Intinti Gruhalakshmi: నందు తులసి చేసిన పనికి అటు ఇటు కోపంగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే లాస్య నందు దగ్గరకు వచ్చి ఆ తులసి ఎప్పుడు ఇంతే నందు.. నిన్ను కావాలని డౌన్ చేస్తూ ఉంటుంది.. ఇప్పటికైనా నీకు ఆ విషయం అర్థమైందా అని నందు కి తులసి పై ఎక్కేసి చెబుతుంది.. ఆ తులసిని చూస్తుంటే నాకు అని రెండు చేతులు కోపంగా పైకి ఎత్తుతుంది. అప్పుడే తులసి అక్కడికి వస్తుంది. దాంతో లాస్య తను రెండు చేతుల్లోకి ఎందుకు దించుతుంది..

Intinti Gruhalashmi: నాదే తప్పంటూ అందరి ముందుకి క్షమాపణలు చెప్పిన తులసి.. దివ్య ఇంటికి దూరం..
ఇప్పటికే ఆయన కోపంగా ఉన్నారు. మళ్ళీ నువ్వు వచ్చి ఇంకా పెద్దది చేయకు అని లాస్య అంటుంది. నేను దగ్గరకు రానులే గాని దూరంగా ఉండి మాట్లాడతాను అని తులసి అంటుంది. ఏంటి సెటైరా అని అంటుంది. నీకు ఒక విషయం చెప్పనా.. ఉత్తమ ఇల్లాలు అవ్వాలని అనుకుంటున్నావు కదా .. ఉత్తమ ఇల్లాలు అవ్వాలనుకునేవారు గొడవలు పెంచకూడదు. సద్దుమణిగేలా చూడాలి.. ఇద్దరి వైపు నుంచి ఆలోచించాలి. ముందు నువ్వు ఆ చీర కొంగుని తీసుకొని మడతపెట్టి నోట్లో కుక్కని సైలెంట్ గా ఉండమని తులసి సలహా ఇస్తుంది. మన ఇద్దరి గొడవలు ఎప్పుడూ ఉండేవే.. నందగోపాల్ గారు.. దివ్య ఈ ఇంటి నుంచి వెళ్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. తను వెళ్లేటప్పుడు బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు కిందకి వచ్చి దాన్ని సంతోషంగా పంపిస్తే అది వెళ్లిన చోట ప్రశాంతంగా ఉంటుంది అని తులసి అంటుంది. ఇక సరే అని నందు కిందకు వస్తాడు.

దివ్య ఢిల్లీ బయలుదేరుతుంది. ముందుగా నందు దగ్గరకు వెళ్లి తన బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. అప్పుడే నందు దివ్య కి గిఫ్ట్ ఇస్తాడు వాచ్ గా తాను తీసుకువచ్చిన గిఫ్టును దివ్య చేతికి పెట్టమని అంటుంది. దివ్య కి థాంక్స్ చెబుతుంది . అప్పుడే దివ్య అమ్మతో గొడవ పడకుండా ఉంటానని మాట ఇవ్వమని అడుగుతుంది. కనీసం ట్రై చేస్తానని చెప్పండి అని దివ్య అనేసరికి సరే అని నందు అంటాడు. ఇక తులసి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంది నా గురించి ఆలోచించకు బెంగ పెట్టుకోకు నేను అక్కడ జాగ్రత్తగా ఉంటాను అని దివ్య తులసితో అంటుంది గట్టిగా హత్తుకుంటారు . అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి..

ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య అనసూయమ్మ పరంధామయ్య దగ్గరికి వచ్చి కబ్జా చేసిన మీ ఆస్తి మళ్లీ తిరిగి వచ్చింది అత్తయ్య అని చెబుతుంది. భలే మంచి శుభవార్త చెప్పవు నీ నోట్లో పంచదార పోయాలి అని అనసూయ అంటుంది. ఆ ఆస్తిని నందు తన పేరు మీద పెట్టమని అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా అనసూయ నేను ఆ ఆస్తి తిరిగి వస్తే మన వాళ్ళు మనవరాలకు పెట్టాలని నిర్ణయించుకున్నామని పరంధామయ్య అంటాడు. ఇక ఈ మేటర్ ఎటువైపుకు దారితీస్తుందో తరువాయి భాగంలో చూద్దాం.