Ennenno Janmala Bandham: అమ్మ నీకేం కాలేదు కదా అమ్మ అని ఖుషి ఆదిత్య అంటారు. ఏం పర్వాలేదు ఆయన ఎక్కడ అని వేద అడుగుతుంది. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడమ్మా ఇప్పుడే ఎక్కడికో వెళ్ళాడు అని సులోచన అంటుంది. నాన్న మీరు పిల్లలని తీసుకొని ఇంటికి వెళ్ళండి అని వేద యష్ దగ్గరికి వెళ్తుంది ఏమండీ ఏం చేస్తున్నారు ఏంటి ఇదంతా అని వేద అడుగుతుంది. నేను అదే అడుగుతున్నాను ఏంటి ఇదంతా అందరూ నువ్వు ఉన్నావు అని అంటారు అసలు ఏంటి నీ గొప్ప మా మీద నీకు ఏమి హక్కు ఉంది నాకు ఇష్టమైనవన్నీ తీసుకెళ్లడానికి నువ్వు ఎవరివి నాకు ఇప్పుడే సమాధానం కావాలి అని యష్ ఆ దేవుడిని నిలదీస్తాడు. ఏవండీ నేను చెప్పేది వినండి అని వేద అంటుంది.

నేను వినను ఎవరు ఏం చెప్పినా నేను వినను మా మధ్యలో ఎవరూ రాకూడదు మేము ఇద్దరమే మాట్లాడుకుంటాము ఏ నువ్వు చెప్పు సమాధానం చెప్పు తను ఎంత మంచిదో నీకు తెలుసా అసలు తన కడుపున పుట్టకపోయినా నా ఇద్దరి పిల్లల కోసం కన్న తల్లి కన్న ఎక్కువగా తపించిన తల్లి తను నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన దేవత తను చా దేవుడా నిన్ను తలుచుకోవాలంటేనే అసహ్యం వేస్తుంది నాకు మేము ఏం తప్పు చేశాము తప్పుడు పనులు చేసే ఆ అభిమన్యు లాంటి వాళ్లకు సపోర్ట్ చేస్తావు అని యష్ అంటాడు. ఏవండీ ఒకసారి నేను చెప్పేది వినండి అని వేద అంటుంది. నేను వినను ఇంకా ప్రాణం కూడా పోసుకొని పసిప్రాణాన్ని చంపేశాడు బ్రేక్ ఫెయిల్ కాదది అభి గాడు చేశాడు కారు రాష్గా నడిపి యాక్సిడెంట్ చేసింది కూడా వాడే నిన్ను చంపాలని చూస్తున్నాడు అని యష్ అంటాడు.

చంపితే చంపనివ్వండి చంపుతానన్న వాడే చస్తాడు మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను వాళ్లకి తల్లిని కాన నేను కూడా అమ్మనే అవుతాను నాకు ఆ నమ్మకం ఉంది అని వేద అంటుంది. చూడవయ్యా చూడు తనకున్న నమ్మకం కూడా నాకు లేదు నాకు ఆ నమ్మకాన్ని ఇవ్వలేదు నువ్వు ఇవ్వలేవు కూడా అని యష్ అంటాడు. ఇస్తాడండీ దేవుడు అన్ని ఇస్తాడు మిమ్మల్ని నాకు ఇవ్వలేదా నీ ప్రేమని నాకు పంచ లేదా మీరు నాకు ఎంతో ఇచ్చారు ఏవండీ ఒక్కసారి నా కళ్ళలోకి చూడండి మనం గెలుస్తాం మనల్ని మన ప్రేమే గెలిపిస్తుంది వెళదాం పదండి అని వేద యష్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే అభిమన్యుకు మెలకువ వస్తుంది క్లోజ్ చేసావ్ ఏంటి అని అభి అడుగుతాడు. చెప్పాను కదా ఈ ఇంట్లో మనం ఇద్దరమే బంధీలమని అని నీలాంబరి అంటుంది. నాకు ఏదో అవుతుంది హాస్పిటల్ కి తీసుకువెళ్ళు ఏంటే నీ ఉద్దేశం అని అభి అంటాడు.నలుగురికి మంచి చేయాలనే స్వదుర్దేశం నీకు ముందే చెప్పాను కదా నీ నోరు ఎరుపెక్కి నీ చెవులకు ఇన సొంపుగా వగైరా వగైరా అని నీలాంబరి అంటుంది. అంటే ఇవన్నీ నీకు ముందే తెలుసా అని అభి అంటాడు. చేసిందే నేనైతే నాకు తెలుసా అంటావేంటి నువ్వు తిన్న ప్రతి దాంట్లో విషం ఉంది నువ్వు నడవలేవు మెల్లగా నీ కాళ్లు చేతులు చచ్చుబడిపోతాయి తర్వాత నోరు పడిపోతుంది ఆ తరువాత ప్రాణమే పోతుంది అని నీలాంబరి అంటుంది.ఎందుకు చేసావు ఈ పని అసలు ఎవరు నువ్వు అని అభి అడుగుతాడు. మంచి క్వశ్చన్ ఈయన మీకు గుర్తున్నారా అని ఫోటో చూపెడుతుంది. పాండురంగారావు గారు అని అభి అంటాడు.

ఆయన కూతుర్నే నేను నిన్ను మట్టు పెట్టి నిన్ను సర్వ నాశనం చేయాలంటే ఈ నాటకం ఆడక తప్పదు అని అనుకున్నా అని తాళి తీసి అభి మొహం మీద విసిరేస్తుంది. ఇదంతా మోసం అని అభి అంటాడు.మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా మా నాన్నని నువ్వు ఎంత మోసం చేశావు చిత్ర జీవితంతో ఆడుకోవాలనుకున్నావు మాళవిక జీవితాన్ని సర్వనాశనం చేశావు పాపం వేద యష్ లని ముప్పు తిప్పలు పెడుతున్నావు నువ్వు అసలు మనిషివేనా రా 100 ఏనుగుల్ని తిన్న రాబంధు కూడా ఒక్క సుడిగాలికి నేలకు వరగాల్సిందే ఆ సుడిగాలిని నేనే అని నీలాంబరి అంటుంది. నన్ను చంపుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఉరికంభం ఎక్కుతావు అని అభి అంటాడు. జైలు పాలు అయ్యానని అవమానం తట్టుకోలేక అభిమన్యు అన్నంలో విషయం కలుపుకొని చనిపోయాడు అని రేపు పేపర్లో వస్తుంది కానీ నువ్వు తిన్న విషానికి విరుగుడు బాటిల్ ఇదే అని నీలాంబరి అంటుంది. ఏ ఆ బాటిల్ ఇలా ఇవ్వు నీకు ఈ ఆస్తినంతా రాసి చేస్తాను అని అభి అంటాడు. నువ్వేంటి నాకిచ్చేది ఇదంతా నా ఆస్తి నువ్వు బ్రతకాలని చూసినా నేను ఇవ్వను అని నీలాంబరి అంటుంది. అభిమన్యు అటు ఇటు కొట్టుకొని ప్రాణం వదిలేస్తాడు. ఒక చీడపురుగు చచ్చింది పీడ పోయింది అని నీలాంబరి వాళ్ళ నాన్నగారి ఫోటో తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వేద నేను ఆఫీస్ కి వెళ్ళొస్తాను అని యష్ అంటాడు.

ఆఫీస్ కి వెళ్తున్నారా అని వేద అంటుంది.అవును టైం ఆగదు కదా వేద అని యష్ అంటాడు.అవును మబ్బులు కమ్మిన సూర్యుడు రాకుండా ఉండడు కరిగిపోయేది మబ్బులు కలకాలం ఉండేది సూర్యుడు ఎవరి కథ ఆగకూడదు అని వేద అంటుంది. అమ్మ నువ్వు క్లినిక్ కి వెళ్తావా నేను అన్నయ్య స్కూల్ కి వెళ్తాము రా అన్నయ్య అని ఖుషి అడుగుతుంది. ఇంతలో డాక్టర్ గారు వేద వాళ్ళ ఇంటికి వస్తుంది వేద గారు మీకు జరిగిన యాక్సిడెంట్లో మీ ప్రెగ్నెన్సీ పోలేదు మీరు బాగానే ఉన్నారు కడుపులో పాప కూడా బాగానే ఉంది ఈ రిపోర్ట్లన్నీ చూశాక చెబుతున్నాను మీ ప్రెగ్నెంట్ బాగానే ఉంది అని డాక్టర్ అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోష పడిపోతారు థాంక్స్ డాక్టర్ గారు అని మాలిని అంటుంది. ఇంతలో యష్ కి ఫోన్ వస్తుంది హలో ఎవరు అన్నయ్య అంటాడు సార్ అభిమన్యు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని యష్ కి ఫోన్ లో చెబుతారు. కట్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కలిసి వేదకి శ్రీమంతం చేస్తారు దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది