Gruhalakshmi: గృహలక్ష్మి సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ మా సీరియల్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యేది గృహలక్ష్మి సీరియల్.ఈ సీరియల్ లో తులసి క్యారెక్టర్ లో, అందరికీ పరిచయమైనా కస్తూరి శంకర్ నటిస్తోంది. కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఫుల్ బిజీగా ఉంటూ, సీరియల్స్ లో, ప్రత్యేకమైన షోల ద్వారాబిజీగా గడుపుతోంది.కస్తూరి శంకర్ నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తో, ట్రెండ్ అవుతూ, ట్రోలర్ చేతిలో బలవుతూ ఉంటుంది. తాజాగా బిగ్ బాస్ షో మీ ద చేసిన ఒక కామెంట్ వైరల్ అయి ఇప్పుడు కస్తూరికి పెద్ద తలనొప్పిగా మారింది.. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్ ఏంటో తెలుసుకుందాం..
బుల్లితెరపై గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్రలో కస్తూరి ఇప్పుడు అందరినీ మెప్పిస్తుంది.వెండి ధర మీద ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కస్తూరి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి బుల్లితెర ఓటిటి సినిమాలు అంటూ బిజీబిజీగా గడుపుతుంది. అన్నమయ్య సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది అవార్డు కూడా పొందింది. ఈమె సోషల్ మీడియాలో చేసే కామెంట్ల, ఏదో ఒక విధంగా వైరల్ అవుతూనే ఉంటాయి. తమిళంలో బిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే,వనిత విజయ్ కుమార్ కూతురు తమిళంలో ఏడో సీజన్లో ఎంట్రీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.

ఇక తన కూతురు ఎంట్రీ ఇవ్వడంతో ప్రతి ఒక్క విషయం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ, అభిమానులతో పంచుకుంటుంది వనిత. ఇక వనిత కస్తూరి ఇద్దరూ ఒక సీజన్లో బిగ్ బాస్ ఇంట్లో ఎంట్రీ ఇచ్చిన వాళ్లే,అ స్నేహం తో వనిత కి కస్తూరి చేసిన కామెంట్, ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు కస్తూరి పెట్టిన కామెంట్ “ఒకే ఇంట్లో చాలా మందిని పంపించి వారి ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ ను చూపించే షోను నేను చూడడం లేదు, నాకు అంత టైం ఇంట్రెస్ట్, ఓపిక లేదు మా ఇంట్లో టీవీ కూడా ఉండదు నాకంటూ పనులు బాధ్యతలు ఉన్నాయి నేను బిగ్ బాస్ షోను చూడడం లేదు”అని క్లారిటీ ఇచ్చింది కస్తూరి..

దీనిపై నిటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు బిగ్బాస్ షోలోకి వెళ్లిన నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అంటే ఆరోజు డబ్బులు కోసమే షోకి వెళ్ళావా? మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నావు అని అందరూ నానా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు కస్తూరిని, తన పర్సనల్ గా చెప్పిన విషయాన్ని కూడా ఇలా నెగిటివ్గా ఆలోచించే జనాలు ఉంటే ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. మరీ కొంతమంది హద్దులు దాటి, అవునులే నీకు గంటకు 5000 వస్తాయి కదా అని దారుణంగా డబల్ మీనింగ్ డైలాగ్ తో కామెంట్ చేసేసరికి కస్తూరి దానిమీద స్పందించింది..
మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలానే పెంచారా నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది అని అంటూ కస్తూరి ఆ నెటిజన్ మీద ఫైర్ అయింది. ఇలా ప్రతిసారి కస్తూరి ఏదో ఒకవిదంగా నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ వాళ్ళు చేసిన రిప్లై కామెంట్స్ అన్ని కూడా తను ఏదో ఒక విధంగా పాపులర్ అయ్యే విధంగా చేస్తుంది. ఇలా వేరే వాళ్ల గురించి తప్పుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.