Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి 12 రేటింగ్ సొంతం చేసుకుని మూడవ స్థానంలో నిలిచింది.. గత వారం ఈ సీరియల్ రెండో స్థానంలో నిలవగా వారం మూడో స్థానానికి పడిపోయింది.. ఈ సీరియల్లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!
ఇంటింటికి గృహలక్ష్మి సీరియల్ తులసి పాత్రే కీలకం.. ఇంటి గృహలక్ష్మి ఏ విధంగా అమాయకంగా ఉంటూ.. తన ఇంటి బాధ్యతలను చక్కదిద్దుతుంది.. తన మనసులో ఉన్న ఎన్నో కోరికలను, ఆశలను చంపుకొని తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తుంది.. తను ఇంతగా పాకులాడి ప్రయాస పడిన కూడా తన భర్త మనసులో తనకు స్థానం దక్కదు.. ఆమె భర్త మరొక అమ్మాయిని ఇష్టపడతాడు.. తన మనసులో తనకు స్థానం లేదని తెలుసుకున్న తులసి ఈ మనిషితో ఎంత కాలం ఉన్నా ఇక అంతే అని అనుకొని అతనికి విడాకులు ఇచ్చేసింది.. విడాకులు ఇచ్చిన తర్వాత కూడా తన నుంచి తనకు సాదింపులు వేధింపులు మొదలవుతాయి.. వాటన్నింటినీ తట్టుకొని ధైర్యంగా నిలబడుతుంది.
Intinti Gruhalakshmi Today Episode: గృహలక్ష్మి ఈరోజు ఎపిసోడ్, గృహలక్ష్మి సీరియల్ డైలీ హైలైట్స్, ఇంటింటి గృహలక్ష్మి టుడే ఎపిసోడ్ రివ్యూ
తులసి కలలు కన్న మ్యూజిక్ స్కూల్ ప్రపోజల్ ను సామ్రాట్ అనే బిజినెస్ మెన్ ముందు ఉంచుతుంది.. అతనికి కూడా ఏ ప్రాజెక్టు నచ్చడంతో భూమి పూజ ఫంక్షన్ వరకు ఉంటుంది.. కానీ ఆ ఫంక్షన్ లో తులసి మాజీ భర్త నందుని తెలిసి గొడవ జరిగి ఆగిపోతుంది.. తులసి కూడా తనకు ఎందుకు ముందుగా ఈ విషయం చెప్పలేదు అని సామ్రాట్ బాధపడతాడు.. ఇప్పుడు అదే నిజాన్ని లాస్య నందు తో మాట్లాడుతుండగా సామ్రాట్ కార్ లో ఉండి వింటడు.. తులసి మంచితనం తెలుసుకొని సామ్రాట్ మళ్లీ తులసితో కలిసి అడుగులు వేయాలని బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు.. అందుకుగాను అభి అన్నట్టు తులసికి సారీ చెప్పడానికి ఒప్పుకుంటాడు.. లాస్య నందుల నిజస్వరూపం తెలుసుకున్న సామ్రాట్.. వాళ్ళిద్దర్నీ ఆఫీస్ నుంచి పంపించకుండా రోజుకు ఒక షాక్ మీద షాక్ ఇస్తూ ఉంటాడు అదే వచ్చేవారం ట్విస్ట్..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!