Tollywood Hero: సినీ తారలు ఇండస్ట్రీలో ఉన్నంతవరకు ఎంతో గ్లామర్ గా, ఫిట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటారు. కానీ ఒక్కసారి ఇండస్ట్రీకి దూరం అయ్యారంటే గుర్తుపట్టలేని విధంగా మారిపోతారు. ఇది అక్షర సత్యం అని ఎంతో మంది తారలు ప్రూవ్ చేశారు. తాజాగా ఈ జాబితాలో మరో తెలుగు నటుడు వచ్చి చేరాడు. పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోగా సత్తా చాటాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో కుర్రకారును ఉర్రూతలూగించాడు. కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంత షాకింగ్ లుక్ లోకి మారిపోయాడు.
ఇంతకీ అతను మరెవరో కాదు ఒకప్పటి హీరో రోహిత్. 1998లో తమ్మారెడ్డి భరద్వాజ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రోహిత్.. 2001లో 6 టీన్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జి నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే అనే సాంగ్ ద్వారా రోహిత్ సూపర్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ముత్యం, చంద్రవంశం, గర్ల్ ఫ్రెండ్, సొంతం, అనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, నేను సీతా మహాలక్ష్మి తదితర చిత్రాల్లో నటించాడు.
హీరోగా సరైన సక్సెస్ దగ్గకపోవడంతో పలు చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించాడు. 2010లో మా అన్నయ్య బంగారం చిత్రంలో రోహిత్ చివరగా కనిపించాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వెండితెరకు దూరంగా ఉన్నాడు. మళ్ళీ 14 ఏళ్ల తర్వాత రామ్(రాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమాతో రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చాడు.
కానీ ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ప్రేక్షకులకు తెలియలేదు. దాంతో రోహిత్ రీఎంట్రీకి సరైన ఫలితం లభించలేదు. ప్రస్తుతం ఈయన బలమైన సహాయక పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇకపోతే అప్పట్లో లవర్ బాయ్ గా ఆకట్టుకున్న రోహిత్.. ఇప్పుడు పూర్తిగా మారిపోయా. రోహిత్ తాజా లుక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈయనేంటి ఇలా తయారయ్యారని చర్చించుకుంటున్నారు.