Itlu Maredumilli Prajaneekam: అల్లరి నరేష్.. ఈయన గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కామెడీ ప్రధానమైన చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడీయన. అయితే గత కొంత కాలం నుంచీ సరైన సక్సెస్ లేకపోవడంతో రూట్ మార్చి ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగు వేస్తున్న అల్లరి నరేశ్.. ఇటీవల `నాంది`తో ప్రేక్షకులను పలకరించాడు.
ఈ చిత్రం ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఈ మూవీ ద్వారా అల్లరి నరేష్ తనలోకి మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇకపోతే అల్లురి నరేష్ చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం `ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం`. రాజ్ మోహన్ దర్శకత్వం వహించాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో అల్లరి నరేశ్ – ఆనంది జంటగా నటించారు. మారేడుమిల్లి నేపథ్యంలో సాగే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే నేడు అల్లరి నరేష్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ బయటకు వదిలారు. `ఇవన్నీ ఆదివాసీల గ్రామాలు. వీళ్లలో ఎక్కువమంది జీవితంలో ఓటు వేయని వాళ్లే ఎక్కువ` అనే వాయిస్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో ఓటర్ నమోదు కోసం ఓ ఆదివాసి గ్రామానికి వెళ్లే అధికారిగా అల్లరి నరేష్ నటించినట్టుగా తెలుస్తోంది. అలాగే అల్లరి నరేష్ పోలిసుల చేతిలో దెబ్బలు తింటున్నట్లు కూడా టీజర్ లో చూపించారు. మొత్తానికి ఆకట్టుకుంటున్న ఈ టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను అల్లరి నరేష్ అందుకుంటాడా..లేదా..అన్నది చూడాలి.