Trinayani: త్రినయని సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సీరియల్ జీ తెలుగులో ప్రసారమవుతుంది. సీరియల్ మొదటి నుంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఊహాజనితంగా ఆకట్టుకునే కదా అంశంతో ముందుకు వెళుతుంది. ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలో అద్భుతంగా జీవిస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఈ సీరియల్ లో అత్తగారి క్యారెక్టర్ లో తిలోత్తమా పాత్రలో పవిత్ర జయరాం నటిస్తున్నారు. విలన్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటిస్తారు పవిత్ర జయరాం.ఈమె కర్ణాటకలో జన్మించింది. ఈమె కన్నడంలో చాలా సీరియస్ గా నటించింది. ఈమె చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి,తెలుగులో నిన్నే పెళ్లాడతా సీరియల్ తో పరిచయమై ఇప్పుడు తోతెలుగు అభిమానుల్ని సంపాదించుకుంది. మొదట్లో తెలుగు సీరియల్స్ లో చేయడం చాలా ఇబ్బందికరంగా ఉండేది అని,తెలుగు మాట్లాడడం కష్టంగా ఉంటే ఇక్కడ నటించే వాళ్లు తనతో స్నేహంగా ఉండడం వల్ల తెలుగు తొందరగా నేర్చుకోగలిగానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంది పవిత్ర.ఇక ఇదే సీరియల్లో సుమన క్యారెక్టర్ లో అనూష నటిస్తున్నారు.
అనూష గురించి కూడా అందరికీ తెలిసిన నటి మీనాక్షి లక్ష్మీ కళ్యాణం, చదరంగం, ఇంటిగుట్టు , ఇలా చాలా సీరియల్స్ లో అనూష నటించింది. కానీ విలన్ పాత్రలో నటించిన మొదటిసారి.ఈ సీరియల్ లో శ్రీ సత్య మొదట ఈ క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత ఆమెకి బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో శ్రీ సత్య తప్పుకొని ఆ క్యారెక్టర్ లోకి అనూష ని ఎంట్రీ ఇచ్చారు. అనూష వచ్చినప్పటినుండి సీరియల్ వేరే లెవెల్ లోకి వెళ్ళింది. విలనిజం చూపించడంలో అత్తగారితోపాటు ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూ ఒకరి నాశనం చేసే పాత్రలో అనూష అద్భుతంగా నటిస్తుంది.2017 లోనే ఈమె నటి అవుదామని హైదరాబాద్ కి వచ్చింది చాలా ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు దీంతో సీరియల్స్ వైపుకు వెళ్ళింది
ఇక ఇప్పుడు ఈ తెలుగింటి కోడలు,కన్నడ అత్త కలిసి ఒక డాన్స్ వీడియోని వారి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీరిద్దరూ ఎప్పుడు ఇంస్టాగ్రామ్ లో అందరితో టచ్ లో ఉంటారు. సీరియల్లో ఖాళీ దొరికినప్పుడల్లా విరామం సమయంలో, ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కి డాన్స్ వేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు పవిత్ర
