NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress First List: 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల .. తొలి జాబితాలోనే ఈ ప్రముఖులు..ఆ నేతలకు హ్యాండ్ ఇచ్చినట్లే(గా)..!

Share

Telangana Congress First List: తెలంగాణ రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుగుచూస్తున్న కాంగ్రెస్ తొలి జాబితా విడుదల అయ్యింది. మొత్తం 119 స్థానాలకు గానూ తొలి జాబితాలో 70 మందికిపైగా అభ్యర్ధుల పేర్లు ఉంటాయని ముందుగా భావించినప్పటికీ పెద్దగా వివాదాలు లేని 55 అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులను కాంగ్రెస్ ప్రకటించింది. తొలి జాబితాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, సీనియర్ నేత దామోదర రాజనర్శింహ, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రీసెంట్ గా పార్టీలో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మైనంపల్లి హనుమంతరావు, ఆయన తనయుడు రోహిత్ తదితరుల పేర్లు ఉన్నాయి.

Telangana Congress

అయితే ఈ జాబితాలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు ప్రకటించలేదు. వీరి ఇద్దరికి టికెట్ లు కన్ఫర్మ్ అయినప్పటికీ ఏ స్థానాల నుండి పోటీ చేయాలనే దానిపై ఇంకా డిసైడ్ కాకపోవడం వల్లనే తొలి జాబితాలో ప్రకటించలేదని భావిస్తున్నారు. మరో మాజీ మంత్రి, సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డికి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. నాగర్ కర్నూల్ అసెంబ్లీ అభ్యర్ధిగా డా.కూచకుళ్ల రాజేష్ రెడ్డి పేరును కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే నాగం జనార్థనరెడ్డి తనకు టికెట్ ఇవ్వకపోతే తన సత్తా ఏమిటో చూపిస్తానంటూ రెండు రోజుల క్రితం హెచ్చరిక జారీ చేశారు. తన అనుచర వర్గంతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణకు సిద్దమవుతున్నారు నాగం.

ఇక మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి నాగార్జునసాగర్, మిర్యాలగూడ రెండు అసెంబ్లీ స్థానాలు కోరగా, సాగర్ అభ్యర్ధిగా ఆయన తనయుడికి అధిష్టానం కేటాయించింది. మిర్యాలగూడ అభ్యర్ధిని ప్రకటించలేదు. వామపక్షాలతో పొత్తులో భాగంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వారికి టికెట్ లు కేటాయించాల్సి ఉన్నందున మిర్యాలగూడ ను హోల్డ్ లో పెట్టినట్లుగా తెలుస్తొంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 55 మంది అభ్యర్ధులతో విడుదల చేసిన తొలి జాబితా ఇదే..

నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులు…

1. బెల్లంపల్లి (ఎస్‌సీ) – గడ్డం వినోద్
2. మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
3. నిర్మల్ – కుచడి శ్రీనివాస రావు
4. ఆర్మూర్ – ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
5. బోధన్ – పి సుదర్శన్ రెడ్డి
6. బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల
7. జగిత్యాల – టీ.జీవన్ రెడ్డి
8. ధర్మపురి (ఎస్‌సీ) – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
9. రామగుండం – ఎంఎస్ రాజ్ థాకూర్
10. మంథని – శ్రీధర్ బాబు
11. పెద్దపల్లి – చింతకుంట విజయ రామణ రావు
12. వేములవాడ – ఆది శ్రీనివాస్
13. మానకొండూర్(ఎస్‌సీ) – డా.కవ్వంపల్లి సత్యనారాయణ
14. మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు
15. ఆందోల్ (ఎస్‌సీ) – సీ. దమోదర్ రాజనర్సింహ
16. జహీరాబాద్ (ఎస్‌సీ) – అగం చంద్రశేఖర్
17. సంగారెడ్డి – తూరుపు జగ్గారెడ్డి
18. గజ్వేల్ – తూముకుంట నర్సారెడ్డి
19. మేడ్చల్ – తోటకూర వర్జేస్ యాదవ్
20. మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంతరావు
21. కుత్బుల్లాపూర్- కోలన్ హన్మంత్ రెడ్డి
22. ఉప్పల్ – ఎం. పరమేశ్వర్ రెడ్డి
23. చేవెళ్ల (ఎస్‌సీ) – పమేన భీమ్‌భారత్
24. పరిగి – టీ. రామ్ మోహన్ రెడ్డి
25. వికారాబాద్ (ఎస్‌సీ) – గడ్డం ప్రసాద్ కుమార్
26. ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్ మందాడి
27. మలక్‌పేట్ – షేక్ అక్బర్
28. సనత్‌నగర్ – డా.కోట నీలిమా
29. నాంపల్లి – మహ్మద్ ఫిరోజ్ ఖాన్
30. కార్వాన్ – ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రి
31. గోషామహల్ – మొగిలి సునీత
32. చంద్రాయణగుట్ట – బోయ నగేష్ (నరేష్)
33. యాకత్‌పురా – కే. రవి రాజు
34. బహదురపుర – రాజేష్ కుమార్ పులిపాటి
35. సికింద్రాబాద్ – ఆడమ్ సంతోష్ కుమార్
36. కొడంగల్ – అనుముల రేవంత్ రెడ్డి
37. గద్వాల్ – సరిత తిరుపతయ్య
38. ఆలంపూర్ (ఎస్‌సీ)- డా.ఎస్ఏ సంపత్ కుమార్
39. నాగర్‌కర్నూల్ – డా.కూచకుళ్ల రాజేష్ రెడ్డి
40. అచ్చంపేట (ఎస్‌సీ) – డా.చిక్కుడు వంశీకృష్ణ
41. కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ రెడ్డి
42. షాద్‌నగర్ – కే.శంకరయ్య
43. కొల్లపూర్ – జూపల్లి కృష్ణారావు
44. నాగార్జునా సాగర్ – జయవీర్ కుందూరు
45. హూజర్‌నగర్ – నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి
46. కోదాడ – నలమడ పద్మావతి రెడ్డి
47. నల్లగొండ – కోమటరెడ్డి వెంకటరెడ్డి
48. నకిరేకల్ (ఎస్‌సీ) – వేముల వీరేశం
49. ఆలేరు – బీర్ల ఐలయ్య
50. స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) – సింగాపురం ఇందిర
51. నర్సంపేట – దొంతి మాధవ్ రెడ్డి
52. భూపలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు
53. ములుగు (ఎస్‌టీ) – ధనసరి అనసూయ (సీతక్క)
54. మధిర (ఎస్‌సీ) – భట్టి విక్రమార్క
55. భద్రాచలం (ఎస్‌టీ) – పోదెం వీరయ్య

Chandrababu Arrest: ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు .. చంద్రబాబు బ్యారక్ లో టవర్ ఏసీ పెట్టండి


Share

Related posts

Pooja hegde: పూజా హెగ్డే గూరూజీకే షాకిచ్చిందా..?

GRK

Dhee 13 : ప్రియమణి ముద్దు కోసం హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ఏమైనా చేసేలా ఉన్నారు?

Varun G

diabetis: షుగర్ ఉన్నవారు ఈ పండ్లు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది!!

siddhu