NewsOrbit
Entertainment News Telugu TV Serials

BrahmaMudi: అమ్మమ్మ గారి మాట నిలబెట్టిన కావ్య.. కావ్య మీద అపర్ణ గెలిచినట్టేనా?

Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights

BrahmaMudi: నిన్నటి ఎపిసోడ్ లో రాజుకి సీతారామయ్య గారు హితబోధ చేస్తాడు. కావ్య చాలా మంచిదని తనని అర్థం చేసుకోవాలని, ఇన్నాళ్ల తన అనుభవంలో ఏది నిజమో ఏది అబద్దమో తనకి తెలుసునని అది నీకు మీ అమ్మకి అర్థం కావట్లేదు నువ్వు అర్థం చేసుకో అని చెప్తాడు. ఇక అనామికాకు కళ్యాణ్ గిఫ్ట్ ఇస్తాడు. అనామికతో కళ్యాణ్ ఫ్రెండ్షిప్ మొదలు పెడతాడు.అనామిక మాయలో పడి అప్పుని నిర్లక్ష్యం చేస్తాడు కళ్యాణ్.

Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights
Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights

ఈరోజు 190 వ ఎపిసోడ్ లో,అప్పుని కళ్యాణ్ కలుస్తాడు అప్పుడు క్షమించమని అడుగుతాడు. నువ్వు రాకపోవడానికి ఒక రీజనైనా చెప్పు అని అంటుంది అప్పు అంటే నేను అనామికని కలుస్తానని చెప్పాను కదా అంటాడు కళ్యాణ్. ఓహో మొత్తానికి దోస్తీకి కూడా హ్యాండ్ ఇచ్చి మరీ వెళ్ళిపోయావు అనమాట అని అంటుంది అప్పు. అనామిక కోసం ఈ అప్పుని దూరం చేస్తావా అని అంటుంది. మొత్తానికి కళ్యాణి సారీ చెప్పి అప్పు నీకు కూల్ చేస్తాడు ఇక ఈరోజు నుంచి నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకటి నువ్వు రెండు అనామిక. అంటే మేమిద్దరం ఒకటేనా తను నిన్ను చూసి కాకుండా నీ కవిత్వం చూసి ఫ్రెండ్షిప్ చేసింది తను నేను ఒకటి ఎలా అవుతాను అంటుంది అప్పు సరే తనేమో నాకు అభిమాన ఫ్రెండు నువ్వేమో నా బెస్ట్ ఫ్రెండ్ అని కళ్యాణి సద్ది చెప్తాడు అప్పుకి.

Brahmamudi: అత్త కోడల సవాళ్లు.. రాజ్ కి సీతారామయ్య క్లాస్.. ప్రేమలో విహరిస్తున్న కళ్యాణ్..

Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights
Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights

కనకం కృష్ణమూర్తిని ఆహ్వానించిన ఇందిరా దేవి..

ఇందిరా దేవి వరలక్ష్మీ వ్రతానికి కనకం కృష్ణమూర్తిని ఆహ్వానించడానికి ఫోన్ చేస్తుంది. ఏంటి ఈ పెద్దావిడ ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏదైనా గొడవ జరిగిందేమో అని భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కనకం. ఈ టైంలో ఫోన్ చేస్తున్నా అని మరోలా అనుకోవద్దండి రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము. అది కూడా మీ కావ్య చేతుల మీదగా జరగబోతుంది కనుక మీరు తప్పకుండా రావాలి అని అంటుంది. ఇందిరాదేవి. అయ్యో అలా ఏం లేదండి మొన్న పెద్ద గొడవ జరిగింది కదా ఇప్పుడు మళ్ళీ మేము వస్తే అక్కడ ఏదైనా గొడవ జరుగుతుంది ఏమో అని అంటుంది కనకం. పండగలు చేసుకునేది ఎందుకు బంధువులంతా ఆనందంగా గడపడానికే కదా వాళ్ళ మధ్యలో ఏదైనా సమస్య ఉన్నా తొలగిపోతాయి. మొన్న జరిగిన గొడవను మేము ఎప్పుడో మర్చిపోయాము. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం లో రెండు కుటుంబాలు కలిసి ఉంటే బాగుంటుందని నా కోరిక మీరు తప్పకుండా రావాలి అంటుంది ఇందిరాదేవి కనకంతో, కనకం శాంతాదేవితో మేము రాము అని చెప్పే లోపే ఇందిరదేవి మీరు గనక రాకపోతే మా మీద మీకు ఇంకా కోపం పోలేదు అనుకోవాల్సి వస్తుంది అని అంటుంది. సరే మీరు అంతలా చెప్తున్నారు కదండీ తప్పకుండా వస్తాము అంటుంది కనుక ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత వ్రతానికి వెళ్తున్నామంటే కావ్యకు ఒక పట్టు చీర ఒక కాసు బంగారం అయినా తీసుకెళ్లాలి కదండీ అని అంటుంది. కృష్ణమూర్తి తో,కనకం.

Nuvvu Nenu prema: అను మీద అత్తగారి పెత్తనం చూపించాలనుకున్న కుచల.. పద్మావతి గురించి పార్వతి బాధ..

Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights
Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights

అత్త కోడలు సవాళ్లు…

కావ్య దగ్గరికి అపర్ణ వస్తుంది గొడవ పెట్టుకోవడానికి, నీతో మాట్లాడకూడదని నాకు నేను సబతం చేసుకుంటూ ఉంటాను కానీ నా ఖర్మ కొద్ది నీతోనే మాట్లాడాలి చూస్తుంది అని అంటుంది అపర్ణ. పర్వాలేదా అత్తయ్య మీరేం మాట్లాడుకుంటున్నారో చెప్పండి అని అంటుంది కావ్య.ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇచ్చింది ఈ ఇంటి పెద్దలు నిన్ను ఒక మనిషిలా గుర్తిస్తున్నారు. నేను నా కొడుకు ఆ మర్యాదకి తలవంచి ఏమీ చేయలేక చూస్తూ ఉన్నాము కానీ నిన్ను నా ఇంట్లో ఇలా చూడాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుంది అపర్ణ. కావ్య మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోబోతు ఉంటుంది. నేను మాట్లాడేది ఇంకా పూర్తికాలేదు ఎక్కడికి వెళ్ళిపోతున్నావ్ అంటుంది అపర్ణ మీరు మాట్లాడ్డం పూర్తయితే నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా ఒకసారి ఎలా చెబితేనే నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు అందుకే మీ మాటలు మధ్యలోనే వెళ్లిపోవాల్సి వస్తుంది అని అంటుంది కావ్య.

Malli Nindu Jabili: శరత్ ని అవమానించిన వసుంధర…అది చూసి తట్టుకోలేక మీరా…గౌతమ్ మల్లి మధ్య చిగురించిన ఆనందం!

Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights
Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights

వ్రతం నువ్వు చెయ్యి ఫలితం నేనిస్తాను అన్న రాజ్..

కావ్య పరిణా మాట్లాడుకోవడం దూరం నుంచి రాజ్ వింటూ ఉంటాడు. అపర్ణతో కావ్య మీరు మీ అబ్బాయి నన్ను అర్థం చేసుకోవడం లేదు అన్నదే నా బాధఅని అంటుంది.నువ్వేమైనా అర్థం చేసుకోవాల్సిన కావ్యానివా ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఒకటి ఉంది. నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా నా కొడుకు నిన్ను భార్యగా మాత్రం అంగీకరించడు అని అంటుంది అపర్ణ మీరు ఇలా చెప్పిన ప్రతిసారి నాకు బాగా కలిసొస్తుంది అత్తయ్య నన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వను అన్నారు, మీ అబ్బాయి నన్ను గదిలోనికి వెళ్ళనివ్వను అని అన్నారు నాతో ఇంట్లో ఎవరు మాట్లాడకూడదు అన్నారు ఇలా మీరు చెప్పిన ప్రతిసారి నేనే గెలిచాను ఇప్పుడు కూడా నాకు కలిసొస్తుందని అనుకుంటున్నాను అంటుంది కావ్య.నాకు ఏదో చెప్పినందుకే నా కొడుకుని ఇంట్లో నుంచి బయటకు తోసేసాడు ఇప్పుడు నాతో సవాల్ విసురుతే ఊరుకుంటాడు అనుకుంటున్నావా అంటుంది అపర్ణ. నువ్వు ఎంత వ్రతం చేసిన ఆశీర్వాదం తీసుకోవాల్సింది నా కొడుకు దగ్గరే అక్షింతలు కచ్చితంగా వేయడు అని అంటుంది. వాడే కాదు నేను కూడా నిన్ను ఆశీర్వదించను నాశిర్వా ఆశీస్సులు ఇవ్వను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇదంతా రాజ్ వింటూ ఉంటాడు కావ్య మెట్ల పైన ఎదురవుతుంది. కావ్యని చూస్తూ కోపంగా నువ్వు వ్రతం చెయ్ ఫలితం నేనిస్తాను అని అంటాడు. అంటే ఏం చేస్తారు అంటుంది కావ్య వెయిట్ అండ్ సీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari: మధు చేసిన పని తెలిసి అవాక్కయిన మురారి.. ఊహించని నిర్ణయం..

Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights
Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights

ప్రకాశానికి ఉపవాసం అని చెప్పిన ధాన్యలక్ష్మి..

అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ధాన్య లక్ష్మీ ఉప్మా తీసుకొచ్చి పెడుతుంది ఉప్మా నాకొద్దు అంటే నాకొద్దని కళ్యాణ్, రాహుల్ ఇద్దరూ నువ్వు తినమంటే నువ్వు తినమని అనుకుంటూ ఉంటారు ఇంతలో ఉప్మా చల్లారిపోతుంది నేను తినేస్తాను అంటాడు ప్రకాశం. ధాన్యలక్ష్మి మీరెలా తింటారండీ ఉప్మా పూజ అయ్యేవరకు మీరు ఉపవాసం చేయాలి కదా అని అంటుంది. వ్రతం నువ్వు చేస్తుంటే ఉపవాసం నాకు పెడతావ్ ఏంటే అని అంటాడు ప్రకాశం. ఏది ఏమైనా మీరు ఉపవాసం చేయాల్సిందే అంటుంది దాన్ని లక్ష్మి.

అప్పుని కూడా కావ్య వాళ్ళ ఇంటికి రమ్మన్న కనకం..

కృష్ణమూర్తి బయటికి వెళ్లి ఇంకా రాకపోవడంతో కనుక మటుకు చూస్తూ ఉంటుంది ఇంతలో మీ నాన్న కావ్యకి పట్టుచీర బంగారం కొనడానికి వెళ్లారు. డబ్బులు తీసుకురావడానికి వెళ్లారు ఇంకా రాలేదు అని అంటుంది అప్పుతో,అయినా డబ్బులు లేనప్పుడు ఇవన్నీ అవసరమా అంటుంది అప్పు ఇంతలో కృష్ణమూర్తి ఎలాగోలా అప్పు చేసి డబ్బులు తీసుకొని వచ్చి కనకం వీటితో పూజకు వెళ్లడానికి కావాల్సినవన్నీ కొను అని అంటాదు. మీరిద్దరూ వెళ్లండి అంటాడు కృష్ణమూర్తి అమ్మ ఒక్కతే వెళ్తుంది నేను వెళ్ళను అంటుంది అప్పు అలా అంటావేంటి నువ్వు కూడా పద్ధతిగా చీర కట్టుకొని రా అంటుంది కనుక ఏంటి చీర కట్టుకోవాలి ఇది జరిగేది కాదులే అంటుంది అప్పు. నీకెలా వెళ్లాలనిపిస్తే అలా వెళ్ళు అంటాడు కృష్ణమూర్తి సరే అని ఇద్దరు రెడీ అవుతారు.

Krishnamma Kalipindi Iddarini: గౌరీ గురించి తప్పుగా మాట్లాడినందుకు అఖిలను మందలించిన సునంద…పూజను చెడగొట్టేవ్యూహంలో వ్యూహం లో ఉజ్జ్వల!

Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights
Brahmamudi Serial 02 september 2023 today 190episode highlights

వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు చేసిన కావ్య..

పూజకి కావాల్సినవన్నీ కావ్యా ఒకటే చేస్తూ ఉంటుంది అవన్నీ చూస్తూ స్వప్న రుద్రాణి ఇద్దరు తెగ బాధపడుతూ ఉంటారు ఈ కాపర్ణాదేవి అయితే ఇన్ని తెలుసా అన్నట్లుగా అనుకుంటుంది. కావ్య మొత్తానికి పని అంతా చెక్కబెట్టేస్తుంది. పూజ కావాల్సిన ఏర్పాట్లు అమ్మవారిని కూడా రెడీ చేస్తుంది. ఇందిరా దేవికావ్యకి చీర కట్టడం వచ్చేలేదు ఎవరైనా హెల్ప్ చేయండి అంటుంది. వెంటనే రుద్రాణి నువ్వు కాఫీ మాత్రమే బాధ్యతలు అప్ప చెప్పావు కదా తనకి అన్నీ వచ్చేమో అని మేము అనుకోని హెల్ప్ చేయట్లేదు అని అంటుంది. కావ్య రెబల్ హెల్ప్ తీసుకోకుండానే వరలక్ష్మీ బొమ్మ చేసి చక్కగా చీర కట్టి గాజులు వేసి ఎంతో అందంగా తయారు చేస్తుంది. అది చూసి ఇందిరాదేవి తగమెచ్చుకుంటూ ఉంటుంది ఈనెల నుంచి మేము ఈ పూజ చేస్తున్నాము ఏనాడు ఈ బొమ్మ ఇంత అందంగా తీర్చిదిద్దలేదు అని అంటుంది కావ్యతో, అది విని అపర్ణాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదే అతనిగా తీసుకొని రుద్రాణి వదిన కన్నా కావ్య బాగా చేసింది అంటున్నావా అమ్మ అని అంటుంది.వెంటనే ధాన్యలక్ష్మి వదిన కన్నా బాగా చేసింది అనట్లేదు. కావ్య చాలా బాగా చేసింది అని అంటుంది రెండిటికీ తేడా తెలుసుకోవాలి నువ్వు అంటుంది రుద్రాని తో, ప్రసాదాలు తీసుకురావడానికి కిచెన్ లోనికి వెళ్తుంది కావ్య, అప్పుడే అక్కడికి రాజ్ కూడా వెళ్తాడు.

రేపటి ఎపిసోడ్ లో,కావ్య చేత పూజ చేయిస్తూ ఉంటారు. పూజ మొత్తం పూర్తవగానే పంతులుగారు మీ భర్త దగ్గర అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోండమ్మా అని అంటాడు. అలా చేస్తే మీ జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది అని చెప్తారు పంతులుగారు. కావ్య రాజ్ కాళ్లకు దండం పెట్టబోతు ఉండగా రాజ్ కావాలని వెనక్కి జరిగి చేతిలో నాక్షింతల్ని నేలపైన వేస్తాడు. అది చూసి అపర్ణాదేవి తెగ సంతోష పడుతూ ఉంటుంది ఇందిరా దేవి సీతారామయ్య రాజ్ చేసిన పనికి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అమ్మ కోసం రాజ్ చేసిన పనికి కావ్య చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. చూడాలి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella