NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 1 2023 Episode: అరుణ్ కుమార్ అమృత ఆశ బంటి ల పెళ్లి ఆపుతారా లేదా..

Kumkuma Puvvu Today Episode December 1 2023 Episode Highlights

Kumkuma Puvvu December 1 2023 Episode: పద్మావతి ఏంటి సాగర్ రెడీ అయ్యారా పెళ్లికి వెళ్లడానికి అంటుంది. సాగర్ నేనెప్పుడో రెడీ నేను లక్ష్మిని అంటున్న అంజలి రావాలి కదా రావాలి కదా అంటాడు సాగర్. కొండమ్మ ఇంకా అంజలి ఏంటి బాబు లక్ష్మీ అనండి అంటుంది సాగర్ మనము అనుకున్నంత ఈజీగా అంజలి లక్ష్మీ లాగా నటిస్తుంది అంటాడు సాగర్. పద్మావతి ఆ భయం ఏమి అవసరం లేదురా సాగర్ అంజలి చెప్పింది కదా నేను లక్ష్మీని అంటూ ఇంకా ఎందుకు భయపడుతున్నావ్ అంట అంటుంది. కొండమ్మ అదిగో లక్ష్మీ అమ్మ వస్తుంది అంటుంది. సాగర్ వచ్చావా లక్ష్మి నువ్వు ఆ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళినాక నేను అంజలిని అంటూ ఏ గొడవ చేయను అని నాకు ఆ దేవుడు మీద ప్రమాణం చేసి చెప్పు అంటాడు. లక్ష్మీ ఆత్మ అంజలితో ఇలా మాట్లాడిస్తుంది అంజలి అయ్యో అదేంటండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మధ్యలో నేనెందుకు వెళ్తాను నాకేంటి అంత అవసరం నిజంగా నేను చెప్పేది వినండి ఆ దేవుడు మీద కాకుండా నా ప్రాణానికి ప్రాణమైన శ్వేత మీద ఒట్టేసి చెబుతున్నాను ఆశ బండి పెళ్లికి సాక్షిగా నేను సంతకం పెడతాను నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని శ్వేత మీద ఒట్టేసి చెబుతుంది.

Kumkuma Puvvu Today Episode December 1 2023 Episode Highlights
Kumkuma Puvvu Today Episode December 1 2023 Episode Highlights

అంజలి శరీరంలో ఉన్న లక్ష్మీ ఆత్మ.సాగర్ అయితే ఓకే అక్కడికి వెళ్లినాక ఇక నువ్వు ఈ గొడవ చేయవని నాకు నమ్మకం వచ్చింది వెళ్దాం పద అంటాడు. లక్ష్మీ ఆత్మ శ్వేత పేరు చెప్పి దేవుడు మీద ప్రమాణం చేయకుండా తప్పించుకున్నాను లేదంటే అంజలి శరీరంలో ఆత్మ ఉండి ఇదంతా చేయిస్తుందని అందరికీ తెలిసిపోయేది అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మీ ఆత్మ. సాగర్ ఇదిగో లక్ష్మీ మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను తీరా రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక పేజీలు మడత పేజీలు ఏవి పెట్టవు కదా అంటాడు సాగర్.అంజలి శరీరంలో ఉన్న లక్ష్మీ ఆత్మ అయ్యో అదేం లేదండి అలాంటి పేజీలు మడత పేజీలు ఏమీ పెట్టను కావాలంటే మడత కాజా తీసుకువెళ్లి వారి నోరు తీపి చేసి వాళ్ళకి సాక్షి సంతకాలు పెట్టి ఇంటికి తిరిగి వద్దాం సరేనా అంటూ మనసులో ఆ ఆశ బంటిలో పెళ్లి జరిగితే అంజలి శాశ్వతంగా ఇక్కడే శ్వేతకు తల్లిగా ఉండిపోతుంది. అప్పుడు నేను సంతోషంగా అంజలి శరీరం విడిచి వెళ్లిపోతాను అనుకుంటుంది లక్ష్మీ ఆత్మ. సాగర్ వాళ్లు రిజిస్టర్ ఆఫీస్ కి బయలుదేరుతారు.

Kumkuma Puvvu Today Episode December 1 2023 Episode Highlights
Kumkuma Puvvu Today Episode December 1 2023 Episode Highlights

కట్ చేస్తే ఆశ బంటి కావేరి చంద్ర నలుగురు కలిసి రిజిస్టర్ ఆఫీస్ కి వస్తారు. కావేరి ఇదిగో ఆఫీసర్ గారు వీళ్ళిద్దరికీ రిజిస్టర్ మ్యారేజ్ చేయాలి అంటుంది. ఆఫీసర్ ఇదిగో నా పేరు తిక్కయ్య నాకు అసలే తిక్క ఎక్కువ నా తిక్కకు లెక్కే ఉండదు అంటూ, ఇదిగో పెళ్లి ఎవరికీ మీ ఇద్దరికీ పెళ్లి వాళ్ళిద్దరూ సాక్షుల అంటాడు కావేరి చంద్రం ను. కావేరి ఓరిని నీ పిండం పిల్లలకు పెట్ట కాకర బీకర కాకు జాతరే అంటే దూబగుంటకు దూదేకులు జాతిరే అన్నట్టు పెళ్లి వాళ్ళిద్దరికి అంటే నన్ను పెళ్లికూతురు అంటావ్ ఏంట్రా నీ కళ్ళకు నేను పెళ్లి కూతుర్ల కనిపిస్తున్నానా అంటుంది కావేరి. చంద్రం కావేరి నువ్వు కాసేపు ఆగు పెళ్లి మా ఇద్దరికీ కాదండి మా పిల్లలకి అంటాడు చంద్రం. ఆఫీసర్ ఒప్పుకోను నేను చస్తే ఒప్పుకోను బాల్యవివాహాలు చేయడానికి నేను అసలుకే ఒప్పుకోను అసలే నా పేరు తిక్కయ్య నాకు తిక్క గాని రేగింది అనుకో ఆఫీస్ కి తాళం పెట్టి ఇంటికి వెళ్ళిపోతాను జాగ్రత్త అంటాడు ఆఫీసర్ తిక్కయ్య. ఆఫీసర్ కావేరిని మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా కాస్త ముదిరే గాని పంచ కళ్యాణి గుర్రం లాగా కనిపిస్తున్నారు అంటాడు ఆఫీసర్ తిక్కయ్య.

Kumkuma Puvvu Today Episode December 1 2023 Episode Highlights
Kumkuma Puvvu Today Episode December 1 2023 Episode Highlights

కావేరి తన భర్త చంద్రంతో చూసారా చూసారా అండి మీరు ఎప్పుడైనా అలా పొగిడారా వాడు చూడండి నన్ను పంచ కళ్యాణి గుర్రంలా ఉన్నాను అంటున్నాడు అని సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతుంది కావేరి. చంద్రం నీ మెలికలు తిరగడం కాస్త ఆపు కావేరి చూడలేక చస్తున్నాను అంటాడు చంద్రం.కావేరి ఆ ఎందుకు చావరు అంటూ పక్కింటి పెళ్ళాం కొంచెం సెంటు కొట్టుకుంటే చాలు సొంగ కార్చుకుని చూస్తారు కానీ సొంత పెళ్ళాం కాస్త సోకు వేసుకుంటే ఓర్వలేక లోపలే కుళ్ళు కుంటారు కదా మీ బుద్ధి అంతే కదా అంటుంది కావేరి. ఆశ అత్తయ్య మీరు కాసేపు ఆగండి చూడండి ఆఫీసర్ నా పేరు ఆశ ఇతని పేరు బంటి అంటుంది. ఆఫీసర్ బంటి బబ్లు ఈ ముద్దు పేర్లు నాకు చెప్పొద్దు అసలు పేర్లు చెప్పు అసలుకి ఈరోజు నాకు కొంచెం తిక్క ఎక్కువ పెరిగిపోయింది అంటాడు ఆఫీసర్. ఆశ నా పేరు ఆశ ఇతని పేరు వినయ్ కుమార్ అంటుంది. ఆఫీసర్ అది అలా చెప్పండి అంటాడు ఆఫీసర్. ఆఫీసర్ సరే అయితే పెళ్లి వీళ్ళకి సాక్షులు మీరా అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 1 2023 Episode Highlights
Kumkuma Puvvu Today Episode December 1 2023 Episode Highlights

కావేరి మేము సాక్షులం కాదు సాక్షులు వస్తున్నారు దారిలో ఉన్నారు అంటుంది. ఆఫీసర్ తిక్కయ్య ఎక్కడున్నారు ఫ్లైట్లో వస్తున్నారా అమెరికాలో ఉన్నారా వాళ్ల కోసం నేను ఎదురు చూడాలా నాకసలే తిక్క అని చెబుతున్నాను కదా అంటాడు. బంటి సార్ నాకు అర్థం అయిపోయింది మీద అసలే మిలిటరీ డిస్ప్లే మీ పేరు తిక్క శంకరయ్య కదా సార్ అంటాడు. ఆఫీసర్ తిక్కయ్య నా పేరు శంకరయ్య కాదు ఒట్టి తిక్కయ్య తిక్కయ్య మాత్రమే నాకు తిక్క రేగిపోతుంది అంటూ వస్తువులు విసిరివేస్తాడు.కావేరి అయ్యా తిక్క శంకరయ్య గారు మీకు తిక్క ఎక్కువే ఒట్టి గుడ్డుకు అరుపులు ఎక్కువ వాన లేని మబ్బుకు ఉరుములు ఎక్కువ అన్నట్టు మీరు డామ్ డీమ్ డిశుం అంటే జడుచుకొని పారిపోతాం అనుకుంటున్నావా అంటుంది కావేరి. ఆఫీసర్ తిక్కయ్య మనసులో వీళ్ళు ఎవరో విఐపి లాగా ఉన్నారు ఎంత విఐపి అయితే మాత్రం నాకిందే ఉండాలి అంటూ ఏంటి మీరు వీఐపీలు అని ఫీల్ అవుతున్నారా? ఎలాంటి వీఐపీ అయినా నేను చెప్పినట్టే నడుస్తుంది ఇక్కడ లేదంటే నాకు తిక్క పెరిగిపోతుంది ముందు మీరు త్వరగా బయటికి వెళ్లి సాక్షులను తీసుకొని రండి అంటాడు తిక్కయ్య. ఆశ అలాగే ఆఫీసర్ గారు అంటూ అత్తయ్య మీరు రండి అంటూ బయటికి తీసుకువెళుతుంది కావేరిని. కావేరి ఇదిగో ఆశ ఆ సాగర్ వాళ్ళు ఎక్కడ వరకు వచ్చారు త్వరగా ఫోన్ చేసి కనుక్కో అంటుంది. ఆశ సాగర్ కు ఫోన్ చేసి సాగర్ ఎక్కడున్నావు ఎంతసేపు అవుతుంది అని అడుగుతుంది. సాగర్ ఇదిగో ఆన్ ది వే ఆశ దగ్గర్లో ఉన్నాం అంటాడు. సాగర్ ఇదిగో లక్ష్మి ఆశ వాళ్ళు ఫోన్ చేశారు దగ్గర్లో ఉన్నామని చెప్పాను నీకు మళ్ళీ అక్కడికి వెళ్లినాక ఎలాంటి అభ్యంతరం లేదు కదా అంటాడు.లక్ష్మీ ఆత్మ ఈరోజుతో మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి ఒక్క సంతకంతో మీ అనుమానాలన్నీ తీరిపోతాయి అనుకుంటూ ఉంటుంది మనసులో.

Kumkuma Puvvu Today Episode December 1 2023 Episode Highlights
Kumkuma Puvvu Today Episode December 1 2023 Episode Highlights

కట్ చేస్తే అరుణ్ కుమార్ ఇంట్లో కావేరి అక్క చంద్రం బావ ఆశ బంటి ఎవరూ కనిపించడం లేదు ఏంటి అనుకుంటూ అమృతను పిలిచి అమృత అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. అమృత ఏమో నాకు తెలియదండి ఉదయం లేచిన కానుండి నాకు వాళ్ళు కనిపించలేదు ఎక్కడికో బయటికి వెళ్ళారేమో అనుకుంటున్నాను అంటుంది అమృత. అరుణ్ కుమార్ రాత్రి వాళ్లు ముగ్గురు కలిసి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు ఇప్పుడు ఉదయాన్నే లేచాక కనిపించడం లేదు వీళ్ళు ఏదో ప్లాన్ వేశారు అమృత అదేంటో మనం తెలుసుకోవాలి అంటాడు అరుణ్ కుమార్.అమృత అవునండి ఈ మధ్య చంద్రం అన్నయ్య కూడా మన వైపు ఉండడం లేదు ఆ ఆశ అత్తయ్య మామయ్య అంటూ వరుసలు కలిపి పిలుస్తుంది కావేరి వదిన చంద్రం అన్నయ్య కూడా తనును సొంత కోడలు లాగే భావిస్తూ తనతో మంచిగా ఉంటున్నారు నాకేమీ అర్థం కావడం లేదు అంటుంది అమృత. అరుణ్ కుమార్ వాళ్లు ఎక్కడికి వెళ్లారు మనకు తెలిసేదెలా అనుకుంటూ పని మనిషిని పిలిచి కావేరి అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు అరుణ్ కుమార్. పనిమనిషి ఏమో ఏమో నండి వాళ్ళు ఉదయాన్నే నేను ముగ్గు వేస్తుండగా ఆరాటపడుతూ వెళ్తుండగా నేను ఎక్కడికి వెళ్తున్నారు అమ్మగారు అని అడిగితే కావేరి అమ్మగారు ఆశ బంటి కి పెళ్లి చేస్తున్నామని చెప్పింది అంతేనండి. అమృత పెళ్లి ఎక్కడని ఏమన్నా చెప్పిందా అంటుంది పనిమనిషి ఆశ అమ్మ ఏదో రిజిస్టర్ అన్నట్టు నాకు వినిపించిందమ్మా అంటుంది పనిమనిషి అరుణ్ కుమార్ అయితే మా అక్క బావ ఆశ తో కలిసి ఈ ప్లాన్ వేశారు అమృత మనం ఎలాగైనా వెళ్లి ఈ పెళ్లిని ఆపేయాలి పదా అంటూ అమృత అరుణ్ కుమార్ రిజిస్టర్ ఆఫీస్ కి బయలుదేరుతారు

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu