NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద మురారిలా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. భవానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ..

Krishna Mukunda Murari Today Episode November 30 2023 Episode 328 Highlights

Krishna Mukunda Murari: రేవతి భవాని తో అక్క ఈ పెళ్లి గురించి శ్రీనివాసన్ తో కూడా ఒక మాట చెప్పాల్సింది అని అంటుంది. అంటే ఏంటి రేవతి ఆయన వచ్చి ఈ పెళ్లి అపెస్తాడు అని అనుకుంటున్నావా, అయినా శ్రీనివాస ముకుంద తండ్రి తన కూతురి క్షేమమే కోరుకుంటాడు కానీ కృష్ణ మురారి లను కలపాలని కోరుకోడు కదా అని భవాని అంటుంది. అప్పుడు ముకుందా వచ్చి అత్తయ్య ఇక్కడున్న వీళ్ళ ఎవ్వరికి కూడా ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు. అలాంటప్పుడు ఎందుకు అత్తయ్య నేను ఈ పెళ్లి చేసుకోను అని ముకుందా రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఈ పెళ్లి జరిపించి తీరతాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ముకుందా ఎప్పుడు పిలిచే పంతుల్ని కాకుండా ఇంకొక పంతులుని పిలవమని భవాని చెబుతుంది. సరే వద్దులే నేనే పిలుస్తాను అని చెప్పి పంతులు గారిని పిలుస్తుంది భవాని.

Krishna Mukunda Murari Today Episode November 30 2023 Episode 328 Highlights
Krishna Mukunda Murari Today Episode November 30 2023 Episode 328 Highlights

మురారి కృష్ణ దగ్గర టిఫిన్ చేసి చేతులు కడుక్కొని కృష్ణ చీర కొంగుకి ఆ చేతులు తుడుచుకుంటూ ఉండగా ముకుందా అక్కడికి వస్తుంది. ఏం చేస్తున్నావు మురారి ఇక్కడ అని ముకుందా మురారిని ప్రశ్నిస్తుంది. అప్పుడు మురారి టిఫిన్ చేసి చేతులు తుడుచుకున్నాను నువ్వేంటి అంత కంగారుగా వస్తున్నావు అని అడగగా.. మన ఇద్దరికీ పెళ్లి చేయటానికి పెళ్లి ముహూర్తం పెట్టడానికి పంతులుగారు వచ్చారు. నిన్ను తీసుకురమ్మని పెద్దత్తయ్య నాతో చెప్పింది రా వెళ్దామని మురారి చెయ్యి పట్టుకుంటుంది ముకుంద. ముందు చేయి వదులు నేను వస్తాను కదా అని మురారి అంటాడు. చెయ్యి పట్టుకుంటే ఇప్పుడు ఏమైంది పదా అని చెప్పి కృష్ణ ముందే మురారి చేయను పట్టుకొని మురారిని తీసుకొని వెళ్తుంది ముకుంద.

Krishna Mukunda Murari Today Episode November 30 2023 Episode 328 Highlights
Krishna Mukunda Murari Today Episode November 30 2023 Episode 328 Highlights

రేవతి భవాని తో ఇంక్కొక్క సారి ఆలోచించమని అంటుంది. మధు కూడా అదే అంటాడు. అప్పుడే పంతులు ని తీసుకుని ముకుంద వస్తుంది. అమ్మా ఏంటి నన్ను పిలిచారు. ఏం చేయాలి అని అంటాడు. అప్పుడు భవాని తన నిర్ణయం మార్చుకుంటుందేమో అని ఇంట్లో వాళ్ళందరూ ఆశగా ఎదురు చూస్తారు కానీ, ముకుందా మురారిలా వైపు చూపించి వాళ్ళ పెళ్లి చేయడానికి మంచి ముహూర్తం పెట్టమని చెబుతుంది. పంతులు కి వాళ్ళ ఇద్దరి జాతకాలు ఇచ్చి చూడమని చెబుతుంది. పంతులు గారు ఇంకా ఎంత సేపు అని అడుగుతుంది భవాని. అప్పుడే జాతకాలు కలవాలి కదా అని పంతులు అంటారు. ఇక మురారి లేచి నిలబడతాడు. అప్పుడే పంతులు వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందని, ఆ సమయంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవ్వరిని ఎవ్వరు విడదీసినా కూడా విడిపోరని ఎలాంటి గొడవలు వాళ్ళిద్దరి మధ్య జరగవని ఆ పంతులు చెబుతారు. ఇక మురారి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode November 30 2023 Episode 328 Highlights
Krishna Mukunda Murari Today Episode November 30 2023 Episode 328 Highlights

మురారిని అలా ముకుందా చెయ్ పట్టుకొని తీసుకువెళ్లడం చూసిన శకుంతల కృష్ణకి చివాట్లు పెడుతుంది. నీ భర్తకి ముకుంద కి పెళ్లి చేస్తాము ముహూర్తం పెడుతున్నారు అంటే నీలో ఎలాంటి చలనం లేదేంటి.. నేను ఈ విషయాన్ని ఇప్పుడే కడిగి పడేస్తాను ఉండు అని శకుంతల కోపంగా భవాని వాళ్ళింటికి బయలుదేరుతుండగా.. నాకు కూడా ఉంది చిన్నమ్మ కోపం కానీ అక్కడ పెడుతుంది ముహూర్తమే కదా పెట్టని పెళ్లయితే జరగడం లేదు కదా అని కృష్ణ అంటుంది. కానీ నీ పద్ధతి నాకు నచ్చడం లేదు అని శకుంతల కృష్ణ పై విరుచుకుపడుతుంది

Krishna Mukunda Murari Today Episode November 30 2023 Episode 328 Highlights
Krishna Mukunda Murari Today Episode November 30 2023 Episode 328 Highlights

 

ఇప్పుడు మనం వెళ్లి ముహూర్తం పెట్టినందుకే గొడవ చేస్తే సాయంత్రం మనకి తెలియకుండా పెళ్లి జరిపించి తీసుకువచ్చేస్తారు. అప్పుడు ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు అని కృష్ణ అంటుంది. మనం కూడా వాళ్ళని నమ్ముతున్నామని వాళ్లకు తెలియాలి అవకాశం దొరికినప్పుడు ఈ పెళ్లి జరగకుండా మనం చేద్దాము అని కృష్ణ తన మనసులో ఉన్న ఆలోచనను శకుంతల ముందు బయటపడుతుంది. అవును బిడ్డ అవకాశం దొరికినప్పుడు ఈ పెళ్లి జరగకుండా జరగకుండా ఆపుదాం అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode November 30 2023 Episode 328 Highlights
Krishna Mukunda Murari Today Episode November 30 2023 Episode 328 Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో ముకుందా మురారి భవాని ముగ్గురు శ్రీనివాసన్ ఇంటికి వస్తారు. ఆ సమయానికి శ్రీనివాసన్ ఇంట్లో కృష్ణ ఉంటుంది. ఇక వాళ్ళు వచ్చారని కృష్ణ ని వంట గదిలోనే ఉండిపోమని చెబుతాడు శ్రీనివాసన్ అప్పుడే మురారి కి దాహం వేస్తుంది. అని అంటే వాటర్ కోసం వంటగదిలోకి వెళ్తుండగా ముకుందా నేను తీసుకు వస్తాను అని అంటుంది. కానీ మురారి తనే వంటగదిలోకి వెళ్తాడు అప్పుడు అక్కడ కృష్ణను చూసి కృష్ణవేణి గారు అని పిలుస్తాడు అంతలో భవాని అక్కడికి వస్తుంది. అక్కడ కృష్ణ ఉండడం చూసి ఇక భవాని ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. కృష్ణ శ్రీనివాసన్ ఇద్దరు కలిసి ఏదైనా ప్లాన్ చేశారేమో అని భావనికి అనుమానం వస్తే ఆ విషయాన్ని భవాని తెలుసుకుంటుందా లేదా అనేది చూడాలి.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri