Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో ప్రశాంతంగా పని చేసుకుంటుంది.. కానీ సామ్రాట్ తనకు ఇచ్చిన మాట మర్చిపోయాడ.. లేదంటే తన మనసులో ఏదైనా చెడు ఆలోచన ఉందా అని మనసులో ఆలోచిస్తుంది.. అప్పుడే అభి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు నానమ్మ అని అడుగుతాడు.. వెంటనే అనసూయమ్మ నేను చేయాల్సిన పని చేసేసాను రా ఫలితం కోసం ఎదురుచూస్తున్నాను అని చెబుతుంది.. నిజంగా తులసి నాకు ఎంతో చేసిందిరా.. మీ నాన్న కొన్నాళ్లు తులసిని బాధ పెట్టాడు.. ఇప్పుడు నేను అని అనసూయమ్మ అంటుంది.. అప్పుడే తులసి అక్కడికి వస్తుంది..!
ఏంటి అత్తయ్య అసలు ఏం అయ్యింది అని తులసి అడుగుతుంది.. నా కాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతున్నారు అని అభి సర్ది చెబుతాడు.. ఇవన్నీ ఎప్పుడు ఉండేవేగా తులసి.. నువ్వు రేపు ఆఫీస్ కి వెళ్తున్నావా తులసి అనసూయమ్మ అడుగుతుంది.. వెళ్తున్నాను అని.. నా మీద చాలా బరువు బాధ్యతలు పెట్టారు.. వాటిని నేను చక్కగా చేయాలి.. నేను వాటిని నిర్వర్తించాలి.. అని తులసి మంచిగా మాట్లాడటం చూసి అనసూయమ్మ మనసులో సామ్రాట్ పై అనుమానం కలుగుతుంది.. ఎలాగైనా మరోసారి సామ్రాట్ కి ఈ విషయం గుర్తు చేయాలి అనుకుంది..
తులసి ఆఫీస్ లో చాలా సీరియస్ గా ప్రతి ఒక్క ఫైల్ చదివి సంతకం పెడుతుంది. ఝాన్సీ తులసి కి ప్రతి ఒక్క ఫైల్ వివరించి చెప్పి సంతకాలు చేయిస్తుంది. ఇది ఓల్డ్ ప్రాజెక్ట్ మ్యామ్.. ప్రస్తుతం ఈ ఫైల్ డిస్కసన్ జరుగుతుంది.. అని ఝాన్సీ చెబుతుంది.. ఈ ఫైల్ సార్ చెక్ చేశారా అని తులసి అడుగుతుంది.. ఝాన్సీ మనసులో కాస్త భయంగా వెరిఫై చేశారు అని చెప్పి తులసిని సైన్ చేయమని చెబుతుంది.
ఆఫీస్ లో జరిగిన దానికి షమే గా ఫీల్ అవుతుంది.. రిలాక్స్ అవ్వండి తులసి గారు.. అన్ని మర్చిపోయి సాయంత్రం బర్త్డే ఫంక్షన్ కి రండి.. హనీ మీకోసం వెయిట్ చేస్తుంది.. మీరు రాకపోతే హనీ బర్త్ డే జరుపుకోదు అని సామ్రాట్ అక్కడి అంటాడు.. ఆ తర్వాత తులసి ఝాన్సీ దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది.. నీ పొట్ట కొట్టడం నాకు ఇష్టం లేదు అందుకే చేయని తప్పుకి నేను క్షమించమని అడిగాను.. అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి.. ఇది నువ్వే చెప్పావా.. లేదంటే ఎవరైనా చెప్పారా.. అని తులసి అంటుంది.. రేపటి ఎపిసోడ్ సామ్రాట్ హనీ బర్త్డే ఫంక్షన్ లో.. ఒక చిన్న పొరపాటు వల్ల నా కంపెనీకి 10 కోట్ల నష్టం జరిగేది దానిని నందు కాపాడకుండా ఆపాడు.. అతని లాయాల్టీకి మెచ్చి కంపెనీ తరఫున ఓ చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను.. నందు గారిని తులసి గారి ప్లేస్ లో మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను అని సామ్రాట్ అనౌన్స్ చేస్తాడు.. ఆ మాట వినగానే లాస్య ఎగిరి గంతేసింది.. అభి ఆనందంతో చప్పట్లు కొడతారు.. తులసి రెండు చేతులతో దండం పెట్టి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!