Devatha: దేవి కి కరాటే లో గ్రీన్ బెల్ట్ వచ్చిందన్న ఆనందంలో ఆదిత్య ఇంట్లో కేక్ కటింగ్ చేపిస్తాడు.. అప్పుడే సత్య ఆదిత్యతో మనం బయటికి వెళ్దామా అని అడుగుతుంది.. ఇప్పుడు కాదులే సత్య నీకు బయట ఏమేమి తినాలనిపించిందో చెప్పు.. అవన్నీ ఇంటికి ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను.. ఏం కావాలో చెప్పు అని ఆదిత్య అడుగుతాడు.. నాకు ఏం వద్దు అని సత్య గట్టిగా అరుస్తుంది.. ఇదిగో ఇదే నా జీవితంలోకి వచ్చి నాకు నిన్ను దూరం చేస్తుంది అని సత్య దేవుని చూస్తూ అంది..
ఏం మాట్లాడుతున్నావ్ సత్య అని ఆదిత్య పెద్దగా అరుస్తాడు అవును నేను మాట్లాడేది నిజమే ఏదో ఒక విషయంలో ఇలా జరగడం లేదు ప్రతిసారి నా ఆనందానికి ఈ దేవి అడ్డు వస్తూనే ఉంది. నువ్వు ఇంట్లో వాళ్ళను కూడా మర్చిపోయి తనతో సంతోషంగా గడుపుతున్నావు. ఇప్పటివరకు నేను భరిస్తూనే వచ్చాను. ఇక భరించడం నావల్ల కాదు అని సత్యం అంటుంది. సత్య మాటలకు కమల కూడా వత్తాసు పలుకుతుంది.. నిజమే పటేలా నువ్వు దేవికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇంకెవరికి ఇవ్వటం లేదు అని అంటుంది అప్పుడే సత్య వాళ్ళ ఆదిత్య వాళ్ళ పిన్ని కూడా ఎప్పుడూ మాట్లాడని సత్య ఈరోజు మాట్లాడుతుంది అంటే.. కచ్చితంగా తనకి ఎంతో బాధ ఉంటేనే కదా మాట్లాడుతుంది అని వాళ్ళ పిన్ని కూడా అంటుంది..
జానకమ్మ రాధ దగ్గరకు వెళ్లి నీ విషయంలో నా కొడుకు నేను చాలా బాధ పెట్టి ఉంటాడు. ఇకనుంచి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని జానకమ్మ రాధతో అంటుంది. ఆ మటలను మాధవ్ దూరం నుంచి వింటాడు.. నువ్వు ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపో.. కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి చిన్మయి గురించి ఆలోచించు అని చాలా జానకమ్మ అంటుంది..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!