NewsOrbit
Entertainment News సినిమా

తొలి రోజు దుమ్ము దులిపేసిన `కార్తికేయ 2`.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `కార్తికేయ 2`. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రానికి చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `కార్తికేయ`కు ఇది సీక్వెల్‌.

ఇందులో అనుపమ్‌ ఖేర్‌, ఆదిత్య మీనమ్‌, కేఎస్‌ శ్రీధర్‌, శ్రీనివాస రెడ్డి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. వాయిదా ప‌డుతూ ప‌డుతూ చివ‌రాఖ‌ర‌కు ఆగ‌స్టు 13న అట్ట‌హాసంగా విడుద‌లైంది. మొద‌టి ఆట నుండే ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి.

`కార్తికేయ‌`ను మించి `కార్తికేయ 2` ఉంద‌ని, నిఖిల్ ఖాతాలో మ‌రో హిట్ ఖాయ‌మంటూ సినీ ప్రియులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇక టాక్ బాగుండ‌టంతో.. తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.50 కోట్ల రేంజ్‌లో షేర్‌ను వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 5.05 కోట్ల షేర్‌ను ద‌క్కించుకుంది. ఇక ఏరియాల వారీగా `కార్తికేయ 2` టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.24 కోట్లు
సీడెడ్: 0.40 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 0.45 కోట్లు
తూర్పు: 0.33 కోట్లు
పశ్చిమ: 0.20 కోట్లు
గుంటూరు: 0.44 కోట్లు
కృష్ణ: 0.27 కోట్లు
నెల్లూరు: 0.17 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ‌= 3.50 కోట్లు(5.30కోట్లు~ గ్రాస్)
—————————–

క‌ర్ణాట‌ఖ‌+రెస్టాఫ్ ఇండియా – 0.25 కోట్లు
ఓవ‌ర్సీస్ – 1.30 కోట్లు
——————————–
టోటల్ వరల్డ్ వైడ్= 5.05 కోట్లు(8.50 కోట్లు~ గ్రాస్)
——————————–

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 12.80 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగుతోంది. దీంతో ఈ మూవీని క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే తొలి రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా.. ఇంకా రూ. 8.25 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంది. సినిమాకు ఎలాగో పాజిటివ్ టాక్ వ‌చ్చింది కాబ‌ట్టి.. నిఖిల్ ఈ టార్గెట్ ను చాలా ఈజీగా రీచ్ అవుతాడు అన‌డంలో సందేహ‌మే లేదు.

author avatar
kavya N

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N