Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మంచి జోరుగా సాగుతోంది. షో స్టార్ట్ అయ్యే ఆల్రెడీ నాలుగు వారాలు అయిపోయాయి. ఈ నాలుగు వారాలకు గాను నలుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొత్తం 14 మంది సీజన్ సెవెన్ స్టార్టింగ్ లో ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం 10 మంది మిగిలారు. ఈ పది మందిలో ఐదో వారానికి ఏడుగురు నామినేషన్ లో ఉన్నారు. వాళ్లు ఎవరంటే శివాజీ, యావర్, శుభశ్రీ, అమర్ దీప్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్. అయితే ఈ ఏడుగురిలో నామినేషన్ స్టార్ట్ అయిన నాటి నుండి ఓటింగ్ పరంగా ఐదో వారంలో నటుడు శివాజీ టాప్ మోస్ట్ స్థానంలో నిలిచారు.
అందరికంటే అత్యధికమైన ఓట్లతో దూసుకుపోతున్నారు. సీజన్ సెవెన్ లో ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కి రాని ఓటింగ్ శాతం మనోడికి వస్తుంది. హౌస్ లో చాలా కూల్ గేమ్ ఆడుతూ ఎవరిని ఎలా డీల్ చేయాలో ఆ రకంగా డీల్ చేస్తూ… శివాజీ చాలా పద్ధతిగా గేమ్ ఆడుతున్నాడు. సీజన్ సెవెన్ లో చాలా వరకు సీరియల్ బ్యాచ్ హడావిడి ఎక్కువ అయిపోయింది. ఈ క్రమంలో సామాన్యులు లాంటి ప్రశాంత్, యావర్ లను ఇబ్బందులు పాలు చేయాలని అనేక కుయుక్తులు పన్నుతున్న గాని శివాజీ తన గేమ్ ఆడుకుంటూ మరోపక్క వారిని రక్షిస్తూ… హౌస్ లో అందరూ సమానమే అన్న రీతిలో చాలా తెలివిగా గేమ్ ఆడుతూ.. మరో పక్క ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్నాడు.
ఇప్పటివరకు ఆట తీరుబట్టి చూస్తే బయట ఖచ్చితంగా సీజన్ సెవెన్ ట్రోఫీ నటుడు శివాజీ అందుకుంటాడని బిగ్ బాస్ ఆడియన్స్ తో పాటు సోషల్ మీడియా లో నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఐదో వారం ఓటింగ్ లో శివాజీ ఎవరికి అందని ఎత్తులో టాప్ పొజిషన్ లో ఓట్లు రాబడుతున్నాడు.