసే అంత సీన్ లేదులే అని కావ్య అంటుంది. అలాంటప్పుడు బయట అన్ని మాటలు ఎందుకు కూసావ్ అని అరుస్తాడు. నేను ఏం చెప్పినా కళ్యాణ్ కోసమే అండి మొత్తానికి మన మాటలు నమ్మి కళ్యాణ్ భోజనం చేశాడు కదా అది చాలు అని కావ్య అంటుంది. కళ్యాణ్ భోజనం చేయాలని నన్ను బకరాని చేసావా అని కావ్య పై అరుస్తాడు.

Brahmamudi Today Episode December 08 2023 Episode 274 Highlights
Brahmamudi Today Episode December 08 2023 Episode 274 Highlights

అప్పు వాళ్ల చెప్పినట్టు నిమ్మ మొక్కలను తీసుకు వస్తుంది. అయినా ఒకటి తీసుకు రమ్మంటే మూడు ఎందుకు తెప్పించవు అని అప్పు వాళ్ళ అమ్మని అరుస్తుంది. అవును ఆంటీ ఎందుకు మూడు తెప్పించారు అని అంటే.. అప్పుడు అప్పు స్పేర్ ఆ అని అంటే అవును అని కనకం అంటుంది. ఇక కనకం ఆ మొక్కలను లోపలికి తీసుకువెళుతుంది. అప్పుడు అప్పు వెళ్ళిపో బోతుండగా బ్రో నువ్వు వెళ్ళిపోబాకు నువ్వు వెళ్ళిపోతే ఎలాగా నన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోతావా అని కళ్యాణ్ అంటాడు. నీకు తెలుసు ఈ టైంలో నువ్వు నా పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది నువ్వు ఉండు అని అప్పుని కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తాడు. సరే అని అప్పు ఉంటుంది. ఇక అప్పు భుజం మీద చేయి వేసి కళ్యాణ్ ఇంట్లోకి తీసుకువెళ్తాడు.

పంతులుగారు ఇంట్లో కళ్యాణ్ అనామికుల చేత హోమం చేపిస్తారు. పూర్ణాహుతి కూడా అయిన తరువాత కళ్యాణ్ అనామికుల చేత నిమ్మ మొక్కను నాటిస్తాడు. ఈ మొక్క రేపు ఉదయం వరకు పచ్చగా ఉంటే మీ ఇద్దరి జాతకంలో ఎలాంటి దోషాలు ఇక ఉండవు. మీరు సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ మొక్క వాడిపోతే మాత్రం మంచిది కాదు అని చెబుతాడు. కవి గారు మీరు ప్రేమ స్వచ్ఛమైనది కచ్చితంగా ఆ ప్రేమను నమ్మకండి అదే గెలిపిస్తుంది అని కావ్య ధైర్యం చెబుతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఏం జరుగుతుందా అని కంగారుపడుతూ ఉంటారు. కనకం మాత్రం తను చేయాలనుకున్నది చేస్తాను అని మనసులో అనుకుంటుంది.

Brahmamudi Today Episode December 08 2023 Episode 274 Highlights
Brahmamudi Today Episode December 08 2023 Episode 274 Highlights

రేపటి ఎపిసోడ్లో కావ్య ఒకవేళ పంతులుగారు చెప్పినట్లు ఏదైనా అపశృతి జరిగితే నిర్దాక్షిణ్యంగా ఆ ప్రేమికులను విడదీస్తారా అండి అని రాజ్ను నిలదీస్తుంది. అప్పుడు కవి గారు ఏమైపోతారో మీరు ఆలోచించారా అని కావ్య అడుగుతుంది. ఒకవేళ వాళ్ల ప్రేమను గెలిపించాలని మనం ఇంట్లో వాళ్ళను ఒప్పించామనుకో రేపు వాళ్ళిద్దరి మధ్య ఒక్క చిన్న భేదాభిప్రాయం వచ్చినా ఇంట్లో వాళ్ళందరూ మనల్నే అంటారు అని రాజ్ అంటాడు. అలా అయితే ఈ పెళ్లి జరగదు అని కావ్య అంటుంది.
అనామిక రాజ్ కి ఫోన్ చేసి మన పెళ్లి జరగకపోతే ఇక నా చావునే చూస్తావు అని బెదిరిస్తుంది. కనకం అనుకున్నట్లుగా ఆ మొక్కను పీకేసి వేరే మొక్కను అక్కడ పెడుతుంది. కావ్య రాజ్ ఆ తరువాత ఇంట్లో వాళ్ళందరూ ఆ మొక్క వాడిపోవడం చూసి కంగారు పడతారు. కనకం అనుకున్నది జరుగుతుందా లేదంటే కావ్య రాజ్ ఇద్దరు కలిసి మరొక ప్లాన్ వేస్తారా అనేది తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri