న్యూస్

చర్చిలో అగ్ని ప్రమాదం .. 41 మంది సజీవ దహనం .. ఎక్కడంటే..?

Share

చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 41 మంది సజీవ దహనం అయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఇంబాబా ప్రాంతంలో ఆదివారం జరిగింది. ఆదివారం నాడు అబు సెఫీన్ చర్చిలో భక్తులు ప్రార్ధనలు చేస్తుండగా ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో అగ్ని ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 14 మంది గాయాలతో బయటపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడైంది.

ఈజిప్ట్ అధ్యక్షుడు సంతాపం

చర్చిలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిస్సీ విచారం వ్యక్తం చేశారు. కోఫ్టిక్ క్రిస్టియన్ పోప్ తవాడ్రోస్ – 2 కు ఆయన ఫోన్ చేసి సంతాపం తెలియజేశారు.


Share

Related posts

AP Assembly Budget Session: ఏపి గవర్నర్ నోట వికేంద్రీకరణ మాట .. ప్రసంగాన్ని అడ్డుకుని నిరసన తెలిపిన టీడీపీ సభ్యులు

somaraju sharma

ఆయన నిర్ణయాలు ఆ’మోదీ’యం..!!

Muraliak

చిటికెలో ఆధార్ డౌన్‎లౌడ్ ఇలా…!!

sekhar