NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జనసేన, బీజేపి టిక్కెట్లు డిసైడ్ చేస్తున్న చంద్రబాబు.. ఈమాత్రం దానికి పొత్తులు ఎందుకో..?!

Chandrababu is deciding Janasena and BJP tickets.

ఏపీలో అధికార వైసీపీని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీతో బీజేపి, జనసేన జట్టు కట్టాయి. ఈ మూడు పార్టీలున్నారు. ఇక గతంలో తన పార్టీలో ఉన్న ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను కూడా బీజేపిలోకి పంపింది చంద్రబాబు అన్నది తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరికి కూడా లోక్‌స‌భ టిక్కెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జనసేన సీట్ల ఎంపికలో చంద్రబాబు ముద్ర ఎలాగూ ఉంది. చాలావరకు చంద్రబాబు చెప్పిన వారికే.. పవన్ సీట్లు ఇస్తున్న పరిస్థితి.

నిన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబును జనసేనలోకి పంపి.. భీమవరం జనసేన టికెట్ ఇప్పించింది కూడా చంద్రబాబు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విషయం సగటు రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికి అయినా తెలుస్తుంది. సీఎం రమేష్‌కు అనకాపల్లి సీటు దాదాపు ఖరారు అయింది. ఇక రఘురామ కృష్ణంరాజుకు కూడా నరసాపురం సీటు ఇచ్చేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు మరో ఆప్తమిత్రుడు అయిన బిజేపిలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఎక్కడ సీటు సర్దుబాటు చేయాలా అని చంద్రబాబు ఒక్కటే తలమనుకలు అవుతున్నారు.

సుజనా చౌదరికి బీజేపి ఎంపీ సీటు రాని పక్షంలో అవస కలిసి ఎన్నికలలో వైసీపీని ఢీకొట్టబోతున్నాయి.
విచిత్రం ఏంటంటే మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరినా.. టిడిపి అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ టికెట్లతో పాటు అటు జనసేన, బిజెపి టిక్కెట్లను కూడా తానే డిసైడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు రఘురామ కృష్ణంరాజు పెద్ద ఉదాహరణ. ఆయనను బీజేపిలోకి పంపి నరసాపురం సీటు పొత్తులో భాగంగా.. బీజేపికి ఇచ్చి.. ఆయనకు ఎంపీ టికెట్ వచ్చేలా చక్రం తిప్పుతున్నారు. అయితే సుజ‌నాకు బీజేపీలో సీటు రాక‌పోతే తెలుగుదేశంలో చేర్చుకుని ఏలూరు పార్లమెంటు సీటు అయిన ఇవ్వాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

విచిత్రం ఏంటంటే గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డికి పొత్తులో భాగంగా జమ్మలమడుగు సీటు ఇవ్వాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే జమ్మలమడుగు సీటును బీజేపికి కేటాయించారు. అయితే అక్కడ ఆదినారాయణ రెడ్డి అన్నకుమారుడు భూపేష్ రెడ్డి టిడిపి ఇన్చార్జిగా ఉన్నారు. ఇప్పుడు ఆ సీటు తనకే ఇవ్వాలంటూ భూపేష్ రెడ్డి పట్టుబడుతున్నారు. చంద్రబాబు మాత్రం గత రెండు సంవత్సరాలుగా భూపేష్‌ను వాడుకుని ఇప్పుడు తన మిత్రుడు ఆదినారాయణ రెడ్డి కోసం ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపికి వదులుతున్నారు.

ఇక అనంతపురం జిల్లాలోని ధర్మవరంలోనూ అదే పరిస్థితి. గత టిడిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు స్నేహితుడు వరదాపురం సూరి కోసం పరిటాల శ్రీరామ్‌ని బలి పశువుని చేస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పరిటాల శ్రీరామ్‌ను ధర్మవరంలో వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా అపర రాజకీయ చాణిక్యుడుగా ఉన్న చంద్రబాబు.. తన కుళ్ళు రాజకీయాలను ప్రయోగించి టిడిపి, జనసేన పార్టీలలో ఉన్న తన స్నేహితులకు కూడా టికెట్లు వచ్చేలా తెరవెనక రాజకీయం నడిపిస్తున్నది వాస్త‌వం.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju