తెలుగు వారు సంక్రాంతి పండగను ఎంత ఘనంగా జరుపుకుంటారో.. అలానే కేరళ ప్రజలు ఓనమ్ పండగను జరుపుకుంటారు. కేరళీయుల అతిపెద్ద పండుగ ఓనమ్. పది రోజుల పాటు ఎంతో సంబరంగా ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.
ఈ నేపథ్యంలోనే కేరల కుట్టి అయిన కీర్తి సురేష్ గోల్డెన్ కలర్ బోర్డర్ కలిగిన క్రీమ్ కలర్ శారీని కట్టుకుని అందంగా ముస్తామైంది. ఆపై ఒంపు సొంపులు పోతూ ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఈ పిక్స్‌లో కీర్తి సురేష్ కొంచె చూపులు తట్టుకోలేరంతే.
అంత అందంగా ఆమె ఆకట్టుకుంటోంది. కాగా కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న ఈ భామ రీసెంట్గా విడుదలైన `సర్కారు వారి పాట` మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది.
ప్రస్తుతం కీర్తి సురేష్ న్యాచురల్ స్టార్ నానికి జోడీగా `దసరా` అనే మూవీలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `భోళా శంకర్` మూవీ చేస్తోంది. వీటితో పాటు మళయాళ, తమిళ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేసింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!