NewOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 12Today Episode: వసును రిషిని విడదీయడానికి దేవయాని పక్కా ప్లాన్ సిద్ధం..!

Share

Guppedantha Manasu November 12Today Episode:  బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 12వ తేదీ Guppedantha Manasu సీరియల్ 606 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం..

వసు వేదంతం.. గౌతంకు అర్ధం అవుతుందా.?

Vasu, gowtham

Advertisements

ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగింది అంటే వంటగదిలో హడావుడిగా ఉన్న వసుధార దగ్గరకు వచ్చిన గౌతమ్..నీకు ఇదంతా అవసరమా అని అంటాడు.మన అనుకుంటే ఇవేమీ తప్పుకాదు కదా అంటుంది వసు. సర్లేగాని రిషితో నీ జీవిత ప్రయాణం ఎంతవరకూ వచ్చింది..మీ ఇద్దరి మధ్యా ఆ అడ్డుతెర తొలగిపోయినట్టేనా అని అడుగుతాడు.జగతి మేడం నా జీవితానికి దిక్సూచి లాంటివారు..ఆవిడ దూరమైనా అమ్మా అనే పిలుపు అందించాలని ఆ ప్రయత్నం చేశాను. అయితే ఆయన నాకోసం పిలవడం కాదు తనంతట తాను పిలవాలి అని అంటుంది వసు. నువ్వు మారావా..ఆ ఒప్పందం నుంచి డ్రాప్ అయినట్టేనా..రిషికి ఎలాంటి టెన్షన్ లేనట్టేనా అని అంటాడు. లేదు సార్ మారాను..మారుతున్నాను ఇలాంటివి చెప్పను..పరిస్థితులు ఎదుటివారిని బట్టి అభిప్రాయం మారొచ్చు అంటుంది.

వసు నువ్వు గ్రేట్ అన్న గౌతమ్ :

Devayani

వసు మాటలు రిషికి అర్థంకావు.నేను దారి మార్చుకున్నాను గమ్యం మార్చుకోలేదు.ఇచ్చిన మాట వదులుకోలేదు.. అలాగని రిషి సార్ ని వదులుకోలేదు. నా పద్ధతి మార్చుకున్నాను పంతం తగ్గించుకున్నాను.. కొన్ని మార్పులు జరగాలని ఆశించాలి కానీ కాస్త ఓపిక పట్టాలి.చాలా బంధాలు విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఉండవు సార్..అన్నీ చిన్న చిన్నవే..ఈ ఒక్కటి తెలుసుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటుంది.గ్రేట్ వసుధారా బాగా చెప్పావ్.ఇంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు. వసు ధార నువ్వు యూనివర్శిటీ టాపర్ అయిన సందర్భంగా కాలేజీలో నీకోసం సెలబ్రేషన్ పార్టీ ప్లాన్ చేస్తున్నారు..సార్ జగతి మేడం మహేంద్ర సార్ లేనప్పుడు ఏ సెలబ్రేషన్స్ ని నేను ఆస్వాదించలేను అంటుంది వసు. సాధించావ్ కదా నువ్వు అనుకున్నది సెలెబ్రేట్ చేసుకోవాలి అని  కాలేజీలో నిన్ను ఇంటర్యూ చేయడానికి మీడియా వస్తోంది వాళ్లని వద్దనలేవు కదా.

దేవయాని పక్కా ప్లాన్ :

Devayani

అయితే వీళ్ళ మాటలను పక్కనుంచి విన్న దేవయాని ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో ఉంటుంది. ఇంతకీ వసుధార ఇంట్లో అందర్నీ ఒక్కటి చేసి నన్ను ఒంటరి చేస్తుందా.. రిషి నా పట్టులోంచి జారిపోయినట్టేనా..జగతి మహేంద్ర ఇంట్లోంచి వెళ్లిపోవడం నాకు కలసి వస్తుంది అనుకున్నాను కానీ నాకు కాకుండా ఆ వసుధారకి కలిసొచ్చినట్టుంది..ఈ పరిస్థితిని ఎలా అధీనంలోకి తెచ్చుకోవాలి అని అలోచించి నిన్ను ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు..జగతి లాంటి తెలివైనదాన్నే 20 ఏళ్లు ఇంట్లోంచి బయటకు పంపించగలిగా నువ్వు నాకొక లెక్కా నీ ఎత్తుకి పైఎత్తు తప్పకుండా వేస్తాను అంటుంది.

రిషిని కాక పట్టేపనిలో దేవయాని:

Vasu, rishi

పొద్దున్నే ధరణి వంటగదిలో బిజీగా ఉంటుంది.. అక్కడకు వెళ్లిన దేవయాని ధరణి నుంచి ఏవేవో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. రిషి ఇంకా నిద్రలేవలేదు.వసుధార కూడా లేవలేదు..ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి అని కాఫీ తీసుకెళుతుంటుంది దేవయాని.అప్పటికే రిషి రూమ్ సర్దుతూ ఉంటుంది వసుధార… పక్కనున్న ర్యాక్ లో గతంలో తానిచ్చిన గోళీల సీసా, నెమలి కన్ను చూసి అప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంది. బ్యాగులోంచి వీఆర్ అని ఉన్న ఉంగరాన్ని తీసి చూస్తుంటుంది. వెనుక నుంచి వచ్చిన రిషి ఇక్కడేం చేస్తున్నావ్ అని అడిగితే..సర్దుతున్నాను అంటుంది. అంతా బాగానే ఉంది కదా అని గిఫ్ట్ ఇచ్చిన వారిని వదిలేసి గిఫ్ట్ ను చూస్తున్నావేంటో అని రిషి అంటే ఇది నాకు గొప్ప బహుమతి అని వసు అంటే..నువ్వే నాకు గొప్ప బహుమతివి అంటూ రిషి వసు చేయి పట్టుకుంటాడు.అప్పుడే కాఫీ తీసుకొచ్చిన దేవయాని… పొద్దున్నే వచ్చేసిందా అనుకుంటూ ఏంటి వసుధార అనుకుంటూ  రూమ్ లోపలకు వస్తుంది. ఇంతలో వసు చేతిలో ఉన్న ఉంగరం బాక్స్ చూస్తుంది దేవయాని.

దేవయానికి వసు ఇచ్చిన షాక్ :

Vasu

పొద్దున్నే నా చేత్తో నీకు కాఫీ ఇస్తేనాకు ఎంతో తృప్తిగా ఉంటుంది.. నేను వసుధారకి ఇంకో కాఫీ తెప్పిస్తానులే నువ్వు తాగేసెయ్ అంటుంది. అయ్యో మేడం నాకోసం మళ్లీ మళ్లీ ఇంకో కాఫీ తెప్పించడం ఎందుకు షేర్ చేసుకుంటాం లెండి అంటుంది.కాఫీ చాలా బావుంది మేడం..మీరే కలిపారు కదా అంటుంది వసు దేవయాని కోపంగా చూస్తుంది. ఇంతలో పెదనాన్న కాల్ చేస్తున్నారని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి.. ఇక్కడికి వచ్చిన పని సక్సెస్ అయింది..నేను వస్తున్నా అనికాల్  కట్ చేస్తాడు ఫణీంద్ర.పెద్దమ్మా పెదనాన్న వచ్చాక డాడ్ గురించి అడిగితే ఏం చెబుదాం..డాడ్ వాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయారని తెలిస్తే పెదనాన్న బాధపడతాడు అంటాడు.నేను కూడా అదే ఆలోచిస్తున్నాను..ఆయన వచ్చి వీళ్ల గురించి అడిగితే నాక్కూడా ఇబ్బందే అంటుంది దేవయాని.సరే మేం బయలుదేరుతున్నాం అని ఇద్దరు కాలేజ్ కి వెళ్తారు


Share

Related posts

Intinti Gruhalakshmi: ప్రేమ్ ను ఒప్పించిన తులసి.. గాయత్రి, అభికి బుద్ది చెప్పిన అంకిత..!

bharani jella

Ante Sundaraniki: `అంటే.. సుందరానికీ` ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడేనా..?

kavya N

తెలుగులో సూపర్ స్ట్రాంగ్ గా `కాంతార‌`.. 4వ రోజు ఎంత రాబ‌ట్టింది?

kavya N