టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘ కాలం పాటు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కాజల్.. 2020 కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లాడింది. ముంబైలో అత్యంత సన్నిహితుల నడుమ ఘనంగా వీరి వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలు చేసిన కాజల్.. గత ఏడాది గర్భం దాల్చడంతో నటకు బ్రేక్ ఇచ్చింది. ఏప్రిల్‌లో ఈమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కాజల్ ముద్దుల తనయుడితో మధర క్షణాలను ఆస్వాదిస్తోంది. ఇకపోతే కాజల్ రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఆమె నటనకు గుడ్‌బై చెప్పేసిందని, ఇక సినిమాలు చేయదని వార్తలు పుట్టకొచ్చాయి. అయనప్పటికీ అభిమానుల్లో ఆశ చావలేదు. కాజల్ తప్పకుండా రీఎంట్రీ ఇస్తుందని నమ్మకంగా ఉన్నాయి. అయితే వారి నమ్మకమే నిజం అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కాజల్‌కు చాలా ఆఫర్లు వస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే తాజాగా కాజల్ ఓ వెబ్ సిరీస్‌కు సైన్ చేసిందట. ఆ వెబ్ సిరీస్‌తోనే కాజల్ రీఎంట్రీ ఇవ్వబోతోందని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
ఇప్పటికే హాట్ స్టార్‌లో కాజల్ `లైవ్ టెలికాస్ట్` అనే హర్రర్ వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ పర్వాలేదనిపించుకుంది. అయితే ఇప్పుడు హాట్ స్టార్ వారే మరో వెబ్ సిరీస్ తో కాజల్‌ను సంప్రదించగా.. కథ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ స్టార్ట్ కానుందట. ఈ సిరీస్‌కు కాజల్ రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఎంతో తెలుసా.. రూ. 3 కోట్లు. హట్‌స్టార్ వారు మూడు కోట్ల రూపాయిలను కాజల్‌కు ముట్టచెప్పుతున్నారట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!