NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi March 15 2024 Episode 358: మనసులో ప్రేమని చంపుకొని రాజ్ కి విడాకులు ఇచ్చిన కావ్య.. రాజ్ సంతకం పెట్టాడా.?

Brahmamudi Today Episode March 15 2024 Episode 358 highlights

Brahmamudi March 15 2024 Episode 358:  నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్, అనామికకు ధాన్యానికి బుద్ధి చెప్తాడు. కళ్యాణ్ ఎన్నడు లేని విధంగా తల్లి మీద కోప్పడం ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. తన వదినకి సపోర్ట్ చేసి అప్పుతో స్నేహాన్ని అర్థం చేసుకోవడంలో, మీరిద్దరి మెదడు పాడైపోయిందని కళ్యాణ్ తిడతాడు. అసలు ఏ రోజు నువ్వు నన్ను తల్లిగా పెంచలేదని ఇంట్లో ఉన్న పెద్దమ్మ పెదనాన్న నన్ను పెంచారని, ఇవాళ ఇల్లుని ముక్కలు చేయడానికి నా భార్యతో కలిసి ఇలా చేస్తున్నావని తల్లి మీద కోప్పడతాడు కళ్యాణ్. ఇక కల్యాణ అలా మాట్లాడడంతో ఇందిరాదేవి కూడా ఇద్దరిని అరచి పంపిస్తుంది. కళ్యాణ్ కావ్య కి సారీ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode March 15 2024 Episode 358 highlights
Brahmamudi Today Episode March 15 2024 Episode 358 highlights

ఈరోజు ఎపిసోడ్లో కావ్య కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. మీరు చేస్తున్నది నీకైనా అర్థమవుతుందా మా అమ్మానాన్నల మీద ఇలా మీ వాళ్ళు అరిచేసి రావడానికి మీరు కారణం అవుతున్నారు అని అంటుంది. మీరు కూడా నన్ను ఇలా అర్థం చేసుకున్నారా వదిన అని అంటాడు. వాళ్ళు అలా మాట్లాడడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు. కవి గారు మీకు ఇప్పుడు పెళ్లి అయింది అని మర్చిపోతున్నారు అని అంటుంది కావ్య. కానీ నాకు అప్పుడు ఎప్పటినుంచో స్నేహం ఉందని వాళ్ళు మర్చిపోతున్నారు అని అంటాడు కళ్యాణ్. అది సహజం కవి గారు అని అంటుంది ఇది స్నేహం వదిన అని అంటాడు కళ్యాణ్. స్నేహానికి రూపాంతరాలు ఉండవు అది ఒకే ఒక జీవపదార్థం, వానాకాలంలో తడిచిపోయి చలికాలంలో వణికిపోయి ఎండాకాలంలో ఇంకిపోయినట్టుగా తన స్వరూపాన్ని స్నేహం మార్చుకోదు. పెళ్లి కాకముందు స్నేహంగా ఉండి పెళ్లయిన తర్వాత స్నేహానికి మార్చుకోవాలంటే ఎలా వదిన అని అంటాడు. మీ మనసు తెల్లని పేపర్ లాంటిది.

Brahmamudi Today Episode March 15 2024 Episode 358 highlights
Brahmamudi Today Episode March 15 2024 Episode 358 highlights

కానీ సిరా మరకలు పడినట్లు మీ మీద మచ్చ పడితే అది జీవితాంతం నచ్చగానే ఉంటుంది అని ఉంటుంది కావ్య. మీరు మగవారు మీకేం కాదు కానీ మా చెల్లి నీ మీద నిందలు వేస్తున్నారు. మేమంతా కలిసి మిమ్మల్ని మాయిలో పడేసినట్టు వాళ్ళ ఆలోచిస్తున్నారు అని అంటే వాడి వాళ్ళ ఆలోచన వదినా అని అంటాడు. మీరంతా నిష్టూరంగా మాట్లాడితే నేను అప్పుకు అంత దూరం అవుతానని మీరు అనుకుంటున్నారు కానీ మీరు నా స్నేహాన్ని మీరు గుర్తిస్తారని నాకు తెలుసు, మీకు అన్ని తెలుసు కవి గారు కానీ మీ భార్యగా వచ్చిన అనామిక మనసులో ఏ ఉద్దేశాలు ఉన్నాయో మీరు గుర్తించరా అని అంటుంది. అనామిక అపార్థం చేసుకుంటుంది కదా అని అంటే అపార్థం చేసుకునే వాళ్ళకి విలువ వలసిన అవసరం లేదు. ఒక మాట చెప్తాను వదిన,ఇంట్లో వాళ్ళు ఏదో అంటున్నారని బయట వాళ్ళు ఏదో అనుకుంటున్నారని, అప్పుని నేను దూరం పెడితే మా బంధం లేదో తప్పు ఉన్నట్టు నేనే ఒప్పుకున్నట్టు అవుతుంది కానీ నేను ఆ పని ఎప్పటికీ చేయను క్షమించండి వదిన, ఈ విషయంలో నేను మీ మాట వినలేను. అప్పు ని కలవాలనుకుంటే కలిస్తేరుతాను. ఎవరు ఏమన్నా అనుకున్నా మాది స్నేహం అంతే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్.

Brahmamudi Today Episode March 15 2024 Episode 358 highlights
Brahmamudi Today Episode March 15 2024 Episode 358 highlights

ఇక కావ్య రాజ్ కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రాజ్ కావ్య చేతిలో డబ్బులు పెడతాడు. ఒక కాఫీ కి ఎన్ని డబ్బులు అని అడుగుతుంది. ఇది నీకు రావాల్సిన డబ్బులే అని అంటాడు. నువ్వు వేసిన డిజైన్స్ కి నేను ఇవ్వాల్సిన డబ్బు. నెల కాగానే జీతం ఇస్తారు కదా అని అంటుంది. అప్పటిదాకా నువ్వు ఉండవు కదా పాస్పోర్ట్ వచ్చిందిగా కారం వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవాలి కదా, ఇంకా అవసరమైతే అడుగు ఇస్తాను అని అంటాడు రాజ్. ఆ మాటలకు కావ్య బాధపడుతుంది. ఇప్పుడే అప్పుడే అక్కడికి ఇందిరా దేవి, భాస్కర్ వస్తారు.చూశారా మామగారు మీ మనవడి దారి ఖర్చులకోసం డబ్బులు ఎంత ఇచ్చాడో అని అంటుంది. చూసావా బావ మా ఆయన గురించి ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది. నేను నా భర్త నా కాపురం నా ఇల్లు అని ఈ జోరు పట్టుకొని వేలాడుతూ ఉంటే, నువ్వు నీ బ్రతుకు అని చాలా తేలిగ్గా చెప్పేసి వెళ్లిపోయాడు. నువ్వు ఇలానే ఆలోచిస్తుంటే వాడు ఆహానికి పోయి ఏర్పాట్లు డ్రాప్ చేసిన డ్రాప్ చేస్తాడు అని అంటుంది అమ్మమ్మ గారు. ఎయిర్ పోర్ట్ లో ఎందుకు గాలి మేడలు కట్టుకోవడానికా ఓహో గాల్లో తేలిపోవడానికి అని అంటుంది ఇంకా నీకు అర్థం కావట్లేదు కావ్య అని అంటుంది ఇందిరా దేవి. నువ్వు వెళ్ళిపోతావనిసరికి వాడు తట్టుకోలేక ఇదంతా చేస్తున్నాడు అని అంటుంది ఇందిరాదేవి.

Brahmamudi Today Episode March 15 2024 Episode 358 highlights
Brahmamudi Today Episode March 15 2024 Episode 358 highlights

ఇక ఇందిరాదేవి మాట్లాడుతూ నువ్వు నటించడానికి అహాని అడ్డం పెట్టుకుంటే, వాడు ఆహాన్ని చూపించడానికి నటిస్తున్నాడు ఇద్దరికి ఇద్దరు తరచాటున మనసును దాచుకొని ఆధర ఎవరు తీస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత తీయాలంటే ఈ దాగుడుమూతలు ఆట ముగించాల్సి ఉంటుంది. అందుకే నువ్వు కాగితాల మీద సంతకం పెట్టి వాడి మొహాన కొట్టు అప్పుడు ఎందుకు దిగిరాడు నేను చూస్తాను అని అంటుంది ఇందిరా దేవి. ఇంకా మీరు మారతారని అనుకుంటున్నారా అని అంటుంది కావ్య వెంటనే భాస్కర్ నేను కూడా అనుకుంటున్నాను అని అంటాడు. ఇది ఆట కాదు గెలుపు ఓటమి అనుకోవడానికి నీ జీవితం నీ భర్త మనసులో నువ్వు ఉన్నావు అది నాకే అర్థమైంది నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని అంటాడు భాస్కర్. నువ్వు దూరమైపోతావ్ అన్న బాధలోనే అతని వింతగా ప్రవర్తిస్తున్నాడు కానీ ఏ దూరం అయితే బ్రతకలేడు అని అంటాడు భాస్కర్. అసలు నిన్ను దూరం అవుతావని తెలిస్తే కదా ఆ బాధకి వాడు మారతాడని నీకు అర్థమయ్యేది అని అంటుంది. చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో ఒకరోజు మాట్లాడుతూ రెండో రోజు మాట్లాడుతారు వాడు కూడా అంతే చిన్న పిల్లలు మనస్ఫూర్తిగా ఇంకా పోలేదు వాడికి ఎంత ప్రేమ ఉండేది నీ ముందు ప్రదర్శించకపోవచ్చు కానీ నువ్వు లేనప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఏదైనా అంటే మాత్రం వాడు అసలు ఊరుకోడు. నీ మీద ప్రేమ లేకపోతే ఎందుకు అంతలా వెనకేసుకొస్తాడు అని అంటుంది ఇందిరాదేవి. నువ్వు ఉండాలి ఉండవు అనే భరించలేడు కాదు ఇదిగో కావ్య అనే చేతిలో విడాకులు పేపర్ పెట్టి, సంచలన్నీ వదిలిపెట్టు సందిగ్ధంలో నుంచి బయటికి రా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకో ఆ తర్వాత నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ పేపర్స్ చూసి కావ్య బాధపడుతుంది.

Brahmamudi Today Episode March 15 2024 Episode 358 highlights
Brahmamudi Today Episode March 15 2024 Episode 358 highlights

ఇక కావ్య కృష్ణుడి విగ్రహం ముందుకు వెళ్లి ఆ పేపర్స్ చూస్తూ బాధపడుతూ కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటుంది. ధూపం దీపం పూల మాల అన్ని అమరుస్తూ నిత్యం నీతో నిరాజనం చేస్తూనే ఉన్నాను. మీ ఇంటికి వచ్చినప్పుడు, నాకంటే ఒక గది లేకపోయినా నీకంటూ ఒక గది ఉండాలని, ఇక్కడ ప్రతిష్టించుకున్నాను నీలాగే నా భర్త రూపాన్ని కూడా గుండెల్లో ప్రతిష్టించుకున్నాను. కానీ ఆయన గుండెల్లో నేను లేను అంటున్నాడు. నన్ను భార్యగా ఒప్పుకోనుంటున్నాడు. నాకు తెలియక అడుగుతున్నాను నువ్వు ఎనిమిది మంది భార్యలను ఎలా భరించావయ్యా మా ఆయన ఒక భార్యని వద్దంటున్నాడు. అయినా అంతా కృష్ణమాయే కదా మరి ఆయన మా ఆయన ను ఏమాయ కమ్మేసింది అని అంటుంది కావ్య. నీ అనుగ్రహం నేను నిత్యం కోరుకున్నాను అలాగే మా ఆయన కోసం ఓపిక వదినా సర్దుబాటు అన్ని నేర్చుకున్నాను, కానీ ఆయన అనుగ్రహం మాత్రం కలవడం లేదు. పాతాళంలో నీళ్లు ఉంటే నాకెందుకు, నా దాహం తీరడానికి నేల మీద నీళ్లు కూడా ఉండాలి కదా అని అంటుంది కావ్య. ఆ పాతాళ గంగని బయటికి తీసుకురావాలంటే, నేను కాగితాల మీద సంతకం చేయాలంటున్నారూ, ఈ పత్రాలు విడాకుల కోసం, బంధాన్ని విడదీయడానికి ఉపయోగించే ఈ పత్రాలు, ఇప్పుడు మా ఇద్దరిని కలపడానికి ఉపయోగపడతాయి అంటున్నారు. ఎంత చిత్రం కదా, ఇది కత్తి మీద సామాను నాకు తెలుసు కొంచెం అటు ఇటు అయినా మాత్రం, నీదే బాధ్యత సుమా అని కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటుంది కావ్య. నాకు మాత్రం ఏం సంబంధం లేదు అంతా నీ మీద భారం వేసి, నా బాధను మీతో చెప్తున్నాను. అందరూ విడిపోవడానికి సంతకం చేస్తారు నేను కలవడానికి సంతకం చేస్తున్నాను. అని బాధగా కృష్ణుడి దగ్గర పేపర్స్ పెట్టి సంతకం చేస్తుంది కావ్య.

ఇక రాజ్ గదిలో రెడీ అవుతూ ఉంటాడు కావ్య గది బయట నుంచి రాజ్ ని చూస్తూ ఉంటుంది. ఒకసారి గా పేపర్స్ ని పక్కకు విసిరేసి, రాజు వెనక నుండి హద్దుకొని, మీరు నాకు కావాలి నేనెప్పటికీ నీ భార్య గానే ఉండాలి. నన్ను దూరం చేసుకోవద్దు నేను భరించలేను. మీకు దూరమై నేను బ్రతకలేను ఆ మాట కూడా నేను తట్టుకోలేను, ప్రశాంతంగా బతకలేను అని కావ్య ఏడుస్తూ ఉంటుంది. మీరు నాకు కావాలి అని రాజ్యం వెనుక నుండి హద్దుకొని చెప్తూ ఉంటుంది కావ్య. అదంతా కల కావ్య బయటే గది బయట నిలబడి ఉంటుంది. ఒకసారి రాజ్ వెనక్కి తిరిగి పిలిచావా అని అంటాడు. ఇదంతా కల అని అంటుంది. అయినా గది బయట నిలబడ్డావ్ ఇంటి లోపలికి రావచ్చుగా అని అంటాడు రాజ్. లోపలికి ఏడుస్తూ వచ్చిన కావ్య ఆ పేపర్స్ రాజ్ చేతిలో పెడుతుంది. ఏంటి పేపర్స్ అని అంటాడు రాజ్. మన భవిష్యత్తు ఈ పేపర్స్ లోనే ఉంది అని అంటుంది. ఇది నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటే మీ సంతకం కావాలి అని అంటుంది. స్వప్నకి రాసినట్టుగా నీకూడా భరోసా కోసం ఆస్తి ఏమైనా రాసి చాలా అని అంటాడు. సిరాస్తులు రాసించే రైట్స్ నా దగ్గర లేవు అవి తాతయ్య రాయాల్సి ఉంటుంది. అయినా నానమ్మ బెస్ట్ ఫ్రెండ్ కదా నీకు నువ్వు నానమ్మతో చెప్పి ఆస్తులు రాయించుకో అని అంటాడు ఆ పేపర్స్ ఏం అన్నది చూడకుండా మాట్లాడుతూ ఉంటాడు. నాకు మీ ఆస్తులు ఏమీ అవసరం లేదు అని అంటుంది కావ్య మరి అయితే ఏం కావాలి అని అంటాడు రాజ్ విడాకులు అని అంటుంది కావ్య ఒకసారి షాక్ అవుతాడు రాజ్. ఏమన్నావ్ అని అడుగుతాడు.

ఇక కావ్య ఆ పేపర్స్ రాజ్ కి ఇస్తూ విడాకుల పేపర్స్ మీద నేను సంతకం చేశాను. మీరు సంతకం చేయడమే బాకీ ఉంది. మీరు కోరుకున్నదే కదా, నేనేం వెళ్లిపోతాను అనలేదు. నాకు విడాకులు ఇచ్చి స్వేత ని పెళ్లి చేసుకుంటానని మీరే చెప్పారు కదా అని అంటుంది కావ్య. ఆ నిజాన్ని మీరు చెప్పేశాక నేను ఇంకా నీతో కలిసి ఉండడంలో అర్థం లేదు. నీకు నేనంటే ఇష్టం లేనప్పుడు, భారీగా నేను మీకు అక్కర్ లేనప్పుడు, ఎంతకాలమని నీతో కలిసి ఉండగలను అని అంటుంది. నా వంతు ప్రయత్నం గా నేను చాలా చేశాను, మీరు మారతారని నమ్మకంతో బతికాను. ఏడాది గడిచింది ఆ నమ్మకం పోయింది. ఇంకా నేను మీ ఎదురుగా ఉంటే మీరు కోరుకున్నది నేను జరగకుండా ఆపలేను మీ జీవితం నీ ఇష్టం. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు భార్య అంటే ఒక అభిప్రాయం లేకుండా ఉండకూడదు. నీకు నేను అక్కర్లేదు. అది నాకు ఆలస్యంగా అర్థమైంది. అందుకే విడాకుల పత్రాలు మీద సంతకం చేసి తీసుకొచ్చాను అని అంటుంది మీరు కూడా సంతకం చేసి కోర్టుకు వెళ్తే, సులువుగా మనకి విడాకులు మంజూరు అవుతాయి. కాకపోతేమీ ఇంట్లో వాళ్లకి మీరు చెప్తారా లేకనన్ను చెప్పమంటారా అని అంటుంది కావ్య. ఇంత దాకా వచ్చిన తర్వాత దాచి పెట్టి ఏం లాభం అని అంటుంది. రాజ్ ఏమి మాట్లాడకుండా అలానే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో రాజ్ తో శ్వేత,ఆఫీస్ లో మాట్లాడుతూ ఉంటుంది.కావ్య నీ జీవితంలోనుంచి వెళ్తుందన్న ఊహ తట్టుకోలేక నీ మెదడు స్తబ్దంగా మారింది. నీ మనసు మౌనంగా ఉండిపోయింది. నువ్వు ఇలా నిలబడి ఏమి చేయకపోతే ఎలా తను వెళ్లిపోతే నువ్ బతకలేవు అని,పిచ్చోడివి అయిపోతావ్ అని ఏ తప్పు చేయని భార్య నీపై ప్రేమను చంపుకునివదిలి వెళ్ళిపోతుంది. వెళ్లు.. వెళ్లి నీ మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టు. కావ్య అడుగు బయట పెట్టకుండా నీ ప్రేమను అడ్డుపెట్టు అని రాజ్‌తో శ్వేత చెబుతుంది.అన్ని రాజ్ వింటూ ఉంటాడు. ఇంట్లో కావ్య ఏడుస్తూ ఉంటుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella