Ennenno Janmala Bandham ఆగస్టు 11 ఎపిసోడ్ 475: చిన్న పిల్లలు తెలిసో తెలియకో అబద్ధాలు చెప్తూ ఉంటారు, పెద్దవారు సరిదిద్దుతుంటారు, కానీ పెద్దవారు అబద్ధాలు చెప్తే ఎలా అని వేదస్విని తన తండ్రితో అంటుంది. నేనా? నేను అబద్ధం చెప్తున్నానా? అని వేద తండ్రి అంటాడు. నాన్న మీరు ఇక్కడ నిల్చున్న తీరు నా కోసమే ఎదురు చూస్తున్నట్లు ఉంది, నేను వొచ్చాక దెగ్గరికి వొచ్చి ఆగిపోయి మర్చిపోయాను అని అంటున్నారు, ఏదో చెప్పాలి అని వెయిట్ చేసేవాళ్లు మర్చిపోయే అవకాశం ఉండదు నాన్న అని వేద అడుగుతుంది. నువ్వు అన్నది నిజమే అమ్మ, మర్చిపోయాను అనే మాట అబద్ధం కానీ నిజం చెప్తే ఎలాంటి పరిణామాలు ఎదురుకోవాలో అని ఆలోచిస్తున్న అంటాడు, చెప్పకుండా ఉండలేరు నాన్న ఎందుకంటే అంత భారమైన దానిని ఎవరు మనసులో దాచుకోలేరు. అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, చెప్పండి నాన్న అని వేద అడుగుతుంది.

చెప్తాను తల్లి కానీ నేను గుండెను రాయి చేసుకోవాలో లేదా నీ గుండె నిండా ధైర్యం నింపాలో అర్ధం కావట్లేదు అమ్మా అని వేదస్విని తండ్రి సతమత పడతాడు. నేను పిరికి దానిని కాదు, నాకు జన్మనిచ్చిన తండ్రి పిరికివాడు కాదు చెప్పండి నాన్న అని అంటుంది వేద. ఆ మాళవిక హత్య జరిగిన రోజు అల్లుడు గారు చాలా ఆవేశంగా బయటకి వెళ్లడం నేను కళ్లారా చూసాను అని నిజం చెప్పేస్తాడు.

మీరు చూసారా అని వేదం అడుగుతుంది, అవును దాహం అవుతుంది అని నిద్ర లేచాను తరువాత నిద్ర పట్టడం లేదు అని బయట తిరుగుతూ ఉన్నాను, అప్పుడు టైం నాలుగు కూడా అయి ఉండదు. అప్పుడు నేను అల్లుడు గారిని ఆపి ఉంటె బాగుండేదేమో, అయితే ఇదే నిజం అల్లుడు ఏదో చేసాడు అని మాత్రం నేను అనట్లేదు అని వేద తండ్రి అంటాడు.

నా ఊహ తప్పు అయివుండొచ్చు అని అంటుండగానే…నాన్న ప్లీజ్ మీరు చెప్పాలి అనుకుంటున్నది సూటిగా చెప్పండి అని వేద అంటుంది. ఆవేశం ఎంతటికైనా దారి తీస్తుంది, వివేకాన్ని మర్చిపోయేలా చేస్తుంది, నేను కొన్ని వివరాలు కనుక్కున్నాను…మాళవిక హత్య ఉదయం నాలుగు తరువాత జరిగింది, అల్లుడు గారు అదే సమయానికి ఆవేశంగా బయటకి వెళ్లారు, అంతక ముందే ఆ మాళవిక చేసిన పని భరించలేక ఆ అమ్మాయిని ఇంట్లో నుండి గెంటేసాము, ఫంక్షన్ లోనే అల్లుడు గారు మాళవిక మీద గున్ను పెట్టారు. కన్న తల్లిని చంపాలనుకుంటే ఏ కొడుకు చూస్తూ ఊరుకోలేడు, ఇలా జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని అల్లుడు గారే ఈ హత్య చేసుండొచ్చు అని వేద తండ్రి అనడం తో వేద గుండెల్లో బాంబు పేల్చిన్నటు అవుతుంది.

తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని గదిలో కంగారుగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వేదస్విని. లైఫ్ లో ఇలాంటి పరిస్థితి వస్తుంది అని కలలో కూడా ఊహించలేదు, ఆయనను ఇలా చూడాల్సి వస్తుంది అని అస్సలు అనుకోలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏంటి ఇదంతా అని వేద మనసులో అనుకుంటుంది.

నాన్న అబద్ధం చెప్పరు కదా, అయినా నాతోనే బెడ్ మీద ఉన్నారు అనుకున్నాను కానీ నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్లారు, పోనీ తరువాత అయినా ఎక్కడికి ఎందుకు వెళ్లారో నాతో ఎందుకు చెప్పలేదు అని అనుకుంటుంది. ఇంతలో మమ్మీ అనుకుంటూ ఖుషి అక్కడికి వస్తుంది, ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదు అని వేద అడుగుతుంది. నాకు నాన్న గుర్తొస్తున్నారు అని ఖుషి అంటుంది. ఇప్పుడు రాత్రి అయింది కదా రేపు వోచేస్తారు, ఇంతక ముందు కూడా డాడీ బిజినెస్ టూర్ అని వెళ్ళాడు కదా అలా అని ఖుషి కి వేద చెప్తుంది. అలా ఎమ్ కాదు, బిజినెస్ వేరు ప్రిజన్ వేరు అని ఖుషి అంటుంది అలా వీరి మధ్య కొంచెం సేపు సన్నివేశం ఉంటుంది.

తరువాత సీన్ లో…ఆ మరుసటి రోజు ఉదయం తన బృందం తో కలిసి ఏసీపీ దుర్గ యష్ వాళ్ళ ఇంటికి వస్తుంది. దుర్గను చూసిన వేద, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. మీ ఇల్లంతా మేము వెతకాలి, ఇంకా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని దుర్గ సెర్చ్ వారెంట్ చూపిస్తుంది. కొంచెం సేపు వెతికిన తరువాత ఎమ్ దొరకలేదు మేడం అని పోలీసులు చెప్తారు. దుర్గ మాత్రం ఈ బెడఁరూం చెక్ చేయాలి అని వేదం యష్ పర్సనల్ రూమ్ లోకి వెళ్తుంది, కొంచెం సేపు వెతికిన తరువాత అక్కడ రక్తం మరకలతో ఉన్న యష్ షర్ట్ దొరకడం తో కథ కొత్త మలుపు తిరుగుతుంది.

పోలీసులు వెళ్ళిపోయిన తరువాత ఇంట్లో అందరూ కంగారులో ఉంటారు, మాళవిక మర్డర్ కి యష్ కి సంబంధం ఉందా అంటూ మాలిని వాళ్ళు ఏడుస్తారు. నువ్వు ఇలా కోపంగా ఉంటె మాకు భయమేస్తుంది నీకు ఏమైనా తెలుసా మాకు చెప్పమ్మా అని వేద వాళ్ళ అమ్మ అంటుంది. వెదకు తన తండ్రి యష్ బయటకి వెళ్లడం గురించి చెప్పింది గుర్తొస్తుంది…అసలు ఎమ్ జరిగిందో తెలుసోవడానికి పోలీసు స్టేషన్ కి వెళ్తుంది వేద, అక్కడ యష్ ను కలిసి అసలు ఎమ్ జరిగింది అని నిలదీస్తుంది. ఆ తరువాత ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.