NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema January 09 2024 Episode 515: పద్మావతి, అను అనుమానం.. కృష్ణకి పద్మావతి వార్నింగ్.. విక్కీకి రానున్న ఆపద..

Nuvvu Nenu Prema Today Episode January 09 2024 Episode 515 Highlights

Nuvvu Nenu Prema January 09 2024 Episode 515: విక్కీ ఇంటికి వచ్చిన తర్వాత పద్మావతికి, విక్కిని జైలుకు పంపించింది కృష్ణ ఏమో అన్న అనుమానం వస్తుంది. కృష్ణ ఫోన్ మాట్లాడుతూ ఉండగా పద్మావతి వెనకే వెళ్లి, నిలుచుని ఉంటుంది కృష్ణ గమనించకుండా ఫోన్ మాట్లాడుతాడు కాకపోతే పద్మావతి ఏమీ వినదు, కృష్ణ ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి పద్మావతిని చూసి షాక్ అవుతాడు పద్మావతి కృష్ణ ని బెదిరిస్తుంది పద్మావతి నువ్వు ఎందుకు నన్ను బెదిరిస్తున్నావో నాకు నిజంగా తెలియట్లేదు అని అంటాడు మా ఆయన జోలి రావద్దని నీకు చాలా సార్లు చెప్పాను అయినా నువ్వు వినట్లేదు నా జోలి వచ్చిన పర్లేదు కానీ మా ఆయనతో మాత్రం నువ్వు ఇలాంటివి ఇంకొకసారి చేసావని తెలిస్తే అని అంటుంది. అయితే అరవింద్ అని పిలువు నిజం ఏంటో చెప్తాను అని అంటాడు ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బతికి పోవాలి అనుకుంటున్నావు, నీకు అసలు సిగ్గుందా అని అడుగుతుంది తర్వాత పద్మావతి కృష్ణ కి వార్నింగ్ ఇచ్చి నువ్వు జైలుకు పంపావేమో అన్న అనుమానం వస్తేనే నీకు వార్నింగ్ తో సరిపెడుతున్న అదే నువ్వే అని తేలితే నీ సంగతి అప్పుడు చెప్తాను అని పద్మావతి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది కృష్ణ భయపడి పద్మావతికి నిజం తెలిస్తే ఏం చేస్తారో ఇంట్లో వాళ్ళు అని భయపడుతూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode January 09 2024 Episode 515 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 09 2024 Episode 515 Highlights

విక్కీ కి పాలు తీసుకొని పద్మావతి వెళుతుంది. ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తావ్ పద్మావతి నువ్వేమైనా తాగావా అని అంటాడు మీరు తాగండి సారు అని అంటుంది పద్మావతి. విక్కీ పాలు తాగుతూ ఉంటే పద్మావతి సగం మిగిల్చి నాకు ఇవ్వచ్చు కదా అని అనుకుంటుంది కానీ విక్కీ పాలు తాగుతూ ఉంటాడు మధ్యలో ఏంటి పద్మావతి అని అడుగుతాడు సగం పాలు తాగి ఇవ్వచ్చు కదా అని అంటుంది అలాంటి ఆశలేం పెట్టుకోకు అని అంటాడు విక్కీ. పద్మావతి శ్రీనివాసా ఇలాంటి భార్యని పెట్టుకుని కూడా ఇలా ఉంటాడేంటి స్వామి కనీసం కాస్త ముద్దు ముచ్చట కూడా లేదు అని అనుకుంటుంది. ఇక విక్కీ పాలు తాగి పడుకుంటాడు పద్మావతిని కూడా కింద పడుకుంటూ ఉంటే ఎందుకు పద్మావతి కింద మంచం మీద పడుకొని అంటాడు ఆ మాటలకు పద్మావతి ఇది కలా నిజమా సార్ అని అంటుంది నిజమే చెప్తున్నాను పద్మావతి మంచం మీద పడుకో అని అంటాడు ఇంక పద్మావతి వెంటనే సంతోషంతో నాకు పాలు ఇవ్వలేదని ఫీల్ అయినందుకు మురిపాలిస్తున్నాడేమో అని అనుకుంటుంది. అలాగే సారు తప్పకుండా పడుకుంటాను అని విక్కీ పక్కకి జరిగి పడుకుంటుంది హలో నేను నిన్ను పడుకోమన్నాను కానీ మరీ ఇంటి దగ్గరికి వచ్చి కాదు అని అంటాడు విక్కి, భార్య గా మీరు నన్ను పక్కన పడుకోమన్నారు కదా సారు అని అంటుంది భార్యగా భర్తగా అని నేను ఏమి ఆలోచించట్లేదు. నువ్వు ఎక్కువగా ఊహించుకోకు ఏదో కష్టపడుతున్నావ్ కదా అని చెప్పి రోజు కిందేం పడుకుంటావని మంచం మీద పడుకోమన్నాను అంతే అని అంటాడు. ఇద్దరికీ మధ్యలో దిండు అడ్డం పెడతాడు విక్కి ఇదేంటి సారు అని అంటుంది నీ మీద నాకు నమ్మకం లేదులే అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode January 09 2024 Episode 515 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 09 2024 Episode 515 Highlights

ఇక కుచల మేకప్ తీసేసి నారాయణ దగ్గరికి వెళుతుంది. పెళ్లెప్పుడు ఎంత స్లిమ్ గా ఉండేవాడో ఇప్పుడు డ్రమ్ములాక్ అయిపోయాడు నారు అని అనుకుంటూ నారు చేత వర్కర్స్ చేయించాలి బాగా అని అనుకొని నారాయణ నిద్ర లేపుతుంది నారాయణ నన్ను కాసేపు పడుకో నువ్వు అవతలికి వెళ్ళు అని అంటాడు కానీ అందుకు ఊరుకోక నారాయణ్ణి లేపుతూనే ఉంటుంది నిద్రలో నుంచి లేచిన్నారా అయినా కూచల ను చూసి భయపడతాడు. దెయ్యం దయ్యం అని పెద్దపెద్దగా అరుస్తాడు కుచేల నేనేనారు అని అంటుంది కొంతసేపటికి నారాయణ నువ్వేనా అని అంటాడు అవును నేనే అని అంటుంది. వెంటనే నిన్ను నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తాను నేను అడిగింది మాత్రం నువ్వు ఇస్తావు కదా అని అంటాడు చెప్పునారు అని అంటుంది. దయచేసి ఇంకొకసారి నువ్వు మేకప్ లేకుండా నా ముందు కనపడకే నాది గట్టి గుండె కాబట్టి సరిపోయింది ఇంకొకలైతే ఎప్పుడో హార్ట్ ఎటాక్ తో పోయేవాళ్ళు అని అంటాడు. ఊరుకోనారు అని అంటుంది నీకు దండం పెడతాను ఇంకెప్పుడు మేకప్ తీసేసి నాకు కనపడకు అని చెప్పేసి వెళ్లిపోతాడు నారాయణ ఇక కుచల నారాయణ ఎందుకు ఇలా అంటున్నాడు నేను నిజంగా అందంగా లేనా చెక్ చేసుకుందాం అని అర్థం ముందుకు వెళ్లి చూసుకుంటుంది. ఒకసారిగా పెద్దగా అరుస్తుంది దయ్యం దయ్యం అని తనకి తానే చూసుకొని భయపడుతుంది. అమ్మో ఎప్పుడు మేకప్ తీసేయకూడదు అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode January 09 2024 Episode 515 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 09 2024 Episode 515 Highlights

ఇక పద్మావతి ఉదయం లేస్తూనే దేవుడి మందిరం దగ్గర పూజ చేస్తూ ఉంటుంది.అక్కడికి వచ్చిన ఇంట్లో అందరూ, పద్మావతి అను పూజ చేయడం చూస్తూ ఉంటారు. కుచల ఏమిటి ఉదయాన్నే అక్కా చెల్లెలు పూజలు చేస్తున్నారు అని అంటుంది వెటకారంగా, ఆర్య అమ్మ పూజ చేయడం కూడా తప్పేనా అని అంటాడు. ఇక అను పద్మావతి ఇద్దరు పూజ చేసి పద్మావతి హారతి తీసుకొని బయటికి వస్తుంది పూజ మందిరం నుండి అప్పుడే విక్కీ మెట్లు దిగి ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు. అరవింద విక్కీ అని పిలిచి హారతి తీసుకోమని చెప్తుంది కానీ విక్కీ నాకు అర్జెంట్ పని ఉంది అక్క అని అంటాడు. మీరు వెళ్లే పని సక్సెస్ అవ్వాలని హార్ తీసుకొని వెళ్ళండి సార్ అని అంటుంది పద్మావతి. సరే అని విక్కీ హారతి తీసుకోవడానికి వస్తాడు ముందు షూస్ ఉన్నాయి కాళ్ళకి విప్పేసి రండి అని అంటుంది. విక్కీ సరే అని తీయడానికి వెళ్తాడు అప్పుడే ఆర్య నీ మాట బాగా వింటున్నాడు పద్మావతి విక్కీ అని అంటాడు. విక్కీ హారతి అద్దుకుంటూ ఉండగా హారతి ఆరిపోతుంది పద్మావతి టెన్షన్ పడుతుంది ఇంట్లో అందరూ కూడా టెన్షన్ పడి విక్కీని ఎక్కడికి వెళ్లదు ఇలా జరిగితే ఏదో ఒక శిఖరం అని అంటారు కానీ విక్కీ అవన్నీ పట్టించుకోకుండా నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అక్క నేను వెళ్ళాలి అసలు దొంగలు ఎవరో పట్టుకోవాలి ఈ రోజు ఎలాగైనా తెలుస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పద్మావతి చాలా భయపడుతూ ఉంటుంది ఇక నేను గుడికి వెళ్లి మా ఆయనకి ఏ ఆపద రాకుండా ఉండడానికి పూజ చేసి వస్తాను అని అంటుంది అను నేను కూడా వస్తాను అంటుంది. ఇక అక్క చెల్లెలు కలిసి గుడికి వెళ్తారు విక్కి ఆఫీస్ కి వెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode January 09 2024 Episode 515 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 09 2024 Episode 515 Highlights

గుళ్లో పద్మావతి అను విక్కి పేరు మీద పూజ చేయిస్తారు. ఏ ఆపద రాకుండా నా భర్త నువ్వే కాపాడాలి అని పద్మావతి దేవునికి దండం పెట్టుకుంటుంది ఆయన మనసులో ఇప్పుడే నా మీద ప్రేమ మొదలైంది అది ఎక్కువ అయ్యి నేను దగ్గర అవ్వాలి అని అనుకుంటుంది. పూజ అయిన తర్వాత అనుకి అనుమానం వస్తుంది అమ్మి ఇదంతా ఆ కృష్ణ చేస్తున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది విక్కీ జైల్ నుండి ఇంటికి రాగానే అందరూ సంతోషంగా ఉంటే వాడు మాత్రం చాలా టెన్షన్ పడ్డాడు అంటే దీన్ని బట్టి వాడి హస్తం ఇందులో ఉందేమో అనిపిస్తుంది నువ్వు ఎందుకైనా మంచిది వాడితో జాగ్రత్తగా ఉండండి అని అంటుంది సరే అక్క అని అంటుంది పద్మావతి. నాకు కొంచెం పనుంది అక్క నువ్వు ఇంటికి వెళ్లిన తర్వాత వస్తాను అని అనుని పంపిస్తుంది పద్మావతి తర్వాత పద్మావతి కృష్ణ కి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేస్తూనే కృష్ణ నువ్వేనా పద్మావతి నాకు ఫోన్ చేసింది నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటో చెప్పు చిటికలో చేసేస్తాను నువ్వు ఏది చెప్పినా అని అంటాడు. అయితే నువ్వు చచ్చిపోవాలి అని అంటుంది ఆ మాటలకు కృష్ణ షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావ్ పద్మావతి అని అంటాడు. నువ్వు చచ్చిపోకపోతే నేనే చంపేస్తాను అని అంటుంది. మా ఆయన జైలుకు వెళ్లడానికి కారణం నువ్వే అని నాకు అర్థం అవుతుంది అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode January 09 2024 Episode 515 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 09 2024 Episode 515 Highlights

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి, గుళ్లో నుంచి బయటికి వస్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ సోది చెబుతూ నువ్వు నా నుండి దాటుకొని వెళ్లగలవు కానీ నీకు వచ్చే కష్టాన్ని దాటుకొని వెళ్లలేవు అని అంటుంది. ఆ మాటలకు పద్మావతి వెనక్కి తిరిగి ఆ పెద్దావిని చూసి ఏమంటున్నారు మీరు అని అంటుంది ఆమె పిల్ల నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో అది నీకు దూరం అవుతుంది శాశ్వతంగా నువ్వు కావాలనుకున్నది నీకు దూరమవుతుంది అని అంటుంది అప్పుడే విక్కీ ఫాస్ట్ గా కారు నడుపుకుంటూ వస్తాడు ఎదురుగా ఒక పెద్ద లారీ వస్తూ ఉంటుంది. విక్కీ కేదో ఆక్సిడెంట్ జరగబోతున్నట్టుగా చూపిస్తారు. చూడాలి రేపు ఎపిసోడులో విక్కీ కి ఆపద ఎటు నుంచి మంచిగ వస్తుందో పద్మావతి ఎలా కాపాడుతుందో..

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri