NewsOrbit
Entertainment News Telugu Cinema రివ్యూలు సినిమా

Jailer Movie: జైలర్…జై జై అంటున్న రజనీకాంత్ సినిమా…జైలర్!

Jailer Movie latest updates
Advertisements
Share

Jailer Movie: తలైవా రజనీకాంత్ సినిమా అంటే జనాలకి పూనకాలే మరి. కేవలం తమిళ తంబిలకు కాదు. మనోళ్ళకి కూడా. రజనికి టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువనేది అందరికీ తెలిసినదే. రజనీకాంత్ సినిమాలు ఈ మధ్య పెద్దగా ఆడలేదు. కానీ ఎందుకో “కావాలయ్య” పాట విడుదలై విపరీతంగా వైరల్ అవ్వడం వల్ల టీజర్ చూసాక ఇందులో ఏదో విషయం ఉందేమో అనే అభిప్రాయం కలగడం వల్ల చాలామందిలో కొంచం ఎక్కువగా ఆసక్తి కలిగింది. ఇంతకీ ఏముంది ఇందులో? విషయంలోకి వెళదాం.

Advertisements
Jailer Movie latest updates
Jailer Movie latest updates

ఇంకా కథలోకి వెళ్తే ముత్తువేల్ పాండియన్ రజనీకాంత్ రిటైర్డ్ జైలర్. భార్య, కొడుకు, మనవడితో జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంటాడు. కొడుకుని నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్‌ని చేస్తాడు. తండ్రి మార్గంలోనే అన్యాయాన్ని ఆమడ దూరంలో ఉంచుతాడు ముత్తు కొడుకు అర్జున్ వసంత్ రవి .అన్యాయాన్ని . అసలే సహించడు ఒక పురాతన దేవాలయాల్లో విగ్రహాలను చోరీ చేసే ముఠాను పట్టుకునే కేసులో దూకుడుగా ఉంటాడు. వర్మ (వినాయకన్) అనే స్మగ్లర్ ఆ దొంగతనం చేస్తాడు. అతని కొడుకు ప్రస్తుతం ఆ స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలపై కన్నేసిన ఏసీపీ. అతనిని ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. చనిపోయాడని కూడా కబురందుతుంది ముత్తు కుటుంబానికి. ముత్తు ఆ గ్యాంగ్ పై ప్రతీకారం తీర్చుకోవడం ప్రధాన కథ. తన కొడుకు ఏమయ్యాడు? చివరికి తన కుటుంబాన్ని ముత్తు ఎలా కాపాడుకున్నాడు? అసలు ముత్తు ఇదివరకటి కధ ఏంటి? అన్నదే మిగిలిన జైలర్

Advertisements
Jailer Movie latest updates
Jailer Movie latest updates

సినిమా కథ.

ఇక సినిమాలోని సన్నివేశాల గురించి చెప్పుకోవాలంటే తిహార్ జైల్ కి జైలర్ గా 1980ల నాటి వింటేజ్ రజనీకాంత్ ని తలపించాడు. మేకప్ కి, హెయి స్టైలిస్ట్ కి విజిల్స్ చప్పట్లు అదిరి పోతాయి. . అయితే ఆ సీన్ లో రజని లుక్ వరకే తప్ప అసలు విషయం మాత్రం దెబ్బకోట్టింది. స్టైల్ కి ప్రాధాన్యతనిచ్చి కంటెంట్ ని చంపేసిన దృశ్యాలు అవి . ఇలాంటి సీన్స్ కొన్నున్నాయి. అయితే రజనీకాంత్ సినిమాల్లో “అతి” కూడా అతికినట్టే ఉంటుంది. అదొక

Jailer Movie latest updates
Jailer Movie latest updates

స్టైల్ అంతే.

రమ్యకృష్ణ, మిర్ణా మీనన్ టేబుల్ మీద కూర్చుంటే రజనీకాంత్ చేసే (చేయించే) పోరాటాలు , వాళ్ల మీద రక్తం పడడం వగైరాలు కొంచం అతి” గా ఉన్నా అది కూడా ఒక స్టైల్ అన్నట్టుగా ఓకే అని అనుకుంటారు జనం.

జాకీ ష్రోఫ్ సన్నివేశం మరీ రొటీన్ గా ఉంది. శివరాజ్ కుమార్ ట్రాక్ బాగుందనిపిస్తే, మోహన్ లాల్ పాత్ర పేలవంగా ఉంది. ఇక సునీల్ పాత్ర ప్రవేశం హడావిడిగా జరిగినా క్రమంగా పెదవి విరిచేలా తేలిపోయింది. సినిమా కథకి ఏ మాత్రం సంబంధం లేకపోయినా తమన్నా మాత్రం కట్టిపారేసింది తన అందంతో. కేవలం ఐటం సాంగ్ లాగ అనిపించకూడదు అన్నట్టుగా ఏదో కాస్తంత ట్రాక్ పెట్టారు. కానీ ఆమె స్థాయికి ఆ ట్రాక్ అంత బాలేదు. కమెడియన్ యోగి బాబు పాత్ర తొలిసగంలో బాగుంది.

దర్శకుడు నెల్సన్ ఈ తరం కుర్రకారు ప్రేక్షకుల నాడికి తగ్గట్టుగా కథనాన్ని మలచడంలో మరోసారి తన ప్రతిభను నిరూపించు కున్నాడు. అయితే సుత్తితో మొహం పగలగొట్టడం, చెవులు కత్తితో తెగ్గొట్టేయడం లాంటి హింసాత్మక సన్నివేశాలు అతిగా చిరాకు పెట్టిస్తాయి.

Jailer Movie latest updates
Jailer Movie latest updates

గత కొన్నేళ్లుగా వచ్చిన రజనీకాంత్ సినిమాల్లో ఇదే బెస్ట్ అన్నట్టుగా ఉంది. తన వయసుకి, ఇమేజ్ కి తగిన పాత్రలో రజనీకాంత్ కనిపించడం బాగుంది. స్టైలిష్ యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని పెద్దగా నిరాశపరచని చిత్రమిది. అలాగని లోపాలు లేకపోలేదు. ఓవరాల్ గా రెండు గంటల యాభై నిమిషాల నిడివి గల సినిమా అయినప్పటికీ ఎక్కడా ల్యాగ్ ఉందనిపించదు.

కథగా చూస్తే హిందీలో పూరీ జగన్నాథ్ తీసిన అమితాబ్ సినిమా పోలిక లు ఉంటాయి. పో లీసాఫీసరైన కొడుకుకి ప్రమాదాలు ఎదురైతే అడ్డుపడి మరీ ఫైట్స్ చేసే ముసలి తండ్రి పాత్రలో అమితాబ్ ని ఇదివరకు చూసాం. ఇక్కడ రజనీకాంత్..అంతే తేడా! అయితే క్లైమాక్స్ లో కమల్ హాసన్ “భారతీయుడు” పోలికలు కనిపిస్తాయి. హాలీవుడ్ మూవీ “ఎక్స్పెండిబుల్స్” లో లాగా పెద్ద సీనియర్ హీరోలు ఒక్కొక్కరు కథలోకి ప్రవేశిస్తుంటారు.
ఇలా రకరకాల పాత సినిమాల వాసన తగులుతున్నా ఎదో కొత్తగా ఉండి రజని స్టైల్ వల్ల కొత్తగానే అనిపిస్తుంది.

సినిమా అంటే కథకంటే కథనం ప్రధానం. ఆ విషయంలో ప్రధమార్ధం చాలా ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. కొన్ని అతి పోకడలు, విలన్ గ్యాంగులో అతిగా ఉన్నా అవన్నీ కథనంలో కలిసిపోయేలా ఉండడం వల్ల పెద్దగా సమస్య అనిపించదు. ఎక్కడికక్కడ నేపధ్య సంగీతం సినిమాని బాగా నిలబెట్టింది. అలాగే కెమెరా కానీ, వాడిన ఎడిటింగ్ కానీ, కొత్తతరం స్టాండర్డ్స్ ని ప్రతిబింబించాయి.

Jailer Movie latest updates
Jailer Movie latest updates
ఇదంతా ఇంటర్వెల్ ముందు మాత్రమే హడావిడి . తర్వాత సినిమా కొంచం స్లో ఐంది.

మళ్లీ సినిమా చివర్లో ఊహించని విధంగా ముగించడంతో కుర్చీలోంచి లేచి వెళ్లే ప్రేక్షకుడికి సంతృప్తి కలుగుతుంది. ఒక రకంగా బాగానే ఐంది సినిమా అనిపిస్తుంది.
ఈ మధ్య కాలంలో వచ్చిన రజనీకాంత్ సినిమాల్లో ఇదే గొప్ప సినిమా అన్నట్టుగా ఉంది. తన వయసుకి, ఇమేజ్ కి తగిన పాత్రలో రజనీకాంత్ కనిపించడం బాగుంది. స్టైలిష్ యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని పెద్దగా నిరాశపరచని చిత్రమిది. అలాగని లోపాలు లేకపోలేదు. ఓవరాల్ గా రెండు గంటల యాభై నిమిషాల నిడివి గల సినిమా అయినప్పటి కీ ఎక్కడా బోర్ కొట్టకుండా బాగానే వుంది .


Share
Advertisements

Related posts

Pawan Kalyan : పవన్ నటించిన అన్ని సినిమాల్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా..??

sekhar

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!?

Ram

Soundariya Nanjundan Beautiful Images

Gallery Desk