Krishna Mukunda Murari:మురారి కృష్ణ పానిపురి పెడుతుండగా.. ముకుందా వెళ్లి అడ్డుపడుతుంది . మీ ప్రైవేసి కి నేను భంగం కలిగించానా అని అంటుంది. అదేమీ లేదు బయటికి వస్తే కారు ఆగిపోయింది అని కృష్ణ చెబుతుంది. మురారి నేను భార్యాభర్తలు ఇక భంగం కలిగించడానికి ఏముంది. ఇంట్లో వాళ్లతో చెబితే భయమేముంది అని కృష్ణ అంటుంది . చూస్తుండగానే మురారి నోట్లో పానీపూరీ పెడుతుంది కృష్ణ. ఆ తరువాత ముకుందా చూస్తుండగానే మురారి పెదాలపై తుడిచి తన చీర కొంగుతో తుడుస్తుంది.. ఇదంతా చూసి ముకుందా లో లోపల రగిలిపోతూ ఉంటుంది.

ఇంటికి వచ్చిన కృష్ణ భవాని అత్తయ్య నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెబుతుంది. ఈ టాబ్లెట్స్ గౌతమ్ సార్ ఇచ్చారని చెబుతుంది . ఆ టాబ్లెట్స్ వాడడానికి వీల్లేదని ఇంట్లో వాళ్ళందరూ అంటారు . ఇదేమి అల్లాటప్ప డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కాదని ఒక్కసారి నందిని విషయంలో కేర్ తీసుకోమని కృష్ణ అంటుంది. నందిని నా కూతురు తన విషయంలో ఏం చేయాలో నాకు తెలియదా అని ప్రశ్నించారు.

మీరు తప్పు చేస్తున్నారు అని అనడం లేదు అత్తయ్య. ఆ డాక్టర్ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు ఆ డాక్టర్ మీద ఏసీబీ సార్ ఆఫీస్ లో కేసు ఫైల్ చేస్తాను అని కృష్ణ అంటుంది. అంతలో నందిని అక్కడికి వస్తుంది. నందిని ఈ టాబ్లెట్ వేసుకుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అత్తయ్య కి చెప్పు అని అనగానే.. భవాని అని నందిని పిలుస్తుంది. నందిని అలాగేనా పిలిచేది నేను ఎలా పిలవమన్నాను అని కృష్ణ నందినితో అనగానే .. అమ్మ అని నందిని ప్రేమగా పిలుస్తుంది. ఆ ఒక్క పిలుపుకి అగ్ని జ్వాలలా మండుతున్న భవాని మంచు పర్వతంలా కరిగిపోతుంది..

అమ్మ ఈ టాబ్లెట్ వేసుకుంటే నా తలలో నరాలు అన్ని చిట్లిపోతున్నాయి. ఒక్కోసారి నేను చచ్చిపోతానేమో నన్ను భయం కూడా వేస్తుంది అని నందిని తన బాధను చెబుతుంది . ఆ టాబ్లెట్ వేసుకోవడానికి ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకుంటుంది. కాకపోతే నందిని కేర్ ని రేపటి నుంచి ముకుందానే చూసుకుంటుంది అని చెబుతారు.
ఇక రేపటి ఎపిసోడ్ లో ముకుందా మురారి మాట్లాడుకుంటూ ఉండగా.. నా ప్రేమను ప్రశ్నించే అర్హత నీకు లేదు అని ముకుందా అంటుంది. అసలు నేను నీ పెళ్లి రోజు కనిపించాను కాబట్టి నువ్వు నాతో మాట్లాడవు.. అదే అసలు నేను అక్కడ కనిపించకుండా ఉండి ఉంటే నువ్వు పెళ్లి చేసుకునే దానివి కదా అని మురారి ప్రశ్నిస్తాడు. కాదు చచ్చిపోయి దానిని అని ముకుంద అంటుంది. నన్ను ఏమైనా అనుకోని నా ప్రేమను తప్పుపడితే ఊరుకోను మురారి అని ముకుందా అంటుంది . హా.. ఏం చేస్తావు చేసి చూపించు అని మురారి కోపంగా అంటాడు. ఆ మాటలకు ముకుందా అక్కడి నుంచి దుకేయలని అనుకుంటుంది.