నాగశౌర్య: టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఈయనకు సరైన హిట్లు లేకపోయినా యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో భార్య సైతం నాగ సౌర్య కు వీరాభిమాని అని మీకు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి నాగ శౌర్య కు పెద్ద ఫ్యాన్ అట. ఆమె తన కాలర్ ట్యూన్ లో కూడా నాగశౌర్య సినిమా సాంగ్స్ నే పెట్టుకుంటుందట. ఇక నాగశౌర్య కు సైతం ప్రణతి అంటే ఎంతో గౌరవమట. ఆమెను ఒక చెల్లి గా ఆయన భావిస్తారట. ఈ విషయాన్ని నాగశౌర్య స్వయంగా వెల్లడించాడు.
నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే ఈయన `కృష్ణ వ్రింద విహారి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షిర్లే సేటియా హీరోయిన్గా నటించింది. రాధిక, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/ChohpgaLjnf/?utm_source=ig_web_copy_link
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!