మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్న నాని.. ఇక‌నైనా మారాలి?!

Share

న్యాచుర‌ల్ స్టార్ నాని సినిమాల ఎంపిక గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. త‌న ప్ర‌తి సినిమాను విభిన్నంగా ఉండేలా చూసుకుంటారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న స‌రైన స‌క్సెస్ లేక స‌త‌మ‌తం అవుతున్నాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్షియ‌ల్‌గా ఆయ‌న చిత్రాలు హిట్ అవ్వ‌లేక‌పోతున్నాయి.

జెర్సీ, గ్యాంగ్ లీడర్, శ్యామ్ సింగరాయ్ క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకున్నాయి. కానీ, వీటిలో `శ్యామ్ సింగరాయ్` మాత్రమే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అయింది. మొన్నా మ‌ధ్య విడుద‌లైన `అంటే..సుంద‌రానికీ` సైతం పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. కానీ, అనుకున్న స్థాయిలో క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టేల‌క‌పోయింది.

అందుకు కార‌ణం రాంగ్ టైమ్‌లో రిలీజ్ అవ్వ‌డ‌మే అన్న టాక్ ఉంది. అప్ప‌టికే మ‌హేష్ బాబు న‌టించిన `స‌ర్కారు వారి పాట‌` బాక్సాఫీస్ వ‌ద్ద ర‌న్ అవుతోంది. మ‌రోవైపు `విక్ర‌మ్‌`, `మేజ‌ర్‌` వంటి పెద్ద చిత్రాలు బ‌రిలోకి దిగుతున్నాయి. అయినా స‌రే `అంటే..సుంద‌రానికీ`ని థియేట‌ర్స్‌లోకి దింపేశారు. దాంతో టాక్ బాగున్నా.. పెద్ద చిత్రాల మ‌ధ్య న‌లిగిపోయింది. అయితే ఈ విష‌యం తెలిసి కూడా నాని మ‌ళ్లీ అదే త‌ప్పు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఆయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్నా చిత్రం `ద‌స‌రా`. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ను ద‌స‌రాకు విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. అయితే అదే స‌మ‌యంలో బాల‌య్య `ఎన్‌బీకే 107`, చిరంజీవి `గాడ్ ఫాద‌ర్‌` చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న‌ట్లు టాక్ ఉంది. వాటికి పోటీగా `ద‌సరా`ను దింపడం కారెక్ట్ కాద‌ని, నాని ఇక‌పై అయినా రిలీజ్ డేట్ల విష‌యంలో మారాల‌ని ప‌లువురు సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

35 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago