NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi January 09 2024 Episode 301: కొత్త గెటప్ లో కళ్యాణ్.. రాజ్ కి టార్చర్ చూపిస్తున్న కావ్య.. రేపటికి ఊహించని ట్విస్ట్

Brahmamudi Today Episode January 09 2024 Episode 301 Highlights

Brahmamudi January 09 2024 Episode 301:  కావ్య ఒంటరిగా కూర్చొని రాజ్ స్వప్న పై చూపిన కేరింగ్, తనతో ఉన్న సన్నివేశాలను గుర్తుతెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ ఇంట్లోకి వస్తాడు. రాజ్ పరధ్యానంగా వస్తుంటే కావ్య ఒక్కసారిగా బెడ్ మీద నుంచి లేచేసరికి రాజ్ ఉలిక్కిపడి.. ఏంటే ఒక్కసారిగా భద్రకాళిలా లేచావు అని అరుస్తాడు. కొన్ని కొన్ని మారుతాయి కొన్ని కొన్ని ఉంటాయి అని కావ్య వంకరగా మాట్లాడుతుంది. నీ మాటలేంటో సరిగ్గా లేవు అని రాజ్ అంటాడు. అప్పుడు కావ్య కాఫీ కావాలా వద్దా అని అడుగుతుంది. కావాలో వద్దో స్నానం చేసి వచ్చిన తర్వాత ఆలోచించుకుంటాను అని రాజ్ అంటాడు. కావాలో వద్దు కాదు కావాలి అంటేనే తీసుకు వస్తాను లేకపోతే తేను అని అంటుంది. అప్పుడే కొత్తగా జ్ఞాన దంతం వచ్చింది అది ఉండదు పోతుంది అంటూ తింగరి తింగరి గా మాట్లాడుతుంది. రాజ్ అసలే చిరాగ్గా ఉంటాడు. ఇక కావ్య మాటలు విని ఇంకాస్త హెడేక్ వస్తుంది.

Brahmamudi Today Episode January 09 2024 Episode 301 Highlights
Brahmamudi Today Episode January 09 2024 Episode 301 Highlights

కళ్యాణ్ అనామిక దగ్గరకి వెళ్లి మాట్లాడుతూ ఉండగా.. అప్పుడు కళ్యాణ్ అనామిక దగ్గరగా వెళ్లి ముద్దు పెట్టబోతాడు. అప్పుడు అనామిక ఇప్పుడు మనం ఇద్దరం లవర్స్ కాదు అని అనగానే.. అయితే నువ్వు నా వైఫ్ అని ఇంకాస్త దగ్గరకు లాక్కుంటాడు. అప్పుడు సమయం చూసి నేను నీకు ముద్దు పెడతాను అని అన్నాను అంటుంది ముందు అర్జెంటుగా ఈ గెటప్ మార్చేయాలి కదా ఈ రోజు నేను రెడీ చేస్తాను అని అనామిక అంటుంది. తప్పదా అని కళ్యాణ్ అంటాడు ఇక మొత్తానికి అనామిక టామ్ జీన్స్ వేసి పైన మంచి టీషర్ట్ విత్ బ్లేజర్ వేస్తుంది. ఇక హెయిర్ కి డ్రై పెట్టి స్ట్రైక్ ఇస్తుంది. ఇక చెవికి ఓ చిన్న పోగు కూడా పెడుతుంది. మొత్తానికి కళ్యాణ్ గెటప్ మారిపోయి రోడ్డు స్టైల్ రోమియో లాగా ఉంటాడు.

Brahmamudi Today Episode January 09 2024 Episode 301 Highlights
Brahmamudi Today Episode January 09 2024 Episode 301 Highlights

అంతేకాకుండా అనామిక కళ్యాణ్ కి వాకింగ్ చేయమని చెబుతుంది ఇక కళ్యాణ్ వాకింగ్ స్టైల్ కూడా మార్చమని చెప్తుంది. ఇక కళ్యాణ్ వాకింగ్ చేసి చూపిస్తే అచ్చం హీరో లాగా ఉన్నావు అని అంటుంది. కదా ఇప్పుడు కిందకి వెళ్దాం అని అనామిక అంటుంది. అందరూ చూసి బఫూన్ లో ఉన్నావని నవ్వుకుంటారేమో అని కళ్యాణ్ భయపడతాడు. అలాంటిది ఏమీ ఉండదురా అని కిందకి తీసుకెళ్తుంది . కళ్యాణ్ అనామిక ఇద్దరూ కిందకి దిగుతారు.ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉండగా కావ్య రాజ్ కి పప్పు వడ్డిస్తుంది. ఇంకా వేరే ఏ పప్పు లేదా అని రాజ్ అడుగుతారు. అప్పుడు ఎవరినైనా పిలిపించి వడ్డించిన అని అంటుంది.

Brahmamudi Today Episode January 09 2024 Episode 301 Highlights
Brahmamudi Today Episode January 09 2024 Episode 301 Highlights

ఎవరైనా వడ్డిస్తే రుచి మారుతుంది. మీరు ఏమైనా అలాంటి అలవాటు పడ్డారేమోనని అలా అన్నాను అని కావ్య అంటుంది. రాజ్ ఎప్పటికీ బయట ఫుడ్డు తినడు అని అపర్ణ తన కొడుకుని వెనకేసుకొస్తుంది. నేను నిన్న మొన్నటి వరకు అలాగే అనుకున్నాను అని కావ్య మనసులో అనుకుంటుంది. . ఏంటి అని అపర్ణ అంటే అవును అత్తయ్య అని కావ్య అంటుంది. సరిగ్గా అదే సమయానికి కళ్యాణ్ ని తీసుకుని అనామిక వస్తుంది. ఇక కళ్యాణ్ తన గెటప్ చూసి అందరూ నవ్వుకుంటూన్నార అని కళ్యాణ్ అడుగగా..

Brahmamudi Today Episode January 09 2024 Episode 301 Highlights
Brahmamudi Today Episode January 09 2024 Episode 301 Highlights

కొత్త భార్య కొత్త స్టైల్ అదిరిందయ్యా కళ్యాణ్ అని అందరూ ఒక్కసారిగా అంటారు. ఇది బాగుంది అంటే ఈ క్రెడిట్ అంతా నాదే అని అనామిక అంటుంది. ఒకవేళ బాగోలేదు అంటే నేను వద్దన్నా కళ్యాణి కిందకి వచ్చాడు అని చెబుతావు కదా అనామిక అని రాజ్ అంటాడు. అవును బావగారు భలే కరెక్ట్ గా గెస్ చేశారు అని అనామిక అంటుంది. కవి కాదు మంచి హృదయానికి ఏం వేసుకున్నా బాగుంటుంది అని కావ్య అంటుంది. అప్పుడు ఆ మాటకి అందరూ మంచిగా ఉన్నట్టే నటిస్తారు లోపల వేరే ఉంటుంది అని ధాన్యలక్ష్మి కావ్యను సెటైరికల్ గా పంచ్ వేస్తుంది. ఇక ఆ మాటకి రుద్రాణి అందుకొని ఒక మాట అనేస్తుంది. ఇక అందరూ కాయలు తలా ఒక మాట అనడం రాజ్ చూస్తూ మౌనంగా ఉంటాడు అప్పుడు ఇందిరాదేవి ఇలాంటి మాటలు కాదు మాట్లాడుకోవాల్సింది అని చెబుతుంది.

Brahmamudi Today Episode January 09 2024 Episode 301 Highlights
Brahmamudi Today Episode January 09 2024 Episode 301 Highlights

ఇక కావ్య బెడ్ రూమ్ లోకి వస్తుంది అప్పుడే రాజు కూడా బెడ్ రూమ్ లోకి వస్తాడు అసలు ఏమైందే నీకు ఇవాళ వంకర వంకరగా తింగర తింగరగా మాట్లాడుతున్నావు అని రాజ్ అడుగుతాడు అసలు మీకేమైనా తెలిస్తే కదా.. నేను మాట్లాడేది.. అసలు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలిస్తే అప్పుడు నేను మొదట ప్రశ్నించేది మిమ్మల్ని అని కావ్య అంటుంది ఇప్పటికీ మీకు అర్థం కానట్టు మాట్లాడుతున్నారు చూడు అది నాకు ఇంకా నచ్చడం లేదు అని కావ్య అంటుంది. ఇక కావ్య బెడ్ మీద పడుకోగానే రాజ్ ఫ్లవర్ వాష్ ఎద్దుతాడు కావ్య వెనక్కి తిరిగి చూడకుండానే కొడితే గృహహింస అవుతుంది. మర్డర్ అయితే కేస్ అవుతుంది అని కావ్య అంటుంది. అయినా నీతో పెట్టుకోవాలని ఎవరైనా అనుకుంటారా.. అయినా అనుబాంబుతో ఆడుకోవాలని మిసైల్ తో ముద్దు పెట్టుకోవాలి అని ఎవరైనా ప్రయత్నిస్తారా.. మసైపోతారు అని రాజ్ కావ్యకి పంచ్ వేస్తాడు.

రేపటి ఎపిసోడ్ లో కళ్యాణ్, అనామికలు సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కావ్య అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన రుద్రాణి కావాలని దీపారాధన కుంది ఒకటి కింద పడేలా చేస్తుంది. ఇక అది అడ్డం పెట్టుకొని అందరూ కావ్య నీ నానా మాటలు అంటూ ఉంటారు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇలా చేయడం పద్ధతి కాదు కదా అని రుద్రాణి, అపర్ణ కావ్య కావాలని ఈ వ్రతం ఆపడానికి అలా చేసింది అని, కావ్యని దోషగా చేసి మళ్ళీ ముగ్గురు కలిసి మాట్లాడటం మొదలుపెడతారు. ధాన్య లక్ష్మి కావ్య కు చివాట్లు పెడుతున్న మాటలు రాజ్ సహించలేకపోయినా వింటూ నిలబడిపోతాడు. ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Related posts

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N