NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishnamma Kalipindi Iddarini: గౌరీ గురించి తప్పుగా మాట్లాడినందుకు అఖిలను మందలించిన సునంద…పూజను చెడగొట్టేవ్యూహంలో వ్యూహం లో ఉజ్జ్వల!

Krishnamma Kalipindi Iddarini August 30 2023 Episode 98 highlights

Krishnamma Kalipindi Iddarini:  ఈ ఇంట్లో అమ్మగారు అని నన్ను కూడా పిలవాలి కదా మరి గౌరీ ఒక్కదాన్నే పిలిచాడు ఏంటి, ఈ కొంపలో గౌరీ కి రోజు రోజుకి నన్ను కోడలుగా పట్టించుకునే వాడు లేకుండా పోతున్నాడు దేవుడా అని అఖిల అనుకుంటుంది. గౌరమ్మ గారు అని పనివాడు పిలుస్తాడు. ఎవడ్రా నువ్వు అని అఖిల బయటికి వస్తుంది. ఈ పూలు అరటికాయలు ఎందుకబ్బా ఏం అర్థమై చావట్లేదే అని అఖిల అనుకుంటుంది. ఇంతలో ఆదిత్య వచ్చి వదిన ఈ పూలు స్వీట్స్ ఎందుకు అని అడుగుతాడు. ఈ గౌరీ ఏదో ఫంక్షన్ ఉంటే హడావిడి చేస్తుంది ఈ ఇంటికి నేను కూడా కోడల్ని కదా ప్రతి చిన్న విషయాన్ని నాకు చెప్పాలి నాకు తెలియాలి మరి నాకు తెలియకుండా ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఏంటబ్బా అని అనుకుంటుంది అఖిల. సౌదామిని జ్వాలా అక్కడికి వచ్చి ఏంటి ఈ హడావిడి వెళ్లి చూద్దాం పద అంటారు.

Krishnamma Kalipindi Iddarini August 30 2023 Episode 98 highlights
Krishnamma Kalipindi Iddarini August 30 2023 Episode 98 highlights

గౌరీ ఎవరిని కచ్చితంగా వచ్చి తీరాలి అంటుంది అని ఈశ్వర్ అనుకుంటాడు. గౌరీ పూలు పళ్ళు తెప్పించావు అందర్నీ పిలుస్తున్నావ్ ఏంటి విశేషం అని ఉజ్వల అడుగుతుంది. చెప్తే సంతోషంగా మేము కూడా పాల్గొంటాం కదా.అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నవ్వుతున్నావ్ ఏంటి అని సౌదామిని అంటుంది. రేపు వరలక్ష్మి వ్రతం ఆడవాళ్లకు సంబంధించిన అతి ముఖ్యమైన పండుగని మర్చిపోతే ఎలా చెప్పండి అని సునంద అంటుంది. ఆస్తి పోయి దరిద్రంలో బతుకుతున్నాం పండుగల గురించి ఆలోచించే పరిస్థితుల్లో మేము ఎక్కడున్నాం వదిన అంటుంది సౌదామిని. సౌదామిని ఈ విషయం మీ మనసులో నుంచి తీసేయమని చెప్పాను కదా, నీకోసం మీ కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది, ఊరికే ఇలా బాధపడకు అని సునంద అంటుంది. ఇంతలో అఖిల వచ్చి, అక్క యువర్ లక్ష్మి వ్రతం గురించి నాకు ముందే చెప్పుంటే నేను కూడా ఏర్పాటు చేసేదాన్ని కదా.వ్రతం మనమందరం కలిసి చేస్తున్నాం కదా అని గౌరీ అంటుంది. గోతి వెలుగుతున్నప్పుడు అందరూ ఆకాశంలో ఆ వెలుగుని చూస్తారు కానీ ఆ పేరు మాత్రం ఆ తారాజువ్వను వెలిగించిన వాళ్లకు మాత్రమే వస్తుంది, వ్రతం అందరూ కలిసి చేస్తున్న పేరు మాత్రం నీకే వస్తుంది అని అఖిల అంటుంది.

Krishnamma Kalipindi Iddarini August 30 2023 Episode 98 highlights
Krishnamma Kalipindi Iddarini August 30 2023 Episode 98 highlights

అఖిల ఏంటా మాటలు అర్థం లేకుండా, ఇది మన ఇంటికి సంబంధించిన పూజ, ఇందులో ఒకరికి ఎక్కువ పేరు రావడం ఇంకొకరికి తక్కువ పేరు రావడం ఏంటి బుద్ధి లేకుండా,ఏంటి కోడలుగా మీ ఇద్దరు సమానమే ఇంకెప్పుడు ఇలా ఎక్కువ తక్కువ గురించి ఆలోచించకు, ఆదిత్య ఈశ్వర్ రేపు వరలక్ష్మి వ్రతం పూర్తి అయ్యేవరకు మీ ఇద్దరి ఇంట్లోనే ఉండాలి అని సునంద చెప్తుంది. అమ్మ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ వద్దు ఆపేయ్, అమ్మ మొన్నటి వరకు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు, ఇంకా రేపు మాపో 16 రోజుల పండుగ అంటున్నావు, అందుకే ఈ వరలక్ష్మీ వ్రతం ఏమొద్దు అని ఈశ్వర్ అంటాడు.మీ క్షేమం కోసం మీ భార్యలు చేసే వ్రతం కాదనకూడదు నాన్న అని సునంద అంటుంది.నా మనసులో అటు ఆదిత్య మనసులోనూ అగ్నిపర్వతం లాంటి బాదం మోస్తున్న అమ్మా ఇంక మాకు సంతోషం ఏంటి అని ఈశ్వర్ తన మనసులో అనుకుంటాడు. అమ్మ మేము క్షేమంగానే ఉన్నాను కదా ఈ పూజలన్నీ ఎందుకు అని ఈశ్వర్ అంటాడు. ఈశ్వర్ నీ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది రా,మన ఇంట్లో మొదటిసారి కోడళ్ళు అడుగు పెట్టిన మొదటి వరలక్ష్మి వ్రతం ఇది, మాములుగా ఒక కోడలు అడుగు పెట్టడం అదృష్టం అలాంటిది లక్ష్మి దేవతలుగా ఇద్దరు అడుగు పెట్టారు జరుపకుండా ఎలా ఉంటాం చెప్పు,గౌరీ నేను వాయనం తీసుకోవడానికి ముత్తయిదువులను పిలుస్తాను అని సునంద చెప్తుంది.

Krishnamma Kalipindi Iddarini August 30 2023 Episode 98 highlights
Krishnamma Kalipindi Iddarini August 30 2023 Episode 98 highlights

మీ మనసు మార్చుకోవడానికి మీ మనసు గెలుచుకోవడానికి ఈ వ్రతం చేస్తున్నానండి, ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదంతో నా సంకల్పం త్వరలోనే నిజమవుతుంది అని గౌరీ అనుకుంటుంది. అసలు నువ్వు ఈ వ్రతం ఎలా పూర్తి చేస్తావో నేను చూస్తాను అని ఉజ్వల అనుకుంటుంది. కట్ చేస్తే ఆదిత్య బాబోయ్ నిన్న పాలు తాగమని టార్చర్ చేసింది ఈ రోజు ఏం చేస్తుందో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అఖిల వచ్చి, ఏవండీ గూగుల్ లో నేను కొన్ని హాస్పిటల్స్ తీశాను వీటిలో ఏది బాగుందో చెప్పండి, హాస్పిటల్ నాకోసం కాదండి మీకోసం. నాకోసం హాస్పిటల్ దీనికి ఆయన నాకేమైంది వెళ్లడానికి అని ఆదిత్య అడుగుతాడు. ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి సిగ్గుగా మొహమాటంగా ఉంటుంది నేను అర్థం చేసుకోగలను అని అఖిల అంటుంది. అసలేం మాట్లాడుతున్నావ్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు ఆదిత్య. ఎందుకైనా మంచిది ఒకసారి మీరు హాస్పిటల్ కి వెళ్లి రండి. నీకేమైనా పిచ్చా నాకేం ప్రాబ్లం ఉంది అని ఆదిత్య అంటాడు. మీ కళ్ళ ముందు ఇంత అందమైన అమ్మాయి ఉన్న మీరు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు అని అఖిల అంటుంది.

Krishnamma Kalipindi Iddarini August 30 2023 Episode 98 highlights
Krishnamma Kalipindi Iddarini August 30 2023 Episode 98 highlights

నాకు అలాంటి సమస్య లేదు, మంచిగానే ఉన్నాను అని అంటాడు ఆదిత్య.నేను నమ్మాలి అంటే మీరు నాతో కాపురం చేయాలి అంతే అంటుంది అఖిల. దయ చేసి నన్ను విసిగించకు అని ఆదిత్య అంటమీరు ఇలా విసుక్కుంటూ మాట దాటి వేస్తున్నారంటే మీలో ఏదో ప్రాబ్లం ఉంది అందుకే రేపు హాస్పిటల్ కి వెళ్లేసి రండి అని అఖిల చెప్తుంది. ఇంకోసారి హాస్పిటల్ అంటే చంపేస్తాను నోరు మూసుకొని ఉండు అని వెళ్ళిపోతాడు ఆదిత్య. ని ఇగో రెచ్చకోట్టాను, ఎ మగాడైనా నువ్వు మగాడివి కాదు అంటే రెచ్చిపోతాడు అని నేను ఇలా చేస్తున్నాను, రోజు ఇలాగే చేస్తాను, మీరు నాతో కాపురం చేసేవరకు అని అఖిల అనుకుంటుంది. కట్ చేస్తే, ఉదయం గౌరీ వాళ్ళ అమ్మ నాన్న లు వస్తారు, సునంద గారు పిల్లల్ని పిలవండి, వాళ్ళకి బట్టలు పెడతాము అని అంటారు భవాని వాళ్ళు. ఈశ్వర్ గౌరీ ఆదిత్య అఖిల అందరు రండి అని సునంద పిలుస్తుంది. ఇప్పుడు ఇవి అన్ని అవసరం లేదు అమ్మ అని ఈశ్వర్ అంటాడు. ఈశ్వర్ ఈ వ్రతం జరగడం ఇష్టం లేనట్టు ఉంది, నిన్న కూడా వ్రతం కోసం ఏర్పాట్లు చేస్తుంటే అవసరమా అని అడిగాడు అని సౌదామిని అంటుంది. నీకు ఇష్టం లేదా అని సునంద అడుగుతుంది. గౌరీ చేయడం ఇష్టం అని మనసులో అనుకుంటాడు ఈశ్వర్. చెప్పు నాన్న అని అడుగుతుంది సునంద.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella