Hanuman Tv contest: ప్రతి వారం సరికొత్త కథనాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈవారం మరో సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాతో ముందుకు రానుంది. థియేటర్ అండ్ ఓటిటిలోను ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషన్ మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి సమర్పణలో రూపొందింది. ఇక ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అందిస్తుంది జీ తెలుగు. ప్రతిభావంతులను ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందిన హనుమాన్ చిత్రాన్ని ఆస్వాదించడానికి మీరు సిద్ధంగా ఉండండి. బుల్లితెర హనుమాన్ ఆగమానం ఈ ఆదివారం అనగా ఏప్రిల్ 28 సాయంత్రం 5:30 గంటలకు జి తెలుగులో మాత్రమే అంటూ అధికారికంగా ప్రకటించింది.
అంతేకాదు ఈ వారాంతాన్ని మరింత స్పెషల్ చేసేందుకు సూపర్ హిట్ సినిమా హనుమాన్ తో పాటు మరిన్ని సర్ప్రైజ్లను అందిస్తుంది జీ తెలుగు. ఈ క్రమంలోనే హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్ను తీసుకొచ్చింది జీ తెలుగు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఈ సెల్ఫీ కాంటెస్ట్ లో పాల్గొని కళ్ళు చెదిరే గిఫ్ట్ లను మీ సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రేక్షకుల పిల్లలకి ఇష్టమైన సూపర్ హీరో గెటప్ వేసి వారితో ఒక సెల్ఫీ తీసుకుని 9966034441 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. లేదంటే టీవీ స్క్రీన్ పైన కనిపించే యు ఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా సెల్ఫీని అప్లోడ్ చేయవచ్చు. విజేత వివరాలను హనుమాన్ మూవీ ప్రసార సమయంలో ప్రకటిస్తారు. అంతే కాదు హనుమాన్ జిగ్సా ఫజిల్ గెటప్ ని ZeeTeluguhanuman.zee5.com కి లాగిన్ అయి ఇచ్చిన టైం లోగా లెబల్స్ ను పూర్తి చేయాలి.
అలా స్కోర్ బోర్డులో లీడర్ గా నిలబండని జీ తెలుగు చెప్పింది. ఇక హనుమాన్ సినిమా అందమైన అంజనద్రి గ్రామం నేపథ్యంలో సాగుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ ప్రధాన పాత్రలో పోషించిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. హనుమంతు మంచి మనసు కలిగిన ఒక దొంగ. తన ప్రియురాలు మీనాక్షిని వివాహం చేసుకొని సంతోషంగా జీవించాలని కలలు కంటూ ఉంటాడు. కానీ హనుమంతుడికి దొరికిన రుధిరమణి కారణంగా అద్భుత శక్తులు వస్తాయి. దాంతో ఆ గ్రామంలో హీరో అవుతాడు. ప్రముఖ నటుడు వినయ్ రాయ్ ఈ సినిమాలో విలన్ గా నటించారు.
రుధిరమణి కోసం జరిగిన పోరులో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ కథాంశం. ఇక ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, రాంప్రసాద్, విజయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక హనుమాన్ ఇప్పటివరకు థియేటర్ లనే షేక్ చేసింది అని అందరూ భావిస్తున్నారు కానీ ఇకనుంచి జి తెలుగు ఛానల్ ని కూడా షేర్ చేస్తుందనే చెప్పొచ్చు. నిజానికి హనుమాన్ సినిమా రిలీజ్ అయితేనే అది పెద్ద సంచలనం అయినట్లు ఉంటుంది. అలాంటిది బిగ్ సర్ప్రైజ్లు ఇస్తూ ఓ కాంటాక్ట్స్ పెడితే ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ కాంటాక్ట్స్ లో ఎవరు గెలిచి ఎటువంటి బహుమతులు అందుకుంటారో చూడాలి.