కృతి శెట్టి.. ఈ యంగ్ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఉప్పెన` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో గ్రాండ్‌గా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. బ్రేకుల్లేని హిట్స్‌తో కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇక తాజాగా ఈమె `ది వారియర్`తో ప్రేక్షకులను పలకరించింది. కోలీవుడ్ డైరెక్టర్ ఎన్.లింగసామి తెరకెక్కించిన ఈ చిత్రంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించాడు.
భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్‌గా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో `విజిల్` మహాలక్ష్మిగా కృతి శెట్టి బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే.. కృతి శెట్టి కోలీవుడ్‌లో ఓ డైరెక్ట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ బాల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా ఎంపిక అయింది.
తమిళంలో ఈ సినిమాకి `వనంగాన్` అనే టైటిల్ ను ఖరారు చేయగా.. తెలుగులో `అచలుడు` అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయింది. అయితే రీసెంట్గా `ది వారియర్` ప్రమోషన్స్‌లో భాగంగా కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సూర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ అద్భుతం అంటూ చెప్పుకొచ్చింది.
కృతి శెట్టి మాట్లాడుతూ.. `సూర్య సర్, బాలా సర్‌తో కలిసి పని చేస్తానని నేను అస్సల ఊహించలేదు. సూర్య సర్ గురించి చాలా విన్నాను. ఆయన పని పట్ల ఎంత నిబద్ధతతో ఉంటారు. ఆయన ఇతరులతో వ్యవహరించే విధానం, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకోవడం నాకు బాగా నచ్చాయి. ఇక బాల సార్ చాలా పర్ఫెక్షనిస్ట్. షూటింగ్ మొదటి రోజు ఆయన నాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చారు` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కృతి కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!